Wednesday, May 1, 2024

రామానుజ సహస్రాబ్ధి సమారోహం సందోహం

సమతామూర్తి మోడల్‌ ఎంపికకు భారీ కసరత్తు
ఆగమశాస్త్ర ప్రకారం రూపొందించిన 14 నమూనాల పరిశీలన
చివరకు మూడు ఎంపిక.. త్రీడీ టెక్నాలజీ సాయంతో పరిశీలన
చివరకు ప్రస్తుత విగ్రహ నమూనాకు ఆమోదముద్ర
రామానుజాచార్యుల విగ్రహం చుట్టూ 108 దివ్యక్షేత్రాల నిర్మాణం
అసలు క్షేత్రంలోని రూపంలోనే మూర్తి,విమానగోపురం
వెయ్యి శిలలతో నిర్మాణం.. పురుష శిలతో విగ్రహాల తయారీ
వలజ్య, కాంచీపురం నుంచి శిలలు.. తనిఖీల తర్వాతే వినియోగం
దివ్యక్షేత్రాల శిల్పులు ఎక్కువగా ఆళ్లగడ్డ, తిరుపతి, మహా బలిపురం,
శ్రీరంగం, మధురై నుంచి రాక
నల్ల మార్బుల్‌ను తీర్చిదిద్దిన శిల్పులు

నల్లరాతితో చేసిన చిలుకలు మాత్రం చైనాలో చెక్కారు
రాజస్థాన్‌లోని బసెస్లాల గ్రామంనుంచి బ్లాక్‌ మార్బుల్‌
108 దివ్యక్షేత్రాల్లో 468 స్తంభాల కోసం వినియోగం

5న ప్రధాని మోడీ చేతుల మీదుగా రామానుజుల విగ్రహావిష్కరణ
12న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
చేతుల మీదుగా రామానుజుల
120 కేజీల సువర్ణ విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: భాగ్యనగరానికి దాదాపు 50 కి.మి. దూరంలో మారుమూల పల్లె ముచ్చింతల. అక్కడ దివ్యసాకేతం తోపాటు వైద్యకళాశాలలు, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌ మహాసంకల్పం మేరకు భగవద్రామానుజలవారి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఒకవైపు తుది ఏర్పాట్లు వేగంగా సాగిపోతున్నాయి. దీక్షగా కార్మికులు పనిచేస్తున్నారు. లక్ష్మీనారాయణ యాగంలో పాలుపంచుకునేందుకు వేలాదిమంది పండితులు వచ్చారు. మరోవైపు యాగశాలల్లో సామాగ్రి సర్దుతు న్నారు. వందలాదిమందికి మరోవైపు వసతి, భోజన సౌకర్యం… యాగశాలకు పక్కనే వైద్యశిబిరం… అగ్నిమాపకదళం మోహ రింపు… దివ్యసాకేతం ఆలయంలో భక్తుల సందోహం… ఇలా సోమ వారం ఉదయం ముచ్చింతల ఆశ్రమంలో రామానుజుల సహస్రాబ్ది సమారోహ సందోహం కన్పించింది. రాష్ట్రపతి, ప్రధాని మోదీ సహా రాజకీయ, పండిత ప్రముఖులు రానున్న నేపథ్యంలో భద్రత, రహదారి సౌకర్యాలను చకచకా చేస్తున్నారు. వేలాదిమంది వలంటీర్ల సేవలు.. వచ్చిపోయే భక్తులకు ఎక్కడికక్కడ కాల కృత్యాలు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. రోజంతా ఎంతమంది వచ్చినా కడుపునిండా ప్రసాదం అందేలా భోజన సౌకర్యం ఉండేలా ఏర్పాట్లు చేశారు. రోజువారీ ఆరాధన కార్యక్రమాల తరువాత ప్రధాన అంశాలను చినజీయర్‌ పర్యవేక్షిస్తూంటే… అహోబిల జీయర్‌ స్వామి మిగతా పనులు దగ్గరుండి చూస్తున్నారు. సహస్రాబ్ది విశేషాలు, సమతామూర్తి విగ్రహం ప్రత్యేకతలు, 108 దివ్యక్షేత్రాలకు సంబంధించిన సమాచారాన్ని… డిజిటల్‌ లైబ్రరీ, సమతామూర్తి మూడు అంతస్తుల ప్రత్యేకతలు… ఇలా ఒక్కో అంశాన్ని అహోబిల స్వామివారు దగ్గరుండి మీడియాకు వివరించారు. మరో వైపు దేవనార్‌ స్వామి భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయో లేదో, అతిధుల రాకపోకలు, భోజన వసతి సౌకార్యాలు ఎలా ఉన్నాయో స్వయంగా కలియ తిరుగుతూ పర్యవేక్షించారు. మొత్తం మీద అందరూ బిజీబిజీగా గడిపారు. సమతామూర్తిని చేరడానికి 108 మెట్లు ఎక్కాలి. ఎండావాన ఇబ్బందిలేకుండా ఉండేందుకు
నీడినిచ్చేలా ప్రత్యేక సౌకర్యం ఆ మెట్లకు ఇరువైపులా ఉంది. లిఫ్ట్‌ సౌకర్యాలూ ఉన్నాయి. ఆశ్రమంలో కలియదిరిగేందుకు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 12వేలమంది వికాసతరంగిణి వలంటీర్లు, మరో 8వేలమంది సహాయకులు ఇక్కడ సేవలందిస్తున్నారు.
స్వదేశీ ఆవునెయ్యి ఎందుకంటే….
మనిషి ప్రకృతిని, ప్రాణికోటిని విచ్ఛిన్నం చేశాడు. అవసరం లేకపోయినా వాటి ఉనికిని దెబ్బతీశాడు. కాలుష్యం పెరిగిపోయింది. ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. కొత్తకొత్త రోగాలు వస్తున్నాయి. మన ఉనికి దెబ్బతింటోంది. తోటి ప్రాణికోటిని కాపాడితేనే మన ఉనికి ఉంటుందని గ్రహించాలి. కరోనావంటి వైరస్‌లు బాహ్యంగా కనిపిస్తాయి. అంతర్లీనంగా మనలోనూ అనేక జాడ్యాల వైరస్‌ ఉంది. బాహ్య, అం తర్లీన రుగ్మతలను పోగొట్టేందుకే లక్ష్మీనారాయణ యాగం, సమతా మూర్తి విగ్రహావిష్కరణ. యాగంలో 1.50 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవునెయ్యి వాడతాం. మూపురం, గంగడోలు ఉన్న దేశీయ ఆవుల పాలనుంచి శాస్త్రీయంగా, సంప్రదాయ విధానంలో పాలుకాచి, తోడుపెట్టి, చిలికి, వెన్నతీసి, దానిని కాచి తీసిన నెయ్యినే వాడతాం. అలా వాడిన నెయ్యివల్ల హోమ గుండాల నుంచి వచ్చే పొగ వల్ల పర్యావరణం మెరుగుపడుతుంది. మంచి వానలు కురు స్తాయి. పంటలు పండుతాయి. ఎందరెం దరికో పని దొరు కుతుంది. కడుపునిండుతుంది. కొందరు అనొచ్చు. అన్ని లక్షల కిలోల నెయ్యి ఎందుకు వాడాలి. పేద ల కడుపు నింప వచ్చు కదా అని. కానీ అంతకన్నా ఎక్కువ ప్రయో జనం వస్తుందన్న విశ్వాసంతోనే ఇలా చేస్తున్నాం. కరోనా వంటి వైరస్‌లు, క్రిమికీటకాలు నశిస్తాయి. అంత ర్లీనంగా మన మనసుల్లో చేరిన దుష్ట ఆలో చనలు, చెడు నాశనమ య్యలా ఆధ్యాత్మిక, జ్ఞాన భావనలు పెంపొందుంతాయి.

యాగం.. యోగం.. అహోబిల జీయర్‌
సమతామూర్తి విగ్రహ స్థలానికి సమీపం లో 1035 యాగకుండాలు ఏర్పాటు చేశాం. యాగశాలలు, కుండాల్లో వాడే అన్ని వస్తువులు, పదార్థాలు పూర్తిగా దేశీయమే. ఆవుపేడ, ఇటుక, మట్టితో చేసిన కుండలనే వాడాం. తాటాకు పందిళ్లు… నారతో చేసిన కర్టెన్లు, పిండి ముగ్గు… అన్నీ సంప్రదాయ పద్ధతులే. చివరకు హోమ గుండాల్లో అగ్నిని రాజేయడం కూడా పురాతన శాస్త్రీయ విధానంలోనే. జమ్మిదిమ్మ, రావి పుల్లలు మధించి అగ్నిని పుట్టిస్తాం. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం ప్రారంభమయ్యే యాగం ప్రతిరోజూ 11.45 వరకు సాగుతుంది. అదే రోజు రాత్రి అంకురార్పణ చేస్తాం. పూర్ణాహుతితో పూర్తవుతుంది. సకల (9) వేద పారాయణలు ఉంటాయి. ఇష్టియాగశాలలూ ఉంటాయి. విష్ణుసహస్ర పారాయణలు ఉంటాయి. సంకల్ప యాగశాలలు ఏర్పాటు చేశాం. సామాన్య భక్తులు పారాయణల్లో పాల్గొనాలనుకుంటే అప్పటికప్పుడు ఆ సంకల్ప శాలల్లో పేర్లు నమోదు చేసుకుని పాలుపంచుకోవచ్చు. ఒక్కో యాగ శాలలో 27మంది పండితులు భాగస్వా ములవుతారు. ఆ లెక్కన దాదాపు 5వేల మంది ఈ క్రతువులో పాల్గొంటారు. 14 తేదీ సాయంత్రంతో యాగం పూర్తవుతుంది. యాగశాలలో వాడే మట్టి పాత్రలు రాజస్థాన్‌ నుంచి తెప్పించాం. ఇటుకలు ఇక్కడే తెచ్చాం. పాలు ఉత్తరాది నుంచి తెప్పించాం. ఇక్కడి ఆశ్రమంలో 600 దేశీయ ఆవులను సాకి శ్రేష్టమైన నెయ్యిని తీశాం. ఇలా ప్రకృతిని పరవశింపచేసేలా జాగ్రత్తలు తీసుకున్నాం. క్రతువు జరిగే రోజుల్లో మొత్తంమీద 10 కోట్లసార్లు అష్టాక్షరీ మంత్రోచ్ఛారణ జరుగుతుంది. చతురస్ర, దీర్ఘ చతురస్ర… ఇలా9 రూపాల్లో యాగ కుండాలుంటాయి.

సమతాస్ఫూర్తి ఇలా…
సమతాస్ఫూర్తిని అడుగడుగునా ఆచరిస్తున్నాం. ఇక్కడి డిజిటల్‌ లైబ్రరీలో దేశవిదేశాలకు చెందిన సమతామూర్తుల జీవిత చరిత్రలను నిక్షిప్తం చేశాం. దాదాపు 150 మంది వివరాలను మా వలంటీర్లు సేకరించారు. మహిళల విద్యకోసం పోరాడి నోబెల్‌ బహుమతి పొందిన మలాలా జీవిత చరిత్రనూ వివరిస్తున్నాం. 1035 కుండాలతో నిర్వహించే యాగశాలల్లో వైష్ణవ, శైవ, శాక్తేయ… ఇలా అన్ని వర్గాల, వైఖానస, పాంచరాత్ర ఆగమాల, వేదవేదాంగాలు, దివ్య ప్రబంధాల పారాయణ ఉంటుంది. సాక్షాత్తు భగవద్రామానుజులు వైశ్య పండితునివద్ద అష్టాక్షరీ మంత్రం ఉపదేశం పొందారు. కానీ గురువు వద్దన్నా అందరికీ తెలిపారు. నరకానికి పోతావని చెప్పినా.. నేనొక్కడిని నరకానికి వెళ్లినా పర్వాలేదు, అష్టాక్షరీ జపించినవారంతా స్వర్గానికి వెళితే చాలునని చెప్పారు. అలాంటి స్ఫూర్తిని రగిల్చేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. రామానుజులవారు అవతరించకముందే ఆళ్వారులు భక్తితత్వంతో భగవంతుడిని పాటలతో కీర్తించారు. వారిలో అప్పటికాలంలో నిమ్నవర్గాలుగా భావించినవారూ ఉన్నారు. అయితే రామానుజులవారు వారి కులాన్ని కాక జ్ఞానాన్ని గుర్తించి.. వారికి ఆలయాల్లో నిత్యం అర్చనలు జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందుకే వైష్ణవ సంప్రదాయం అనుసరించే అన్ని దేవాలయాల్లో ఆళ్వారుల ఆరాధన ఉంటుంది.
తెరపై డిజిటల్‌ జిలుగులు
ముచ్చింతల్‌ ఆశ్రమంలో ఏమేమి విశేషాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసేందుకు ఓ డిజిటల్‌ ఆడిటోరియం ఉంది. భారీ తెర, సీటింగ్‌ ఏర్పాట్లు ఉన్నాయి. ల్యాండ్‌ స్కేప్‌ను వివరించే మ్యాప్‌ పెట్టాం. అత్యాధునిక టెక్నాలజీని వాడాం. 108 దివ్యక్షేత్రాల నమూనాలు, ఆలయాల స్తంభాలపై వాడిన శిల్పాలకు ప్రతిదానికీ అర్థం, పరమార్థం ఉన్నాయి. ఆధ్యాత్మికత, మానవత, సమా నత్వం, విజ్ఞానం అనే సూత్రాలు మీకు ప్రతీ నిర్మాణంలోను కన్పిస్తాయి.

- Advertisement -

మన మట్టి పరిమళం
వేరు : చినజీయర్‌
మన దేశం ఔన్నత్యం చాలా గొప్పది. ప్రపంచంలోని చాలా దేశాలు చుట్టివచ్చా. కానీ మన నేల వేరు.. మన మట్టివాసన వేరు. ఆ పరిమళం గొప్పగా ఉంటుంది. రామానుజులవారికి స్ఫూర్తినిచ్చిన 108 దివ్యక్షేత్రాలను ఇక్కడ నిర్మించాం. ఆయా క్షేత్రాలనుంచి తెచ్చిన మృత్తికను ఆయా ఆలయాల్లో విగ్రహాల దిగువ వేశాం. ఆ క్షేత్రాల శక్తి ఇక్కడికీ రావాలని మా కోరిక. అలాగే, ఆయా దివ్యదేశాల్లో ఏళ్ల తరబడి ఆరాధన, అర్చన పొందిన సాలగ్రామ మూర్తులను ఇక్కడకు తీసుకువచ్చి ఆయా క్షేత్రాల సూక్ష్మాలయాల్లో పెట్టాం. అందువల్ల ఇక్కడి దివ్యదేశాలకూ వాటి శక్తి చేరుతుంది. నేపాల్‌, ఉత్తరాది, దక్షిణాది దేశాల్లో ఉన్న ఈ 108 క్షేత్రాలను అందరూ చూడలేకపోవచ్చు. వ్యయప్రయాసలు, ఇతర సమస్యలు ఉండొచ్చు. అలాంటివారు ఒకేసారి అన్ని క్షేత్రాలను చూసే సౌకర్యం మేం కల్పించాం. అంతా భగవదేచ్ఛ.

Advertisement

తాజా వార్తలు

Advertisement