Friday, March 29, 2024

Flash.. Flash: పెన్నాకు పోటెత్తిన వ‌ర‌ద‌.. జల దిగ్బంధంలో కోలగట్ల.. ప్ర‌మాదంలో 30 మంది గ్రామ‌స్తులు

సంగం, (ప్ర‌భ న్యూస్‌): నెల్లూరు జిల్లా సంగం మండలంలో కొన్ని గ్రామాలు సోమ‌శిల బ్యాక్‌వాట‌ర్‌లో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వ‌స్తున్న వ‌ర‌ద నీటితో సోమ‌శిల జ‌లాశ‌యం పూర్తిగా నిండింది. దీంతో దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సోమ‌శిల నుంచి పెన్నా న‌దికి నీరు భారీగా వ‌స్తోంది. ఒక వైపు వ‌ర్షాలు.. మ‌రోవైపు భారీ వ‌ర‌ద‌ల‌తో న‌ది నుంచి నీరు ఒక్క‌సారిగా ముంచుకొచ్చింది.

దీంతో కోలగట్ల గ్రామంలోని అరుంధతి వాడ జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకుంది. ఆ గ్రామానికి చెందిన దాదాపు ముప్పై మంది వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. సోమ‌శిల బ్యాక్ వాట‌ర్ ఈ కాల‌నీని ముంచెత్తిన విష‌యం తెలుసుకున్న బుచ్చిరెడ్డిపాళెం సీఐ కోటేశ్వ‌ర‌రావు అక్కడి వారితో ఫోన్‌ ద్వారా సమాచారం తెలుసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీని ఏర్పాటు చేసి వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న బాధితుల‌ను కాపాడేందుకు రెస్క్యూ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement