Wednesday, May 8, 2024

కార్తీక వనభోజనాల విశిష్ఠత

కార్తీక మాసం మొదలైందంటే ఏదో అనిర్వచనీయ, అధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఈ కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. పైగా ప్రతి సోమవారం శివాలయాలు క్రిక్కిరిసిన భక్తులతో కళకళలాడతాయి. అలాగే నెలలో వీలున్నంత వరకు పిల్లాపాపలతో సహా సమూహాలుగా వనభోజనాలు అనువైన ఆహ్లాదం కలిగించే తోటల్లో ఏర్పాటు చేసుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఆనందంగా ఆటపాటలతో గడుపుట ప్రత్యేకత. ఇవి రానురాను ఆయా కుల వనభోజనా లుగా రూపాంతరం చెందినప్పటికి ఒక్కరోజైనా అయినవారి తోను, బంధుమిత్రులతోను గడిపేందుకు ఈ వన భోజనాలు వేదికలవుతున్నాయి. అసలు కార్తీక మాసంలోనే ఈ వనభోజ నాలు ఏర్పాటు దాని విశిష్టతను తెలుసుకుందాం.
‘వనము’ అంటే అనేక వృక్షముల సముదాయము. ముఖ్యంగా రావి, మఱ్ఱి, మారేడు, మద్ది, మోదుగ, జమ్మి, ఉసిరి, నేరేడు, మామిడి, వేప, పనస, ఇత్యాది వృక్షాలతోను తులసి, అరటి, జామ, కొబ్బరి, నిమ్మ మొక్కలతోను, అనే రకాల పూల మొక్కలతో కూడి వుండాలి. దాహము వేస్తే దప్పిక తీర్చడానికి ఓ సెలయేరు ఉండాలి. ఇవి ఉన్నచోట జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, చిలుకలు మొదలైన సాధు ప్రాణులు తప్పకుండా ఉంటాయి. దానినే ‘వనము’ అంటారు గానీ అడవిని ‘వనము’ అనరు. ‘వనము’ అంటే, వసించడానికి అనువైన ప్రదేశము అన్నమాట. వేటకు, క్రూరత్వానికి తావు లేనిది ‘వనము’. అట్టి వనము దేవతా స్వరూపము. ఎందు కంటే.. పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు.., దేవతలకూ, మ#హ ర్షులకూ ప్రతిరూపాలు. ప్రశాంతతకు, పవిత్రతకు ఆలవాల మైన తపోభూమి. నిర్భయంగా వి#హరించడానికి అనువైన ప్రదేశము. అట్టి వనాలను యేడాదికి ఒక్కసారైనా ప్రత్యేకించి కార్తీకమాసంలో దర్శించండి అని మన పూర్వులు నియమం పెట్టారు. అందుకు ఆధ్యాత్మిక, ఆరోగ్య, ఆనందకరమైన కార ణాలు ఎన్నో ఉన్నాయి.
కార్తీకమాసం నాటికి వానలు ముగిసి, వెన్నెల రాత్రులు ప్రారంభమౌతాయి. చలి అంతగా ముదరని సమశీతోష్ణ వాతా వరణంతో మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే మా సం. ఆధ్యాత్మికపరంగా శివకేశవులకు ప్రీతికరమైనది. అం దుచేత శివ, కేశవ భక్తులు ఒకచోట చేరి, ఐకమత్యంతో ఆనం దంగా గడపడానికి అవకాశం కల్పించే మాసం .
పైన చెప్పిన వృక్షాలు, మొక్కలు, చెట్లు పచ్చగా చిగిర్చి, పరిశుద్ధమైన, ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతిలో వి#హరింపజేసే మాసం ఈ కార్తీకం. పుణ్యప్రదమైన ఈ కార్తీక మాసంలో ‘వనవిహారం చేసిరండి’ అంటే ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే ఆకలేస్తే అక్కడ వండి, వార్చి పెట్టే వారెవరు? అందుకే ‘వనభోజనాలు’ ఏర్పాటు చేసారు మన పెద్దలు. ‘దేవుడి మీద భక్తా? ప్రసాదం మీద భక్తా?’ అంటే పైకి అనక పోయినా ప్రసాదం మీదే భక్తి’ అనేవారు కూడా లేకపోలేదు. కనీసం భోజనం మీద భక్తితోనైనా వనవిహారానికి వచ్చేవారు న్నారు. స్వార్ధంలో పరమార్ధం అంటే ఇదే.
ఇక వనభోజనం అంటే కేవలం తిని, తిరగడమేకాదు. దానికో పద్ధతి, నియమం ఉంది. కాలకృత్యాలు, స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత.. అందరు బంధుమిత్రులు, పరిచయ స్తులు, ఇరుగు, పొరుగు కలిసి, జాతి, మత, కుల వివక్షత లేకుండా ఏర్పాటు చేసుకున్న వా#హనంలో వారు ఎంచుకున్న వనానికి సూర్యోదయానికి పూర్వమే చేరుకోవాలి. ముందుగా ఓ వటవృక్షం క్రింద ఇష్ట దేవతా విగ్రహాలను ఉంచి పూలదండ లతో చక్కగా అలంకరించాలి. ఆనందం పంచుకోవాలంటే వంటవాళ్ళను తీసుకెళ్ళకూడదు. మగవారు పాటలు పాడు తూ కూరలు తరుగుతూంటే ఆడవారు చీరకొంగులు నడు ము చుట్టి అందరూ తలోరకం వంట వండుతూంటే ఉన్న అవ్యానుభూతితో కూడిన ఆనందమే వేరు. పిల్లలంతా కలిసి చేసే అల్లరిలోని మజాయే వేరు. చాటుమాటు కన్నెచూపుల, కుర్రచూపుల కలయికలోని ఖుషీయే వేరు. కొత్తజంటల గుస గుసల తమాషాల వాడే వేరు. అనుభవంతో తలపండిన పెద్దల చురకల వేడే వేరు. ఇన్నిరకాల ఆనందాల మధ్య ఆచారాలకూ, నియమాలకూ అంత ప్రాధాన్యత లేదు. అన్ని రకాల సాంప్ర దాయాలకూ సంస్కృతులకూ సమాన వేదిక వనభోజనాలే!
సామూహికంగా కలసి చేసిన శాకాహార వంట పూర్తి అయిన తర్వాత ఆ వండిన పదార్థాలను పూజాస్ధలానికి చేర్చి అందరూ కలిసి దేవతారాధన చేసి నివేదన సమర్పించి, ఆ ప్రసాదాన్ని అందరూ కొసరి కొసరి వడ్డించుకుంటూ తిం టూంటే ‘ఆహా సామూహిక సహజీవనంలో ఇంత రుచి ఉం దా!’ అని అనిపించక మానదు. అమ్మయ్య సమిష్టి భోజనాల య్యాయి. మరి తిన్నది అరగాలి కదా! ఇక ఆటపాటలదే ప్రముఖస్థానం. అంతరించిపోతున్న ప్రాచీన సాంప్రదాయ ఆటలకు సమాన వేదిక ఈ ‘వనభోజనాలు’.
ఈ వనభోజనాలు గత 15 సం.రాల ముందు వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కార్యాలయ ఉద్యోగు లు, అరమరికలు లేకుండా స్వయంగా పైన చెప్పినట్లు వంట లు చేసేవారు. మార్పు చెందిన వనభోజనాలు క్యాటరింగ్‌, స్థాయికి చేరింది. మనమే వంటలు చేసుకుని నకనకలాడే ఆకలితో ఆలస్యంగా వనభోజనం ఏర్పాటు చేసుకున్న వన భోజనాల ముందు అనేక రుచులతో వండి వడ్డించే క్యాట రింగ్‌ భోజనాలు దిగతుడుపే అని చెప్పక తప్పదు. కనీసం రానురాను పరిమితమవుతున్న కుటుంబ సభ్యులతో అయినా సరే తప్పకుండా ఇంటిదగ్గరే కొద్ది స్థాయిలోనే కనుక వంట కాలు చేసుకు వెళ్లి వనభోజనాలు చేసి ఆనందం ఆధ్యా త్మికత ఆస్వాదించి రండి.

– చలాది పూర్ణచంద్రరావు, 9491545699

Advertisement

తాజా వార్తలు

Advertisement