Wednesday, February 28, 2024

సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాలు విడుదల… 93.12శాతం ఉత్తీర్ణత

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి పరీక్ష ఫలితాలను కాసేపటి క్రితం ప్రకటించింది. సీబీఎస్‌ఈ టెన్త్ పరీక్షల్లో 93.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అయితే గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం 1.28 శాతం తగ్గింది. సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. ఇక, 1.34 లక్షల మంది విద్యార్థులు కంపార్ట్‌మెంట్ విభాగంలో నిలిచారు. విద్యార్థులు DigiLockerతో పాటు results.cbse.nic.in, cbseresults.nic.inలలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. పాఠశాల నెంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన తేదీని ఉపయోగించి ఫలితాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement