Monday, October 7, 2024

Ugadi Panchangam | శోభకృత్‌ నామ సంవత్సరంలో తుల రాశివారికి ఎలా ఉంటుందంటే..

ఆదాయం 14, వ్యయం – 11
రాజ్య పూజ్యం 07, అవమానం-07

గురువు 22.3,2023 ఉగాది నుండి 21.4.2023 వరకు మీనరాశి 6వ స్థానమై సాధారణ శుభుడైనందున ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు.దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటు-ంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది. 22.4.2023 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 7వ స్థానమై శుభుడైనందున రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీసంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవమర్యాదలు
లభిస్తాయి. శుభవార్తలు వింటారు.

శని 22.3.2023 ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 5వ స్థానమై అశుభుడైనందున ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమెర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టు-దల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్నివదిలివేయడం మంచిది.

రాహువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు మేషరాశి 7వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్నం మేరకు స్వల్ప లాభముంటు-ంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాయింటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. 31.10.2023 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 6వ స్థానమై శుభుడైనందున మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు| గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.

- Advertisement -

కేతువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు తులారాశి 1వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటు-ంబ కలహాలకు దూరంగా వుంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. 31.10.2023 నుండి వత్సరాంతం వరకు కన్యారాశి 12వ స్థానమై శుభుడైనందున ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటు-ంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement