Thursday, May 2, 2024

మత్స్య రంగానికి ప్రోత్సాహం : స్పీకర్ తమ్మినేని సీతారాం

ఆమదాలవలస : రాష్ట్ర స్థూల ఆర్థిక ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో మత్స్య పరిశ్రమను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమీకృత నీటిపారుదల, వ్యవసాయ పరివర్తన పథకం ద్వారా సుమారు 31,500 మంచినీటి రొయ్య పిల్లలను పంపిణీ చేసి రామచంద్రపురం సాగరం చెరువులో బుధవారం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా సభాపతి తమ్మినేని మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్స్య పరిశ్రమ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. స్థానికంగా ఉన్న మత్స్యకారులను ప్రోత్సహించి మత్స్య పరిశ్రమ పై ఉపాధి పెరగాలనే ఉద్దేశంతో రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. చేప పిల్లలను పశ్చిమగోదావరి జిల్లా నుండి తీసుకువచ్చి శత శాతం రాయితీపై అందిస్తున్నామని చెప్పారు. మత్స్య సంపద పెంచాలనే ఉద్దేశంతో మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్స్ లు, లైట్లు, చేప పిల్లలు, రొయ్య పిల్లలు ఉచితంగా ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతోందని ఆయన వివరించారు.

రాష్ట్రంలో 973 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉందని, దానిని అభివృద్ధి పరిచి మత్స్య సంపదను వెలికితీసి విదేశాలకు పంపించడం ద్వారా ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార జె.డి శ్రీనివాస రావు, ఏ డి సంతోష్ కుమార్, అభివృద్ధి అధికారి సురేష్ కుమార్, స్థానిక నాయకులు తమ్మినేని శ్రీరామమూర్తి, కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ సింహాచలం, వి ఎఫ్ ఏ ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement