Wednesday, April 24, 2024

పెట్టుబ‌డుల‌కు తెలంగాణ చాలా ఆద‌ర్శ‌వంతం.. మంత్రి కేటీఆర్

న్యూయార్క్ సిటీలోనే తాను చ‌దువుకుని ..ప‌నిచేసిన‌ట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. న్యూయార్క్ లో జ‌రిగిన ఇన్వెస్ట‌ర్ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్.. ఆ స‌మావేశాన్ని కౌన్సులేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా, యూఎస్ ఇండియా స్ట్రాట‌జిక్ పార్ట్న‌ర్‌షిప్ ఫోర‌మ్ సంయుక్తంగా నిర్వ‌హించాయి. రౌండ్‌టేబుల్ స‌మావేశాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. న్యూయార్క్ సిటీతో త‌న‌కు ఉన్న లోతైన అనుబంధాన్ని ఆయ‌న పంచుకున్నారు. పెట్టుబ‌డుల‌కు తెలంగాణ రాష్ట్రం చాలా ఆద‌ర్శ‌వంతంగా ఉంటుంద‌ని, ఎటువంటి వ్యాపారాన్ని అయిన మొద‌లుపెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ‌న‌రులు ఉన్న‌ట్లు కేటీఆర్ వెల్ల‌డించారు. తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ట్విట్ట‌ర్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడిన విష‌యాల‌ను ట్వీట్ చేశారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు విష‌యంలో తెలంగాణ స‌ర్కార్ ప్రగ‌తిశీల ప‌థంలో వెళ్తున్న‌ట్లు ఆయ‌న మంత్రి తెలిపారు. త‌మ విధానాలు ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుకూలంగా ఉన్నాయ‌న్నారు.

ఇన్నోవేష‌న్ వ్య‌వ‌స్థ‌ను ఉత్తేజ ప‌రిచే విధంగా ఉన్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం మొత్తం 14 రంగాల‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని, ఆ రంగాల‌కు విస్తృత రీతిలో అవ‌కాశాల‌ను కూడా క‌ల్పిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఇండియాను ల‌క్ష్యంగా ఎంపిక చేసుకునే పెట్టుబ‌డిదారుల‌కు తెలంగాణ స్వ‌ర్గ‌ధామంగా నిలుస్తుంద‌ని మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. ఇదే రౌండ్‌టేబుల్ స‌మావేశంలో ఇండియ‌న్ కౌన్సుల్ జ‌న‌ర‌ల్ ర‌ణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాపార అంశాల్లో.. తెలంగాణ‌, హైద‌రాబాద్ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాయ‌న్నారు. మంత్రి కేటీఆర్ చురుకుద‌నాన్ని ఆయ‌న విశేషంగా మెచ్చుకున్నారు. మంత్రి కేటీఆర్ త‌న విన్నూత విధానాల‌తో హైద‌రాబాద్‌ను విశ్వ‌వ్యాప్తం చేస్తున్నార‌ని ర‌ణ్‌ధీర్ తెలిపారు.ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేశ్ రంజ‌న్‌, ఇన్వెస్ట్‌మెంట్ ప్ర‌మోష‌న్ అండ్ ఎన్ఆర్ఐ అఫైర్స్ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ ఈ విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డి కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement