Wednesday, May 1, 2024

కర్మఫలాన్నిచ్చే దాత… పరమాత్మ!

ధనస్సు నుండి విడిచిన బాణం తిరిగి వెనుకకు రాదు. మామిడి పండు కోసం చెట్టు మీదకు విసరిన రాయిని వెనుకకు రప్పించలేము. అవి నీ గురిని తప్పి ఏదైనా అన ర్థం తీసుకు వచ్చినా భరించవలసిందే! అదేవిధంగా మనం చేసే పనులు మంచివైనా, చెడువైనా మొదలుపెట్టిన తరువాత నియంత్రణ లేకుండా ముగిసిపోవడం సహజం. ఫలి తాన్ని ఆశించి చేసే కర్మకు తగిన ఫలం లభించడం కూడా మన నియంత్రణలో ఉండదు. కర్మలు చేపట్టే వరకే మన చేతిలో ఉన్నట్లు భ్రమించడం జరుగుతుంది. ఫలితం మాత్రము ఖచ్చితంగా మన చేతిలో ఉండదు. కర్మకు తగిన ఫలితాన్ని పొందగలిగే శక్తి కూడా మన దగ్గ ర ఉండదు. కానీ విచిత్ర కర్మలు మన చేత కొనసాగించబడుతూనే ఉంటాయి. జ్ఞానంతో చేసే కర్మలు ఆనందం కలిగిస్తాయి. అజ్ఞానంతో చేసే కర్మలు పాపపు రూపుదాల్చి దు:ఖాన్ని మిగులుస్తాయి. కర్మకు ఫలితాన్ని ఇచ్చేదాత మాత్రం పరమాత్మ. సృష్టి ధర్మాన్ని అను సరించి జన్మిస్తారు, జీవిస్తారు, మరణిస్తారు. సృష్టి నియమాన్ని ఏ జీవి ఉల్లంఘించ లేదు.
మానవ శరీరంలోని అవయవాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మనకు తెలిసి కొన్ని పనిచేస్తే, మనకు తెలియకుండా రాత్రింబవళ్ళు వాటి కర్మలు అవి నిర్వర్తిస్తూ ఉన్నా యి. నిజానికి అవి ఏ ఫలితాన్ని ఆశించి పనిచేస్తున్నాయి? విశ్వకర్త పరమాత్మ ఆజ్ఞను శిరసా వహిస్తున్నాయి. అందువలననే జీవుడు నిమిత్తమాత్రుడయ్యాడు. ఈ సత్యాన్ని తెలుసు కోలేని అజ్ఞానం వల్ల కర్మలన్నీ ”నేను” చేసాను, ”నేనే” చెెస్తున్నాను అని భావిస్తున్నాం. ఈ దేహ యంత్రాన్ని నడిపిస్తున్న విశ్వకర్తను విస్మరిస్తున్నాము. పరమాత్మ ఆజ్ఞతోనే ఈ సృష్టిలో ప్రతి కర్మ జరుగుతోంది. నీకు దొరికిన కర్మను ఫలాపేక్ష రహితంగా, సృష్టి ధర్మ బద్ధంగా నిర్వర్తించడమే నీ కర్తవ్యం అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. ఫలితాన్ని ఆశిం చడమే స్వార్థానికి మార్గం తెరచినట్లు భావించాలి.
స్వార్థమే ఘర్షణకు మూలం. దాని నుండి అశాంతి ప్రబలుతుంది. అశాంతి ఆనందా నికి దూరం చేస్తుంది. భౌతిక ఆనందాన్ని పొందడానికి అనేక కర్మలు చేపట్టి రకరకాల వస్తు సామాగ్రిని ఉత్పత్తి చేయక తప్పదు. ఈ తాపత్రయ యాత్రలో గమ్యం లేదు. గమ్యమే లేని ఈ ప్రయాణంలో శాంతి, సంతృప్తి, ఆనందం అనేవి ఎండమావులు. అందుకే శ్రీరమణులు తమ ఉపదేశ సారంలో
కృతిమహోదధౌ పతన కారణమ్‌
ఫలమశాశ్వతం గతి నిరోధకమ్‌
కర్మలనే మహాసముద్రంలో జీవుడు చిక్కుకొని పతనమై అజ్ఞానం వల్ల మరల మరల కర్మఫలములను ఆశించి మోక్షానికి దూరమవుతున్నాడు. కొన్నిసార్లు అకర్మలను చేపట్టి దు:ఖానికి, పాపఫలానికి దగ్గరవుతున్నాడు అని తెలియచేసారు. అజ్ఞానంతో ఫలితాన్ని ఆశించి కర్మలు చేపట్టేవారికి మోక్షం, ముక్తి అనేవి బ్రహ్మపదార్థాలని భావించవచ్చు. వాటి గురించి ఆలోచించే సమయము కూడా వారికి ఉండదు.
నేడు మనకి కనబడే ఈ అజ్ఞానంతో కూడుకున్న అశాంతికి కారణం కోరిక. కోరికలు అనంతం. అవి ఏనాటికి తీరేవి కాదు. కోరికలు తీర్చుకోవడం కోసం కర్మలు చేసినంత కాలం ఫలితాలు దు:ఖదాయకంగానే ఉంటాయి. అందువలన కోరికను నియంత్రించుకొని దొరికి న పని లేదా ఉద్యోగం ఈశ్వరార్పణ బుద్ధితో నిర్వర్తిస్తే తగిన ఫలితాన్ని పొంది ఆనందంతో ఈ స్వల్ప జీవితాన్ని కడతేర్చుకోవచ్చు. కానీ నేటి ఈ పోటీ ప్రపంచంలో నేను అనే అహంకా రంతో ఒకరినొకరు పోల్చుకుంటూ చివరికి అశాంతితో అగమ్యగోచరులవుతున్నారు. ఈ అకర్మల ప్రహేళికలో ఒకరినొకరు దోచుకుంటూ చివరకి ఒకరికొకరు ప్రశ్నార్థకమగుచు న్నారు. చిన్న చేపను పెద్ద చేప తినే సముద్ర న్యాయము మానవుల మధ్య ప్రబలిపోవడం అజ్ఞానం కాక మరేమిటి?
మానవ న్యాయమంటే కరుణ, ప్రేమ, దయ, అహింస, నైతిక విలువలతో ప్రకృతిని రక్షించుకుంటూ అందరూ ఆనందంగా జీవించడం కానీ ప్రస్థుతం దీనికి విరుద్ధంగా ప్రపంచం రోజురోజుకీ దిగజారిపోవడం చాలా బాధాకరం. కోరికలు, కాంక్షలు, భోగలాల సత్వం, అసుర స్వభావాన్ని పెంపొందిస్తున్నాయి ఆధ్యాత్మిక తత్త్వవేత్తల బోధలు యువత కు అందడం లేదు. మానవత్వ మధురిమలు తిరిగి వికసించాలంటే మరుగున పడుతున్న జ్ఞానుల బోధలు విస్తృతంగా ప్రచారం కావాలి. నిశ్చలమైన మహాసంకల్పం కోసం స్వామీ వివేకానంద ఏమన్నారో చూద్దాం…
మనం చేసే ఏ పనికైనా ఉన్నతమైన భావనతో చేయాలి. ఇది నా వల్లే జరుగుతుంది అనే అహంకారం దరిచేరకూడదు. అప్పుడే చిత్తశుద్ధి, నైపుణ్యంతో పనిచేస్తాం. అప్పుడే అది పది మందికి ప్రయోజనం చేకూర్చుతుంది. సమస్త కర్మలనూ ఆవిధంగానే చేయాలని భగవద్గీ త బోధిస్తోంది. అలా కర్మలను ఆచరించేవారు యోగా రూఢులవుతారు. వారు స్వప్రయోజ నాన్ని ఆశించరు. అప్పుడే వారి వల్ల లోకానికి శుభం చేకూరుతుంది.
సమస్త కర్మల ఫలితం మంచి చెడుల సమ్మిశ్రితం… లేశ మాత్రంగానైనా చెడు కలవని మంచి కార్యం అంటూ ఉండదు. నిప్పును ఆవరించి ఉండే పొగలో ప్రతి మంచి పనినీ కొం త చెడు అంటుకొనే ఉంటుంది. సాధ్యమైనంత ఎక్కువ మంచిని, వీలైనంత తక్కువ చెడును కలిగించే పనులలోనే మనం నిమగ్నులం కావాలి. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రా మంలో భీష్మ, ద్రోణులను అర్జునుడు సంహరించాడు. ఆపని చెయ్యకపోతే దుర్యోధనుణ్ణి జయించడం సాధ్యమయ్యేది కాదు. అధర్మమే ధర్మాన్ని అణచివేసి ప్రబలమయ్యేది. అప్పుడు దేశం అరిష్టం పాలయ్యేది. అలాగే శ్రీకృష్ణుడు క్రూరులైన కంసుడు, జరాసంధుడు మొదలగు వారిని వధించాడు. ఆయన తనకంటూ చేసుకున్న పని ఒక్కటీ లేదు.ఆయన ప్రతి కర్మనూ ఇతరుల మేలుకోసమే చేసాడు. దీపం వెలుగులో భగవద్గీతను, ఇంకా అనేక గ్రంథాలను చదివే కాలంలో దీపపుజ్వాలను తాకి ఎన్నో పురుగులు చనిపోయేవి. ఆవిధంగా మనం చేసే సత్కార్యాలలో కొంత చెడు జరగడం సహజం. అయితే ఎలాంటి కోరికలు, అనురాగాలు, స్వార్థం లేకుండా చేసే ఫలాపేక్ష రహిత కర్మల మనోనిశ్చలత సాధ్యమవు తుంది. నిశ్చలమైన మనసు లోకకళ్యాణం కోరుకుంటుంది. అదే కర్మయోగం. వివేకానం దుని ఈ మాటలు త్యాగానికి బాటలు కావాలని ఆశిద్దాం. ప్రపంచ మానవులకు ఆదర్శంగా నిల వాలని కోరుకుందాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement