Tuesday, May 7, 2024

తిరుచ్చిపై సోమస్కందమూర్తి

తిరుపతి : తిరుపతి కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కామాక్షి సమేత సోమస్కంధమూర్తి తిరుచ్చిపై అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. మహాదేవుడైన కపిలేశ్వరస్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచ్చి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరతాయని ఐతిహ్యం. కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. విశేషంగా భక్తులు పాల్గొన్నారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను రష్యా నుండి వచ్చిన విదేశీ భక్తులు ఆద్యంతం తిలకించి ఆనందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement