Saturday, May 11, 2024

భగవద్ రామానుజ మరియు 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు


ఉదయం అష్టాక్షరి మంత్ర జపంతో ప్రారంభమైంది. అనంతరం ప్రాతస్మరణీయం, యాగశాలలో సేవాకాలం, శాత్తుముఱై నిర్వహించారు. త్రిదండి చినజీయర్ స్వామివారు భక్తులకు తీర్దప్రసాదం అనుగ్రహించారు. తర్వాత భక్తులకు పెద్దలు అనుగ్రహ భాషణం చేశారు. ఆ తర్వాత పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత 18 దివ్యదేశాల పెరుమాళ్లకు తిరుమంజనం నిర్వహించారు.

ఉదయం 11:30 గంటలకు దివ్యసాకేతం నుంచి శ్రీ సాకేత లక్ష్మీమాతను ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆ తర్వాత త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సామూహిక లక్ష్మీపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు
మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:15 గంటల వరకు త్యాగరాజు పంచరత్న సేవ-సంగీత విదుషి శ్రీమతి శ్రీనిధి వెంకటేష్

మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5 గంటల వరకు స్ట్రింగ్ వింగ్స్ వాద్య సమ్మేళనం-వైణికులు శ్రీ ఫణి నారాయణ బృందం ప్రదర్శన ఇచ్చారు.

- Advertisement -

అనంతరం చినజీయర్ స్వామివారు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణ చేశారు.

సాయంత్రం సాకేత రామచంద్రప్రభువుకు హనుమద్వాహన సేవ ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత 18 దివ్యదేశాధీశులకు గరుడసేవలు జరిపించారు.

సమతామూర్తిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. అనంతరంత మంత్రి తుమ్మలకు త్రిదండి చినజీయర్ స్వామివారు మంగళాశాసనాలు అందించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ మా పెద్దలు జీయరు భక్తులని, ఈ మహానగరంలో ఒక అద్భుతాన్ని సృష్టించారని అన్నారు. అంతేకాకుండా సమతామూర్తి కేంద్రం తెలుగురాష్ట్రాలకే కాకుండా ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా సమతామూర్తి గురించి చెప్పుకుంటామని, సమతామూర్తి ఆలోచనా విధానాన్ని అందరూ అనుసరించాలని చెప్పారు. ఇలాంటి అద్భుతాన్ని ఇక్కడ ఆవిష్కరించిన చినజీయర్‌ స్వామికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ తుమ్మల కుటుంబం పెద్ద జీయరు వారికి మంచి ఆప్తులు అని..తుమ్మల వ్యవసాయ రంగంలో మంత్రిగా ఉన్నారని చిన జీయర్ స్వామి అన్నారు.. రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

18 దివ్యదేశాధీశులకు ఈరోజు జరిగిన గరుడసేవలు
1.తిరుతైత్తియంబలం
పెరుమాళ్-శ్రీరంగనాథుడు
అమ్మవారు- శెంగమలవల్లి, భూదేవి

2.తిరుక్కావళంపాడి
పెరుమాళ్-గోపాలకృష్ణన్
అమ్మవారు- శెంగమలవల్లి, భూదేవి

3.తిరువెళ్ళక్కుళం
పెరుమాళ్-నారాయణన్, అణ్ణన్
అమ్మవారు- పూవార్ తిరుమగళ్ నాచ్చియార్, పద్మావతి, భూదేవి

4.పార్థన్ పళ్ళి
పెరుమాళ్-కమలనాథ పెరుమాళ్
అమ్మవారు- తామరనాయకి, భూదేవి

5.తిరుమాలిరుంశోలై
పెరుమాళ్-సుందరబాహు పెరుమాళ్
అమ్మవారు- సుందరవల్లి, కళ్యాణవల్లి

6.తిరుక్కోట్టియూర్
పెరుమాళ్-సౌమ్యనారాయణ
అమ్మవారు- తిరుమామగళ్ తాయార్, మహాలక్ష్మి, భూదేవి

7.తిరుమెయ్యం
పెరుమాళ్-సత్యమూర్తి
అమ్మవారు- ఉజ్జీవనవల్లి, భూదేవి

8.తిరుప్పుల్లాణి
పెరుమాళ్-ఆది జగన్నాథ పెరుమాళ్
అమ్మవారు- కళ్యాణవల్లి, భూదేవి

9.తిరుత్తంగాల్
పెరుమాళ్-స్థితనారాయణస్వామి
అమ్మవారు- అన్ననాయకి, అనంతనాయకి,అమృత నాయకి, జాంబవతి

10.తిరువాట్టార్
పెరుమాళ్-ఆదికేశవ పెరుమాళ్
అమ్మవారు- మరకతవల్లి, భూదేవి

11.శ్రీవిల్లిపుత్తూర్
పెరుమాళ్-వటపత్రశాయి
అమ్మవారు- శ్రీదేవి, భూదేవి

12.కూడల్ అళగర్
పెరుమాళ్-కూడల్ అళగర్
అమ్మవారు- మధురవల్లి, మరకతవల్లి తాయార్

13.ఆళ్వార్ తిరునగరి
పెరుమాళ్-ఆదినాథన్ పెరుమాళ్
అమ్మవారు- ఆదినాథవల్లి, భూదేవి

14.తొలైవిల్లిమంగలం
పెరుమాళ్-దేవపిరాన్, అరవిందలోచనుడు
అమ్మవారు- కరుంతడంకణ్ణి నాచ్చియార్, భూదేవి

15.వానమామలై
పెరుమాళ్-దైవనాయక పెరుమాళ్
అమ్మవారు- శిరీవరమంగై తాయార్, శ్రీదేవి, భూదేవి

16.తిరుప్పుళింగుడి
పెరుమాళ్-కాయ్ శినభూపతి
అమ్మవారు-పద్మవాసినీ, భూదేవి

17.తెన్ తిరుప్పేరై
పెరుమాళ్-మకర కుండలధర, ముగిల్ వణ్ణన్
అమ్మవారు-కళైక్కాదవల్లి, భూదేవి

18.శ్రీవైకుంఠం
పెరుమాళ్-వైకుంఠనాథ పెరుమాళ్
అమ్మవారు-వైకుంఠవల్లి, భూదేవి

18 గరుడ వాహనాలను యాగశాలకు తీసుకొచ్చి పూర్ణాహుతి జరిపించారు. అనంతరం శాత్తుముఱై, తీర్థ, ప్రసాద గోష్ఠి పూర్తయ్యాక గరుడ వాహనాలను తిరిగి ఆలయాలకు చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement