Wednesday, December 6, 2023

విశిష్టావతారుడు శ్రీ సాయినాథుడు

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, భక్త జన సంరక్షణ తన ధ్యేయంగా ఈ భువిపై అవతరించిన శ్రీ సాయి నాథు లది ఒక విశిష్టమైన అవతారం. ఆయన తన భక్తులపై అపారమైన కారుణ్యం, ప్రేమానురాగాలను వర్షి స్తుండే వారు. కొన్నికొన్ని సందర్భాలలో భక్తులు తమ బాధలను మోయలేనప్పుడు వారిపై వాత్స ల్యంతో ఆ బాధలను తానే స్వీకరించేవారు. తర్వాత అసలు సంగతిని తెలుసుకున్న భక్తులు శ్రీ సాయి తమపై కురిపించే అపారమైన కరుణామృతమునకు ముదమొంది ఆ అవతారమూర్తిని మరింత భక్తిశ్రద్ధ లతో కొలుస్తూ వుండేవారు. అటువంటి ఒక లీలను ఇప్పుడు మనం స్మరించుకుందాము.
అమరావతి పట్టణంలో నివసించే సాయి భక్తా గ్రేసరుడు దాదాసాహబ్‌ ఖపర్డే యొక్క భార్య తన చిన్న కొడుకుతో కలిసి శిరిడీలో కొన్ని నెలలు పాటు వుంది. ఒకరోజున ఆ పిల్లవాడికి తీవ్రంగా జ్వరం వచ్చింది. వెంటనే అది ప్లేగు జ్వరంగా మారింది. ఆ రోజులలో ప్లేగు వ్యాధికి సరైన మందులు దొరకక పోవడం వలన దానిని చాలా ప్రాణాంతకమైన వ్యా ధిలా భావించేవారు. అందువలన ఆ తల్లి చాలా భ యపడిపోయింది. అమరావతికి తిరిగివెళ్ళి అక్కడ భర్త సహాయంతో ఆ పిల్లవాడికి మంచి వైద్యం చేయించుదామని, ఆ రోజు సాయంత్రం బాబాను సెలవు అడుగుదామని వెళ్ళింది. బూటీవాడా వద్ద నిల్చున్న బాబాకు నమస్కరించి తన బాధను, భయాన్ని చెప్పుకొని శిరిడీ విడిచి వెళ్ళడానికి శెలవు అడిగిందామె. అప్పుడు శ్రీ సాయి మృదువైన కంఠం తో ”అమ్మా! ఏమాత్రం భయపడవలదు. ప్రస్తుతం ఆకాశంమేఘావృతమైవుంది. కొద్దిసేపటిలో మబ్బు లన్నీ తొలగిపోయి ఆకాశం నిర్మలమౌతుంది.” అని వెంటనే తన కఫ్నీని పైకెత్తి ఆయన శరీరంపై కోడి గుడ్డు పరిమాణంలో వున్న ప్లేగు పొక్కులను చూపిం చి ”నా భక్తుల కొరకు నేనెంత బాధపడుతున్నానో చూడండి, వారి బాధలన్నీ నావే” అని అన్నారు. ఆ దృశ్యాన్ని చూసినవారందరి హృదయాలు ద్రవించి పోయాయి. శ్రీసాయి హృదయం వెన్నకంటే మృదు వైనది, మనసు మైనంకంటే మెత్తనైనది. తనకు సర్వ శ్య శరణాగతి చేసిన భక్తుల బాధలను వారు భరించ లేమని భావించినప్పుడు వాటిని తమ పై స్వీకరించి అనుభవించే శ్రీ సాయి యొక్క భక్త జన వత్సలతకు, కారుణ్యానికి ఇంతకంటే రుజువేం కావాలి? తనను శరణు పొందిన భక్తుల బాధలు, సమస్యలు, సమ స్తం ఆయనే స్వీకరించి, స్వయంగా అనుభవించి తద్వారా భక్తులను బంధ విముక్తులను చేస్తున్నారు. ప్రత్యుపకారం ఏమీ ఆశించక భక్తులను సదా రక్షించ దమనే అవతార కార్యాన్ని అతి సమర్ధవంతంగా నిర్వర్తించే శ్రీ సాయినాథులకు శిష్యులమైనందుకు మనం గర్వించాలి. ఆనందంతో నాట్యం చేస్తూ ఆ సాయినాథునికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి.
సాయినాథుని పలుకులను విశ్వసించిన ఖపర్డే భార్య వెంటనే తన బసకు వెళ్ళింది. సాయి ఇచ్చిన విభూతిని ఆ పిల్లవాడి నుదిటిపై వ్రాసి, కొంత నీటిలో కలిపి పవిత్ర తీర్ధంవలే త్రాగించి ”సాయి నామస్మ రణ” చేస్తూ కుమారుడి పక్కనే కూర్చుంది. అద్భు తం! అపూర్వం! ఏ మందులు వేయకనే, ఏ చికిత్సా చేయకనే కొద్దిసేపటిలోనే అతి ప్రాణాంతకమైన ప్లేగు జ్వరం తగ్గుముఖం పట్టనారంభించింది. చెమటలు పట్టసాగాయి. ఆ కుమారుడికి తెలివి వచ్చింది. ఎం తగానో తల్లడిల్లుతున్న ఆ తల్లి హృదయం కుదుట పడసాగింది. అంతలోనే ఆ పిల్లవాడు లేచి ఆడుకో సాగాడు. శ్రీ సాయిని స్మరిం చి, పరిశుద్ధమైన హృద యంతో శరణు వేడితే చాలు! ఎంతటి వ్యాధులైనా మటుమాయం. శ్రీ సాయి పలుకులు కరుణామృత మైన చూపులే భక్త జను లకు దివ్యౌషధం.

Advertisement

తాజా వార్తలు

Advertisement