Tuesday, May 7, 2024

ప్రకృతి అందాల నడుమ…మహాశివుని అద్భుత ఆలయం

హరిహరాదులకు ప్రీతికరమైన కార్తికమాసం సందర్భంగా ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తైన, అద్భుతమైన శివాలయం గురించి తెలుసు కుందాం.
పురాణాల ప్రకారం సాక్షాత్తు పరమశివుడు కైలాసము నుండి దిగివచ్చి, ఇక్కడి ప్రకృతి అందా లకు పరవశించి ఒక రాత్రి నివసించాడు. శివయ్య పాదం తాకిన ఈ భూమి అత్యంత పవిత్రం అయింది. శివుడు కొంతకాలం ఇక్కడ వుండటం వలన జటోలీ గ్రామంలోని శ్రీమహాదేవుని ఆలయం ప్రసిద్ధి చెంది నది. హిమాచల్‌ ప్రదేశ్‌ పర్యాటక ప్రదేశాల్లో ఇది అత్యంత ఆకర్షించే శివాలయం. శివుడికి జటల నుంచి వచ్చన పేరే జటోలి.
స్వామి కృష్ణానంద్‌ ఇక్కడకు వచ్చి తపస్సు చేశా రని ప్రతీతి. బా బా పరమహంస మార్గదర్శకత్వంలో జటోలి శివాలయ నిర్మాణం ప్రారంభమయినట్లు చెబుతారు. ఈ ఆలయ నిర్మాణానికి 39 సంవత్సరాలు పట్టిందట. దాదాపు నలభైఏళ్ళ కష్టం ఈ అద్భుతమైన దేవాలయం. ఈ మంది రం శిల్పకళా నైపుణ్యం ముందు తాజ్‌మహల్‌ కూడా నిలవలేదు.
ఈ ఆలయం సివ్లూ నుండి నలభై ఆరు కి.మీ దూరంలో వుంది. ఈ జటోలి గ్రామం హమాచల్‌ప్రపదేశ్‌ సోలాన్‌ జిల్లాలో వుంది. స ముద్ర మట్టానికి సుమారు 5,200 అడుగుల ఎత్తున పర్వత సము దాయాలతో, ప్రకృతి సౌందర్యం వుట్టిపడుతూ పర్యాటకులకు ఆహ్లా దాన్ని కలిగించే అత్యంత సుందర ప్రదేశం.
ఆసియాలోనే అత్యంత ఎత్తు, సుమారు 111 అడుగులు ఎత్తు సూర్య విమానం కలిగిన ప్రాచీన శివాలయంగా పేరు పొందిన ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలున్నాయి. ఈ ఆలయాన్ని చేరుకోవా లంటే సుమారు 100 మెట్లు ఎక్కాలి.
ఈ ఆలయంలో ప్రతి ష్టించబడిన మహాదేవుని స్ఫటిక లింగం, ప్రపం చంలోనే చాలా ప్రాచీనమైన స్ఫటిక లింగంగా ప్రసిద్ధి చెందిన ది. శివ, పార్వతుల విగ్రహాలు కూడా ప్రతిష్టిం చారు. ఆలయం ఎగువ భాగంలో 11 అడుగుల ఎత్తైన బంగారు మండపా లు నిర్మించారు.
పూర్వకాలంలో ఈ ఆలయం ఎంతో చిన్నదిగా వుండేది. యీ ఆలయం ప్రక్కనే వు న్న ఒ క గుహలో శ్రీ కృష్ణానంద పరమ హంస జీ అనే యోగి తపమాచ రించేవాడు. ఒకరోజు ఆ జ్ఞాని కలలో మహశ్వరు డు సాక్షాత్కరించి ఒక పెద్ద ఆల యాన్ని కొత్తగా కట్టమని ఆదే శించినట్లు, ఆ తర్వాత ముఫ్ఫై తొమ్మిది సంవత్సరాల కఠిన పరిశ్రమ, కృషితో యీ అదుతమైన ఆలయ నిర్మాణం జరిగినట్లు స్ధలచరిత్ర చెపుతోం ది.
స్వామీజీ తపస్సు చేసిన గు#హ కూడా యిప్పుడు ఆలయ ఆవ రణలో దర్శించవచ్చు.
వినాయకుని విగ్ర#హం, తెల్లని పెద్ద నందీశ్వరుని విగ్ర#హం, చుట్టూ ప్రమదగణాలతో వున్న దృశ్యం అద్భుతం.
ఒకదాని తర్వాత ఒకటిగా మూడు శిఖరాలుగా వున్న ఆలయ విమానం మొదటి అంతస్తులో వినాయకుడు,దాని తరువాత ఐదు తలల శేషనాగు. తరువాత 111 అడుగుల ఎత్తుగా ప్రధాన విమాన ము వున్నాయి. ప్రధాన విమాన మధ్య గోష్టములో మహాదేవుడు ధ్యానము ద్రలో దర్శనమిస్తాడు. విమానం నలువైపులా అందమైన శిల్పాలు వున్నాయి.
గర్భాలయంలో పానువట్టం మీద స్వయంభూవైన జటోలీ శ్రీమహాదేవుడు స్ఫటికలింగంగా దర్శనభాగ్యం కలుగచేస్తున్నాడు.
ఈ శివలింగం క్రింద భాగాన్ని బ్ర#హ్మ భాగమని, మధ్యభాగము ను విష్ణుపీఠమని, పైభాగమును శివపీఠమని పిలుస్తారు.
మూలమూర్తికి వెనుక భాగమున, వేదిక మీద మహాదేవుడు, పార్వతీ దేవి, మహావిష్ణువు, #హనుమంతునీ విగ్రహాలు ప్రతిష్టించి వున్నాయి.
ఆలయ ఈశాన్య భాగంలో ‘జలకుండ్‌’ అనే పుష్కరిణి వున్నది. ఆ పుష్కరిణిలోని జలం, గంగాజలంతో సమానమై మ#హమా న్వితమైనదని చెప్తారు. ఈ పుణ్య జలం చర్మవ్యాధులను నయం చేసే దివ్య ఔషధంగా భక్తులు నమ్ముతారు.
పూర్వకాలంలో ఈ ప్రాంత ప్రజలు నీటిసమస్యతో బాధపడేవా రు. అదే సమయంలో స్వామి కృష్ణానంద శివుడిని ప్రార్థించి వర్షం కురిసేలా చేశారని, అప్పటినుంచీ ఈ ప్రదేశంలో నీటి కొరత అనేది లేదని చెబుతారు. ఇక్కడ ఉండే గుహలో శివుడు తపస్సు చేశాడని కూడా చెబుతారు. ఈ పురాతన ఆలయంలో ప్రతి సంవత్సరం మహా శివరాత్రి రోజున వేడులకు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు స్థానికులు మాత్రమేకాదు, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు, అశేష యాత్రికులు తరలివస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement