Monday, May 6, 2024

కార్తీకంలో దానాలు ఫలితాలు

హరిహరులకు ప్రీతికరమైనది… శుభ కార్యాలకు అత్యంత పవిత్రమైనది కార్తీకమాసం. ఈ మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన దాతకు విశేష ఫలం లభిస్తుంది. అంతేకాదు దశదానాలు చేసినా ఎంతో పుణ్యం. అలాగే కార్తీకంలో ఇతర దానాలు చేసిన మంచిదని చెబుతున్నారు. కార్తీక మాసం నెలరోజులూ రోజూ సూర్యోదయానికి ముందే దీపాలు వెలిగిస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో దానాలు చేయడం వల్ల కూడా అంతే పుణ్యం వస్తుందని, తెలిసీ తెలి యక చేసిన పాపాలను పరిహరించుకోవచ్చునని పురాణ వచనం. అందుకే ఎవ రి శక్తి మేరకు వారు దానధర్మాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నెల రోజులలో కొన్ని దానధర్మాలు చేయడంవల్ల కూడా మంచి ఫలితాలను పొంద వచ్చునని మన పెద్దలు చెబుతున్నారు. కార్తీకంలో ఏ రోజు ఎటువంటి వస్తువులు దానం చేయాలో కూడా వివరించారు. అవేమిటో తెలుసుకుందాం.
కార్తీక మాసం మొదటి రోజు ఆవునెయ్యి, బంగారాన్ని దానం చేయాలి.
రెండవ రోజు కలువ పూలు, నూనె, ఉప్పు దానం చేయాలి.
కార్తీక మాసంలో మూడవ రోజు పార్వతీదేవిని పూజించాలి. ఈ రోజు
ఉప్పును ఇతరులకు దానం చేయడం వలన శుభం కలుగుతుంది.
నాలుగవ రోజు నాగుల చవితి. సుబ్రహ్మణ్యశ్వరస్వామికి, వినాయకుడికి
ప్రత్యేకమైన పూజలు చేయాలి. పెసరపప్పును దానం చేయాలి.
అయిదవ రోజు జ్ఞాన పంచమి అని పిలుస్తారు. ఈ రోజు ఆదిశేషుని పూజించి
పాలను దానం చేయాలి.
ఆరవ రోజు సంతానం లేనివారు ఎర్రటి కండువాను బ్రహ్మ
చారికి దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
ఏడవరోజు దుర్గాదేవిని పూజించాలి. ఎర్రటి
వస్త్రములో కొద్దిగా గోధుమలను మూట
కట్టి ఇతరులకు దానం చేయడం ద్వా
రా ఆయుష్షు పెరుగుతుంది
ఎనిమిదవ రోజు గోపూజ
చేసి బియ్యం దానం
చేయడం వల్ల మంచి
జరుగుతుంది.

తొమ్మిదవరోజు విష్ణు భగవానుని పూజించి, ఎర్రటి కందిపప్పును దానం
చేస్తే విశేష ఫలితం లభిస్తుంది.
పదవరోజు నూనె దానం చేస్తే ఆరోగ్యం, కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.
పదకొండవ రోజు శివుని ప్రత్యేకమైన పూజించాలి. పండ్లను దానం చేయ
డంవల్ల ధనప్రాప్తి కలుగుతుంది.
పన్నెండవ రోజు ఉసిరి, తులసిచెట్టు వద్ద ప్రత్యేకమైన పూజలు చేయాలి.
పాల పదార్థాలను దానం చేయడం ఎంతో మంచిది.
పదమూడవ రోజు బియ్యాన్ని దానం చేయడం ఎంతో శ్రేయస్కరం.
పధ్నాలుగవరోజు యమధర్మరాజును పూజించి, దున్నపోతు లేదా గేదెను
దానం చేయాలి.
పదిహేనవ రోజు కార్తీక పూర్ణిమ. ఈరోజు నదీస్నానం చేసి దీపాలు వెలిగిం
చడం, దీప దానం చేయడం ద్వారా సర్వపాపాలు తొలగిపోతాయి. ముత్తయి దు వులు ఒకరికొకరు తాంబూలాలను ఇచ్చిపుచ్చుకున్నా ఎంతో పుణ్యప్రదం.
ఈ కార్తీక మాసంలో వీటిలో కొన్ని అయినా దానం చేయడానికి ప్రయత్నిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement