Tuesday, May 14, 2024

‘సమతా స్ఫూర్తి’ ఆధ్యాత్మిక గీతం

గీతాన్ని ఆవిష్కరించిన చినజీయర్‌ స్వామీ
లక్ష్మణ్‌ మురారి టీమ్‌ రూపొందించిన సమతా స్ఫూర్తి ఆధ్యాత్మిక గీతాన్ని త్రిదండి చినజీయర్‌ స్వామి విడుదల చేశారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా అత్యంత వైభవోపేతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న 216 అడుగుల ఎత్తయిన రామానుజ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఎంఎల్‌ఏ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి నిర్వహణలో కాకతీయ ఇన్నోవేటివ్‌ అధినేతలు లక్ష్మణ్‌ మురారి, రమేష్‌ ఆధ్వర్యలో నిహాల్‌ కొండూరి సంగీత దర్శకత్వంలో రూపొందించిన శ్రీరామానుజం సమతా స్ఫూర్తి అనే ప్రత్యేక ఆధ్యాత్మిక గీతానికి సంబంధించిన సీడీని చినజీయర్‌ స్వామి ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement