Friday, March 29, 2024

Ugadi Panchangam | శోభకృత్‌ నామ సంవత్సరంలో మకర రాశివారికి ఎలా ఉంటుందంటే..

ఆధాయం 11 – వ్యయం 05
రాజ్య పూజ్యం 02, అవమానం – 06

గురువు 22.3. 2023 ఉగాది నుండి 21.4.2023 వరకు మీనరాశి 3వ స్థానమై సాధారణ శుభుడైనందున బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటు-ంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేక పోతారు. 22.4.2023 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 4వ స్థానమై అశుభుడైనందున అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం. బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది.
ఋణప్రయత్నాలు చేస్తారు.

శని 22.3.2023 ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 2వ స్థానమై శుభుడైనందున కుటు-ంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృథా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.

రాహువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు మేషరాశి 4వ స్థానమై అశుభుడైనందున చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలేర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.ప్రయాణాలుంటాయి. 31.10.2023 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 3వ స్థానమై శుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.

కేతువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు తులారాశి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగానుండుటచే మానససికానందాన్నిపొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వెయబడిన కొన్నిపనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. 31.10.2023 నుండి వత్సరాంతం వరకు కన్యారాశి 9వ స్థానమై సాధారణ శుభుడైనందున స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు.నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. నూతనకార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement