Thursday, May 2, 2024

శ్రీకృష్ణ హృదయిని రాధాదేవి

పరాశక్తి అంశతో రాధ కృష్ణావతార సమ యంలో మానవస్త్రీగా జన్మిం చింది. ఆమె లోకాతీత జ్ఞానంతో పుట్టింది. కృష్ణుడు ఆరాధించినది ఆ పరాశక్తి రూపమైన రాధనే. మానవ స్త్రీగా ఆయనతో సాహచర్యం చేసింది. ఆమె జ్ఞానాంశ. అందుకే అంత ప్రత్యే కం.
ఒకసారి శ్రీకృష్ణుడు శిరోభారంతో బాధపడు తుండగా నారదుడు చూసి ‘ఉపశమన పరి ష్కార మార్గం ఏమిటి?’ అని అడుగుతాడు. అంతట శ్రీకృష్ణుడు ‘ఎవరిదైనా అరికాలి ధూళి తెచ్చి రాస్తే తగ్గుతుంది. అంతేకాదు వారి ధూ ళితోపాటు వారి పాపపుణ్యాలు కూడా నాకే చెందుతాయి అంటాడు. వెంటనే నారదుడు అక్కడే వున్న శ్రీకృష్ణుని భార్యలను అడుగు తాడు. వారు అంగీకరించరు. నారదుడు రాధ వద్దకు వెళ్లి విషయం చెబుతాడు. ఆమె వెం టనే తన అరికాలి ధూళిని ఇచ్చింది. నారదు డు అందుకుని ‘రాధమ్మా నీ ధూళి ఇచ్చేశావు. నీ పుణ్యం అంతా పోతుంది కదా’ అంటాడు.
అందుకు రాధ ”నా దేవుడు శ్రీకృష్ణుని శిరో భారం తగ్గడమే నాకుముఖ్యం. దానిముందు నేను చేసుకున్న పుణ్యం పెద్దదేమీ కాదు’ అం టుంది. దాంతో నారదుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి రాధ అరికాలి పాద ధూళిని ఇచ్చేందుకు ఆయన కేసి చూడగా శ్రీకృష్ణుని హృదయంలో రాధ అలా పవళించి కనబడింది. నిజమైన భక్తులు భగ వంతుడి హృదయంలో అలా తిష్ట వేసుకుని ఉంటారు.
ఓసారి బృందావనంలో కృష్ణునకు ఎలాగైనా రాధాదేవిని కలుసుకోవాలన్న కోరిక తీవ్రంగా ఉదయించింది. అతడొక గోపకాంత వేషాన్ని ధరియించి వృషభానుని అంత:పురం దగ్గర కు వెళ్ళాడు. రాజభవనంలోకి ప్రవేశించడాని కి ఆడవాళ్ళకి పెద్ద ఆటంకమేమీ లేదు. రాజకు మారిని చూడటానికి వచ్చాను అనగానే లోప లికి వెళ్ళడానికి అనుమతి దొరికింది. ఆ సమ యానికి రాధాదేవి ఉద్యానవనంలో వి#హరిస్తు న్నది. రాధాదేవి దగ్గరకు ఈ గోపదేవి వెళ్ళిం ది. అక్కడ పరిచారికలు రాధాదేవితో”అమ్మా! నిన్ను చూడడానికి బృందావనం నుంచి ఈవిడ వచ్చింది.” అని చెప్పి వెళ్ళారు. ‘బృం దావనం నుంచి వచ్చింది’ అన్నమాట విన గానే రాధాదేవికి చాలా సంతోషం కల్గింది. ఆమెను తన ప్రక్కనే తిన్నె మీద కూర్చోబెట్టి ఆమె వివరాలు రాధాదేవి అడిగింది.
కృష్ణుడు తన పేరు గోపదేవి అని బృందా వనంలో నందరాజు ఇంటికి ఉత్తరాన ఉన్న ఒక గృ#హంలో తాను ఉంటానని రోజూ తాను పాలు, పెరుగు అమ్ముకోడానికి మధురకో, బర్సానాకో వస్తుంటానని చెప్పాడు. రాధాదేవి గోపదేవితో ”యశోదాపుత్రుడయిన కృష్ణుని గూ ర్చి నీకేమయినా తెలిస్తే చెప్పు. అతని గూర్చి వినాలని ఉంది.”
అది విని గోపదేవి ”అమ్మా రాజ కుమారీ! నందనందను డంటే నీకు ఏమో ఆసక్తి కలిగినట్లుగా ఉంది. అతడు వట్టి మోసగాడు. అల్లరి చిల్లర పిల్లవాళ్ళను వెంట వేసుకుని ఇళ్ళలో దూరి పాలు పెరుగు దొంగతనంగా త్రాగుతూ తోటి వారికి పంచిపెడుతూ ఉంటాడు. అతడు చేసే కొంటె పనులకు అంతు లేదు. చిన్న తనంలో ఇటువంటి అల్లరి పనులు ఎక్కువ చేసేవాడు. ఇప్పుడు ఆడపిల్లల వెంట పడుతున్నాడు. నేను పెరుగు అమ్ముకోడానికి ఈ ఊరికి వస్తున్నాను. త్రోవలో అతడు అడ్డం గా వచ్చి నన్ను ఆపివేశాడు. తాను పన్ను వసూ లు చేసే అధికారినని, తనకు పన్ను కడితేగాని అమ్ముకోడానికి పోనీయనని దబాయించాడు. నా దగ్గర ఏమీ ధనం లేదని చెప్పాను. కోప గించి పెరుగు కుండ పగులకొట్టాడు.”
”నీ మాటలు నేను నమ్మలేకున్నాను. అతని గూర్చి నే విన్నది వేరు. గోపకులను ఎన్నో ప్రమాదాల నుండి కాపాడిన శూరునిగా అతని గాథలను ఎన్నో విన్నాను. అంతటి అద్భుత వ్యక్తిని గురించి అబద్ధాలు చెపుతున్న నీ మాటలు నేను వినదలచుకోలేదు. ఇక్కడ నుండి నీవు వెళ్ళిపోవచ్చు” అంది రాధ కఠి నంగా. ఆ పలుకులు విని గోపదేవి మళ్ళీ ”రాజ కుమారి! నీ మాటలు వింటూంటే నీవతనిని ప్రేమిస్తున్నట్లు అర్థమవుతున్నది. నీ వంటి రాజకుమారికి ఆ నల్లనివాడు ఈడూ జోడూ కాదు. నీకంటే చాలా తక్కువవాడు, ధన#హ నుడు, దరిద్రుడు, నల్లనివాడు అయిన ఆ కృష్ణ య్యను నీ మనసులో నుండి తీసివేస్తే మంచి ది” అన్నది. ఆ మాటలు వింటూనే రాధాదేవికి భరించలేనంత కోపం వచ్చింది. ఆగ్ర#హంతో పెదవులదురుతుండగా కన్నులు ఎర్రబడగా కొట్టడానికి చెయ్యి ఎత్తింది. ఆ చేతి ని పట్టు కొంది గోపదేవి. మరుక్షణమే రాధ విద్యుత్‌ ప్రకంపనలతో నిండిపోయింది. గోపదేవి నెమ్మదిగా ఆమెకు మాత్రమే వినిపించేట ట్లుగా ‘రాధా నేను’ అంటూ ఆమె కన్నులలోకి చూశాడు. ఆ స్పర్శ, ఆ చూపు రాధాదేవికి అవ గతమయినవి. ”కృష్ణా! నన్ను ఈవిధంగా పరీక్షిస్తున్నా వా!” అంటూ ఆనందబాష్పాలు రాల్చింది రాధ.

Advertisement

తాజా వార్తలు

Advertisement