Thursday, May 2, 2024

మరెందరో రామానుజులు రావాలి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వెయ్యేళ్లనాడు సమాజంలో నెలకొన్న కుల, మత, వర్ణ వివక్ష, సామాజిక అసమానతలు, మహిళల అణచివేతవంటి రుగ్మతలను పారదోలిన సమతామూర్తి భగవద్రామానుజుల స్ఫూర్తితో ప్రస్తుత సమాజంలోని కుల, మత, అసమానతలవంటి మహమ్మారులను తరిమికొట్టేందుకు మరెందరో రామానుజులు తయారవ్వాలని, ప్రతి ఒక్కరూ సమతామూర్తిగా మారాలని త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి ఆకాంక్షించారు. పది శతాబ్దాల క్రితం ఉన్న దుర్భర సామాజిక పరిస్థితులకు ఎదురొడ్డి.. అప్పటి పండితులను, పామరులను, పాలకులను ఒప్పించి సమతా భావనకు ప్రాణం పోసి, తన తరువాత కూడా ఆ పరంపర కొనసాగేలా వ్యవస్థలను ఏర్పాటు చేసిన భగవద్రామానుజులు, ప్రస్తుత తరానికి అదే స్ఫూర్తిని ఇచ్చేలా హైదరాబాద్‌ నగర సమీపంలోని ముచ్చింతల గ్రామంలో 216 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించనున్నారని ఆయన చెప్పారు. కరోనా వంటి వైరస్‌లు బాహ్యంగా పట్టిపీడిస్తున్నట్టే అంతకంటే ప్రమాదకరమైన అసమా నతలు, వైషమ్యాలు ఉన్నా యని, అలాంటి రుగ్మతలను రూపుమా పడానికి ఎప్పుడో రామా నుజులు సమతాభావన అనే వైద్యం చేశారని, ఇప్పుడు కూడా ఆ మార్గమే శరణ్యమని అభిప్రాయ పడ్డారు. రామానుజల విగ్రహా విష్కరణ, సహస్రాబ్ది సంబరం, లక్ష్మీనారాయణ యాగం వివరా లను సోమవారం నాడు మీడియాకు సవివరంగా వివరిం చారు.
మంచిరోజులు వస్తున్నాయ్‌
రామానుజుల సహస్రాబ్ది వేళ దేశానికి, భారత జాతికి మంచిరోజులు వస్తు కనిపిస్తున్నాయని, సమర్ధులైన, భారతీయ భావనను పరిరక్షించే పాలకులు వచ్చారని, అందువల్ల అనుకూ లమైన వాతావరణంలో సమాజంలో మంచి మార్పునకు భాగ్య నగరం సాక్షిగా నిలవబోతోందని అన్నారు. జాతీయ నూతన విద్యావిధానంలో భారతీయ ఔన్నత్యాన్ని పెంచే అంశాలకు పెద్దపీట వేయడం అదృష్టమని అన్నారు. వేదాలంటే విజ్ఞాన శాస్త్ర గనులని అన్నారు. ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఆర్యభట్ట, భరద్వాజ మహర్షి, వరాహమిహిరుడు వంటి వారు ఖగోళ, వైమానిక శాస్త్ర విశేషాలకు ప్రాణం పోశారని, అలాంటివారి పాఠ్యాంశాలు కొత్త విద్యావి ధానంలో చోటుచోసుకోవడం అదృష్ట మేనని అన్నారు. వెయ్యేళ్లనాడు రామానుజుల హయాంలోను, ఆ తర్వాత మళ్లిd మనకు స్వాతంత్య్రవచ్చి ఆజాదీకి అమృతోత్సవం జరుపుకుంటున్న వేళ మేలైన మార్పులు చోటుచేసుకోవడం యాదృచ్చికం కాబోదని అన్నారు. కులం కన్నా గుణం, జాతికన్నా జ్ఞానం ప్రధానమని ఆచరించి చూపి, అదే వైష్ణవమత సిద్ధాం తమని చెప్పారు. విజ్ఞానం, ఆధ్యాత్మికత, సామాజిక సేవ లోక కల్యాణానికి కారణమవుతాయని అభిప్రాయపడ్డారు.
వెయ్యే ళ్లనాటి పరిస్థితులే ప్రస్తుత సమాజంలో ఉన్నాయని, వాటిని పారదోలాల్సిన అవసరం ఉందని అన్నారు. వర్గ, కుల, మత వైషమ్యాలు, ఆధిపత్య ధోరణులు, పరస్పర హననాలు నెలకొల న్నాయని వాటిని రూపుమాపాల్సిన అవసరం ఉందని, అప్పుడే మానవుడికి మనుగడ, శాంతి ఉంటాయని అన్నారు. రామాను జులు కేవలం ఆధ్యాత్మిక భావనకే పరిమితం కాలేదని, సామాజిక సమస్యలకూ పరిష్కారం చూపిన మానవతావాది అని చెప్పారు. 900 ఏళ్ల క్రితం నేటి కర్నాటకలో ఆయన సారథ్యంలో ఒక జలాశయం నిర్మించారని, ఇప్పటికీ అది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని, అలాంటి సామాజిక కార్యక్రమాలను ఆయన ఎన్నో చేపట్టారని గుర్తు చేశారు. రామానుజులువారు ప్రవేశపెట్టిన సమతాస్ఫూర్తి 1600 శతాబ్దంవరకు అవిచ్ఛిన్నంగా కొనసాగిందని, అయితే పరాయి పాలకుల చేతుల్లోకి దేశం వెళ్లాక సమాజాన్ని నిర్వీర్యం చేసేందుకు విభజించు పాలించు విధానాన్ని అనుసరించాయని, మళ్లిd ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో మేలైన మార్పునకు నాంది పడుతోందని అన్నారు.
సమతామూర్తి ఎందుకు?
ఒక చారిత్రక ఘట్టానికి హైదరాబాద్‌ వేదిక కాబోతోందని,5న రామానుజుల భారీ విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తామని, 2వ తేదీ నుంచి 14 తేదీ వరకు 1035 యోగకుండాలతో లక్ష్మీనారాయణ యాగం చేస్తున్నామని, 5వేల మంత్రి పండితులు ఈ క్రతువులో పాలుపం చుకుంటున్నారని చెప్పారు. రామానుజల వారికి స్ఫూర్తినిచ్చిన 12మంది ఆళ్వార్‌లు (సమతామూర్తులు), 108 దివ్యక్షేత్రాలను ఇక్కడ ప్రతిష్టించామని, ఆయా క్షేత్రాలకు భగవత్‌ శక్తి వచ్చేలా సాలగ్రామ ప్రతిష్ట చేశామని, అచ్చం ఆయా దివ్య క్షేత్రాల మాదిరిగానే మూర్తులు, ఆలయ గోపురాలు నిర్మించామని, ఆయా క్షేత్రాలలో శతాబ్దాల తరబడి ఆరాధన అందుకున్న సాలగ్రామ మూర్తులను ఇక్కడి 108 దివ్య క్షేత్రాలలో ప్రతిష్టించామని, అలాగే ఆయా క్షేత్రాలనుంచి తీసుకువచ్చిన మృత్తికను వాడామని చెప్పారు. ఈ మూర్తుల శక్తి, యాగశక్తి సమతాస్ఫూర్తిని రగిలి స్తాయని, అందుకు సమతామూర్తి మరింత ప్రోద్బలం చేస్తుందని చెప్పారు. ప్రపంచంలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ వంటి ఎందరో అసమానతలపై పోరాడిన వారి విశేషాలను ఇక్కడి డిజిటల్‌ లైబ్రరీలో నిక్షిప్తం చేశామని, ఒక్కొక్కరు ఒక్కో సమస్యపై పోరాడారని, కానీ సమాజంలో యావత్‌ సమస్యలపై రామానుజులు పోరాడారని గుర్తు చేశారు. మానవ సేవతో పాటు సకల ప్రాణికోటి సేవ రామాను జుల నినాదమని, మనిషి ఉనికికి సకల ప్రాణి కోటి ఉనికి అవస రమన్న సత్యం ఎప్పుడో చెప్పారని, కానీ దానికి భిన్నంగా అవసరం ఉన్నా లేకపోయినా ప్రకృతిలోని ఇతర జీవరాశిని మానవుడు నాశనం చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్తితులు మారేలా శక్తినిచ్చేం దుకే ముచ్చింతల సమతామూర్తి విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement