Sunday, April 28, 2024

‘మూడు’ గీతల అంతరార్థం!

పురుషులు నుదిటిన గంధాన్ని, స్త్రీలు కుంకుమను ధరించటం హైందవ సంప్రదాయం. విష్ణువుకు సంబం ధించిన పురాణాలు, విష్ణు కథలు బాగా ప్రాచుర్యం పొందిన తర్వాత, మహా విష్ణువే అధికుడు అని ప్రచారం విష్ణు ప్రియులు చేసుకోవడం, మహా శివుణ్ణి యిష్టపడే వాళ్ళకు యిష్టపడలేదు. భరించ శక్యంకాలేదు. ఫలితంగా వైష్ణవులు శైవుల మధ్యన తీవ్రమైన విబేధాలు పొడచూపేయి. శివుడే గొప్పవాడని శైవులు, విష్ణువే గొప్పవాడని వైష్ణవులు అనుకుంటూ హిందూ సమాజం నిట్ట నిలువునా చీలిపోయింది. మతఛాందస ఉద్రేకాలతో పగ ప్రతీకారాలతో ఒకరి మీద మరొ కరు దారుణ మారణకాండకు పాల్పడ టం జరిగేది. అలాంటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో, తమ వాళ్ళని గుర్తించేం దుకు, గుర్తింపు కోసం నిలువు, అడ్డ గీతలు ఏర్పరుచుకున్నారు. వైష్ణవులు నిలువు గీతలు (నామాలు), శైవులు అడ్డగీతలు (విభూతి పట్టీలు) పెట్టుకోవ టం ఆనవాయితీ అయింది. అయితే వైష్ణవులు, శైవులు యిరువురూ మూడు గీతలే పెట్టుకున్నారు. ఇది యిక్కడ గమనించాల్సిన అంశం. మూడు గీతలే ఎందుకు? హైందవ ధర్మం ”మూడు”ను ధార్మిక సంఖ్య గా, తొమ్మిదిని బ్రహ్మ సంఖ్యగా పరిగ ణించింది. ఇదే మూడు గీతల పర మార్థం. శైవుల విభూతి ధారణ వెనుక, వైష్ణవుల నామధారణ వెనుక అప మృత్యు దోషాలు తొలగిపోతాయనే విశ్వాసమే కారణం. అద్వైత తత్వానికి (పరమాత్మయే సత్యం అనే తత్వం) ప్రతీకగా ఒక గీత, పరమాత్మ జీవాత్మ యిద్దరూ సత్యమే అనే ద్వైత తత్వానికి ప్రతీకగా మరో గీత, విశిష్టాద్వైత తత్వానికి ప్రతీకగా మూడో గీత, మొత్తం 3 గీతలు వచ్చేయని చెప్పవచ్చు. ద్వైత, అద్వైత, విశిష్టా ద్వైత తత్వాలు మూడింటినీ సమ్మతిం చటమే మూడు గీతలు వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం.
– రమాప్రసాద్‌ ఆదిభట్ల,
93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement