Thursday, May 2, 2024

శ్రీ‌కాళ‌హ‌స్తీశ్వ‌ర శ‌త‌కం..

  1. 7. దివిజక్ష్మారుహధేనురత్నఘనభూతిన్ ప్రస్ఫురద్రత్న సా
    నువు నీ విల్లు, నిధీశ్వరుండు సఖుడర్ణోరాశికన్యావిభుం
    డు విశేషార్చకు డింక నీ కెన ఘనుండున్ గల్గునే నీవు చూ
    చి విచారింపవు లేమి నెవ్వడుడువున్ శ్రీకాళహస్తీశ్వరా!
    ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, దివిజ – దేవతా సంబంధమైన, క్ష్మారుహము్స వృక్షము ( కల్పవృక్షము), ధేను -ఆవు ( కామ ధేనువు), రత్న – రత్నము ( చింతామణి మొదలైనవి), ఘన – గొప్ప, భూతి ్స సంపదల చేత, ప్రస్ఫురత్ -స బాగుగా ప్రకాశించే, రత్నసానువు్స మేరు పర్వతం, నీ – విల్లు – నీ ధనుస్సు, నిధీశ్వరుండు ్స నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు, సఖుడు ్స మిత్రుడు, అర్ణో రాశి కన్యా విభుండు – సముద్రరాజతనయ అయిన లక్ష్మీ దేవికి భర్త అయిన విష్ణువు, విశేష – అర్చకుడు – ముఖ్యమైన ఆరాధకుడు, ఇంక – ఇకపైన, మఱి, నీకు -ఎన – నీకు సాటి అయిన , ఘనుండున్ – గొప్పవాడు కూడ, కల్గున్ – ఏ – ఉండునా?, నీవు్స నీవు, చూచి – ఇవన్నీ పరికించి, విచారింపవు – ఆలోచించవు, లేమిన్ – దారిద్ర్యమును, ఎవ్వడు్స ఎవరు, నీవు కాక మరెవ్వరు, ఉడుపున్ – పోగొట్ట గలడు?
    తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, మొదలైన గొప్ప ఐశ్వర్యప్రదములైన వస్తువులచే ఒప్పు మేరుపర్వతము నీ విల్లు. ధనాధిపతి అయిన కుబేరుడు నీ సఖుడు. సమస్త సంపదలకు నిలయమైన సముద్రరాజపుత్రి అయిన లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు నీ భక్తులలో శ్రేష్ఠుడు. మఱి, ఇంక నీకు సాటి అయిన వాడు ఇంకెవరు? అయి ఉండి కూడా నీ భక్తుల దారిద్ర్యాన్ని ఎవరు పోగొడతారు? అని ఆలోచన చెయ్యవు. పై వారిలో అందరూ దారిద్ర్యమును పోగొట్టి సంపదల నీయగలవారే. కాని, నీవు ఆ విషయం గురించి ఆలోచించవు. నిజానికి వీరందరు బాహ్యమైన, భౌతికమైన దారిద్ర్యమును మాత్రమే పోగొట్ట గలరు. భగవదనుగ్రహము అను (లేక పోవటం అనే) దారిద్ర్యాన్ని పోగొట్టగల గలవారు ఈశ్వరుడు తప్ప మఱెవ్వరు లేరు.
    సమస్తమైన ఐశ్వర్యప్రదాయకములైన వస్తువులు, మిత్రులు, భక్తులు, ఉండి కూడా శివుడు తన దారిద్ర్యము నెవ్వడు పోగొట్టునా? అని ఆలోచింపడు అన్నది ఈ పద్యమునకున్న మఱి యొక అర్థము.
    విశేషం: కలిమి, లేమి మొదలైన ద్వంద్వములు మానవులకే కాని పరమాత్మకి కావు కదా! అందుకే ఆలోచన చేయడు. అంతే కాదు, ఐశ్వర్యం ఉండటం, లేక పోవటం అన్నది సాపేక్ష భావనాకి సంబంధించింది. నిరపేక్షమూర్తి అయిన పరమేశ్వరుడికి అది వర్తించదు. అయినా ఆ ఐశ్వర్యప్రదాయకములైన వాటికి అన్నింటికి ఆ శక్తిని ప్రసాదించినది తానే అయినప్పుడు వాటి నుండి తను అపేక్షించేది ఏముంటుంది? పరమేశ్వరుడి ఐశ్వర్యప్రదాన లక్షణం ( ఈశ్వరత్వం) ప్రతిపాదించ బడింది ఈ పద్యంలో.
    త్రిపురాసురసంహార సమయంలో శివుడికి ధనుస్సుగా మారింది మేరుపర్వతం. ఈ పద్యం చదువుతు న్నప్పుడు ఆ ఐతిహ్యం మనసులో మెదలక తప్పదు.
    డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
    Advertisement

    తాజా వార్తలు

    Advertisement