Tuesday, April 16, 2024

Ugadi Panchangam | శోభకృత్‌ నామ సంవత్సరంలో వృశ్చిక‌ రాశివారికి ఎలా ఉంటుందంటే..

ఆదాయం – 05, వ్యయం – 05
రాజ్య పూజ్యం – 03, అవమానం – 03

గురువు 22.3.2023 ఉగాది నుండి 21.4.2023 వరకు మీనరాశి 5వ స్థానమై శుభుడైనందున వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటు-ంది. ఆకస్మిక ధనలాభాన్నిపొందుతారు. కుటు-ంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.22.4.2023 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 6వ స్థానమై సాధారణ శుభుడైనందున ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటు-ంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.

శని 22.3.2023 ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 4వ స్థానమై అశుభుడైనందున అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.

రాహువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు మేషరాశి 6వ స్థానమై శుభుడైనందున మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు.మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి. 31.10.2023 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 5వ స్థానమై సాధారణ శుభుడైనందున పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టు-దలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతనవ్యక్తులు పరిచయమవుతారు.

- Advertisement -

కేతువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు తులారాశి 12వ స్థానమై శుభుడైనందున ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.అకస్మిక ధననష్టమేర్పడకుఉంగా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటు-ంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.31.10.2023 నుండి వత్సరాంతం వరకు కన్యారాశి 11వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు
విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement