Saturday, May 27, 2023

Ugadi Panchangam | శోభకృత్‌ నామ సంవత్సరంలో ధ‌నూ రాశివారికి ఎలా ఉంటుందంటే..

ఆదాయం – 08, వ్యయం-11
రాజ్య పూజ్యం 06, అవమానం – 03

గురువు 22.3.2023 ఉగాది నుండి 21.4.2023 వరకు మీనరాశి 4వ స్థానమై అశుభుడైనందున అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది.ఋణప్రయత్నాలు చేస్తారు. 22.4.2023 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 5వ స్థానమై శుభుడైనందున వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటు-ంది. ఆకస్మిక ధనలాభాన్నిపొందుతారు. కుటు-ంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.

- Advertisement -
   

శని 22.3.2023 ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 3వ స్థానమై శుభుడైనందున కుటు-ంబమంతా సంతోషంగా నుంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటు-ంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.

రాహువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు మేషరాశి 5వ స్థానమై సాధారణ శుభుడైనందున పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టు-దలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతనవ్యక్తులు పరిచయమవుతారు. 31.10,2023 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 4వ స్థానమై అశుభుడైనందున చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలుంటాయి.

కేతువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు తులారాశి 11వ స్థానమై శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి. 31.10.2023 నుండి వత్సరాంతం వరకు కన్యారాశి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటు-ంబ పరిస్థితులు సంతృప్తి కరంగా నుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్నిపనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు.ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement