Wednesday, May 15, 2024

అంతర్గత శత్రువు అసూయ

ప్రతి వ్యక్తీ గొప్పవాడు కావాలని కలలు కంటు-ంటాడు. ఇది సహజం. కానీ,అందరికన్నా గొప్పవా డు కావాలని కొందరు ఆరాట పడతారు. అలా కావటానికి చేతనై న అన్ని రకాల విధానాలూ అనుసరిస్తారు. దేని-కై-నా సిద్ధపడతా రు. కొందరు విశేషంగా ధనం సంపాదించి, తాము గొప్పవార మనే భ్రమతో గర్విస్తారు. మరికొందరు హోదా లభించగానే అధి కార దర్పం, అహంకారం ప్రదర్శిస్తారు. ఇది కూడా ఆధిక్యతాభావం వల్లనే! కొందరు తమకంటే అందరూ తక్కువ స్థాయిలోనే ఉండాలని కోరుకుంటారు. తమకన్నా ఎవరు మించి పోతున్నా భరించలేరు. అసూయతో కుమిలిపోతారు. అవకాశం లభిస్తే, ఏదోవిధంగా, తమ కన్నా అధికులకు అపకారం చేస్తారు. వారికి కష్టనష్టాలు కలిగినప్పు డు, లోలోపల సంతోషపడుతూ, పైకి సానుభూతి ప్రకటిస్తారు.
దుర్యోధనుడికి సుయోధనుడు అనే మరొక పేరు ఉంది. నిజానికి అతడు అసూయాధనుడు. పాండవుల ఔన్నత్యాన్ని, ఆధిక్యత సహించలేకపోతుండేవాడు. బాల్యం నుంచే పాండ వుల పట్ల అసూయ, ద్వేషం కలిగి ఉండేవాడు. అసూయ అగ్ని వంటిది. ద్వేషమూ అంతే. ఏ కర్ర నిప్పు ఆ కర్రనే కాల్చినట్టు-, ఎవరు అసూయాపరులో, వారినే అసూ యా ద్వేషాలు దహి స్తాయి. ఇది నిత్య సత్యం.
స్పర్ధయా వర్ధతే విద్య… చదువులో అసూయ తప్పులేదు. కానీ, అది ద్వేష పూరితంగా ఉండకూడదు. పోటీ- తత్వంతో, పట్టు-దలగా విద్య నేర్వా లి. వాయి దాలు వేయకుండా విద్యాకృషి చె య్యాలి. కృషితో నాస్తి దుర్భిక్షం-… నిరంతర కృషి ఒక్కటే విజయ ద్వారాలకు తాళపు చెవి. మరే అడ్డదారులూ ఉండవు. సత్కార్యాలకు ఆలోచన- ఆచరణ మధ్య ఆలస్యం ఉండకూడదు. కర్ణుడు ఎడం చేత్తో బంగారు పాత్రను దానం చేయటానికి గల కారణం చెబుతూ- చెయ్యి మార్చుకునే లోగా మనసు మారిపోవచ్చు అనటం అందరికీ ఆదర్శం.
ప్రజాసేవ చేస్తామనేవారికన్నా, చేస్తున్నవారినే ప్రజలు నమ్ము తారు. అలాగే భక్తిని బోధించేవారిని కాకుండా, భక్తిగా జీవించేవా రినే భగవంతుడు సైతం ఇష్టపడతాడు. అసూయ లేకపోవటం ఎంత గొప్పదంటే- అసూయలేని ఏ-కై-క మహిళగా, అత్రి మహర్షి అర్ధాంగిగా వినుతికెక్కిన అనసూయా దేవి పుత్రుడిగా జన్మిం చటానికి, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు ఇష్టపడ్డాడు.
అసూయలేని హృదయం పరిశుద్ధ దేవాలయం. అసూయ లేదంటే, ప్రేమకు నిలయమని అర్థం. ప్రేమ పున్నమి వెన్నెల వంటి ది. అందర్నీ ఆకట్టు-కొంటు-ంది. భగవంతుని కూడా ప్రసన్ను ణ్ని చేస్తుంది. అసూయ లేనివారికి ద్వేషం ఉండదు. శత్రువులూ ఉండరు. ఉన్నత వ్యక్తిత్వం కేవలం అసూయా రహితులకే సాధ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement