Monday, November 11, 2024

శివకేశవుల ఆధ్యాత్మిక సౌరభం…కార్తీకమాసం!

హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేశారు. పండుగలు పేరుతో దైవారాధనకు కేటాయించే ప్రత్యేక సమయాలు… ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న వాటిలో అత్యంత ప్రముఖమైనది కార్తీకమాసం. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైంది. ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం, మహిమాన్వితమైంది. కార్తీకమాసం అంటే పరమశివునికి ప్రీతి పాత్రమైనదిగా భావిస్తారు. కానీ ఇది విష్ణుమూర్తి ఆరాధనకూ అత్యంత ప్రధానమైన మాసం. కార్తీకమాసంలో ఎటువంటి మంచి పనిచేసినా కార్తీక దావెూదర ప్రీత్యర్థం అని ఆచరించాలని శాస్త్రోక్తి. కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీకమాసం అంటే పరమ శివుడికి మహాప్రీతి. గరళకంఠుడి తవెూగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు. కాబట్టి కార్తీకంలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్‌,
న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్‌.

కార్తీక మాసంతో సమానమైన మాసం, సత్యయుగంతో సమానమైన యుగ ము, వేదములతో సమానమైన శాస్త్రము, గంగానదితో సమానమైన తీర్థం లేదు.
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. ప్రతి సంవత్సరం దీపావళి వెళ్లిన మరుసటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. పూర్వం నైమిశారణ్యంలో శౌనకాది మహామునులకు సూతమహా ముని కార్తీకమాస వ్రతము వైభవమును వివరించినట్లు మనకు పురాణాల ద్వారా తెలుస్తోం ది. కార్తీకమాసము మానవులకు ఇ#హమును ఈతిబాధలు తొలగించి పరమును మోక్షము కలిగించునని తెలియచేస్తాడు.
శివకేశవులకు ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో చేసే పూజలు వారిరువురి అనుగ్ర#హం కలిగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్ర#హదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వం టి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. ఏక భుక్తము లేక కొన్ని విశేష దినములలో ఉపవాసములు, నిత్యము తులసి దగ్గర దీప ప్రజ్వలన, యధా శక్తి దాన ధర్మములు, దీప దానము మున్నగునవి అత్యంత శుభప్రదములు. ఈ మాసం వివి ధ వ్రతాలకు శుభప్రదమైంది. ఈ నెల రోజులు #హరి#హరులకు విశేషార్చనలు చేస్తూ ‘కార్తీక నత్తాళ్‌’ అనుసరించి తరిస్తారు.

”#హరి: ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాం తకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమ:”

అనే రుద్ర నమకం మంత్ర భాగం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శివాలయములు, జ్యోతి ర్లింగ క్షేత్రములు భక్తులతో నిండిపోతాయి.
కార్తీకంలో సూర్యోదయానికి ముందు విష్ణు సన్నిధిలో శ్రీహరి కీర్తనలు గానం చేస్తే వేల గోవుల దాన ఫలితం, నాట్యం చేస్తే సర్వతీర్థ స్నానఫలం లభిస్తాయి.
విష్ణు, శివాలయాలు లేని ప్రదేశాలలో రావిచెట్టు మొదట్లోగానీ, తులసీవనంలోగానీ భగవంతుని స్మరించుకోవచ్చు. కార్తీక మాసంలో కృత్తికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుని ఆరాధించాలి.
కార్తీక పురాణ పఠనము ఎంతో ప్రసిద్ధి చెందినది. కార్తీక మాసం నెల రోజులు రోజుకు ఒక అధ్యాయము పఠించి, దానిలోని ఆంతర్యమును గ్ర#హంచి, ఆచరించినవారి జన్మ ధన్య త చెందుతుంది. ఈ పురాణ పఠనములో మనకు ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి. దీప దాన మహాత్మ్యము, దీప ప్రజ్వల విధివిధానములు, వనభోజన ప్రాశస్త్యము, అర్చన, విధి విధానములు, ఎందరో భక్తుల జీవిత గాథలు, నదీస్నాన విశేషములు మున్నగునవి మాన వులకు మార్గనిర్దేశము చేస్తాయి.

- Advertisement -

కార్తీకంలో దైవార్చన ఎలాచేయాలి?

అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నా కార్తీకమాసంలో చేసే ఉపవాసం, స్నానం, దానం ఎన్నోరెట్లు ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్బలతోను, శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చిస్తేే వారికి ఇహపర సౌఖ్యాలతోబాటు ఉత్తమగతులు కలుగుతాయి.
అత్యంత ఫలప్రదమైన ఈ కార్తీక మాసమును భక్తిశ్రద్ధలతో ఆచరించి మన సంప్రదా య విధివిధానాలను ముందు తరాలకు పదిల పరచి లోక క్షేమానికి కృషిచేద్దాం. మన #హం దూ పండుగలలో, ఉత్సవాలలో ఆధ్యాత్మిక తత్వంతో పాటు లోక కల్యాణము, ప్రకృతి పరిరక్షణ వంటి విజ్ఞాన విషయాలు కూడా దాగివుంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement