Sunday, May 5, 2024

జీవన తత్త్వం!

ప్రతి జీవికి ఓ లక్షణం ఉంటుంది. ప్రతి జీవితానికి ఓ లక్ష్యం, ఓ ప్రయోజనం ఉండాలి.
పూవు నవనవలాడే తీగ మీద పుడుతుంది. ఎందుకోసం? సోయగాలు అందరికీ అందించడానికా? సుగంధాలు వెదజ ల్లడానికా? అందరినీ ఆకర్షించేందుకా? ఓ చక్కనమ్మ జడలో నో, ఆ పరాత్పరుని పాదాల చెంత పవిత్రమైన గుడిలోనో నిలిచి పోవాలని ఆ పూవు తహతహలాడుతుంది. ఇక మంచి ము త్యం. సముద్రంలో పుడుతుంది. ధగధగలతో మెరిసి పోవాల నా? మెరిసిపోతూ మురిసి పోవాలనా? అందమైన హారంలో తన బ్రతుకు వెలిగి పోవాలని ముత్యం తపిస్తుంది. జీవిత సార్ధ కతను, జీవిత లక్ష్యాన్ని కడురమ్యంగాహృద్యంగా ఓ కవి గీతం రూపంలో ఆవిష్కరించిన కవితాత్మక హృదయం యిది!
తర్వాత అలలు. కడలిన పుడతాయి. ఎందుకోసం? అంతె త్తున ఎగిరెగిరి పడాలనా? ఎగిసి ఎగిసి ఆనందించాలనా? ఒడ్డుకు చేరిన ప్రతిక్షణం జావగారి ఓటమి పాలై వెనుకకి పో తున్నా, చెరగని ఆత్మస్థైర్యంతో చిందులు వేస్తూ అలలు మళ్ళీ పైకిలేస్తాయి. ఎందుకోసం?
స్వస్థానమైన అనంత సింధువులో కలిసి, కరిగి ఒదిగి పోతున్నామనే ఆహ్లాదంతో అలలు అలా పుడుతుంటాయి. పడి లేస్తూ ఉంటాయి. స్వస్థానంలో కరిగి పోవడం, కలిసి పోవడ మే ఇక్కడ దాగున్న తత్త్వం.
మరి మనం? మహా గొప్పగా జీవితాలు గడుపుతున్నాం. దేని కోసం? అందలాలు ఎక్కడానికా? అర్హతలు పెంచుకోడాని కా? అంతస్తులు అందుకోవడానికా? అన్నీ సమకూర్చుకుని భోగ భాగ్యాలతో అందరిలో మిన్న అనిపించుకోవడానికా? అన్నీ అనుభవించడానికా?
వీటి కోసమే జీవితం అని మనం అనుకుంటే లౌకికంగా తప్పు కాదు. నిజానికి ఇవన్నీ అవసరం కూడా. కాదనలేం. కానీ అంతేనా? అంతకన్నా ఇంకా ఏమైనా ఉందా? అని విచారణ చేస్తే, పూవుకి, ముత్యానికి, అలలకు, ఓ లక్ష్యం ఉన్నప్పుడు, మ రి మన మాటేమిటి? ఉత్కృష్టమైన మానవులమైన మన జీవి తాలకు అసలు సిసలైన లక్ష్యం ఉండాలి కదా? గమ్యం ఉండాలి కదా? అనే ప్రశ్నలు ఉదయిస్తాయి. జవాబు కోసం కొంచెం లోతుల లోనికి వెళ్లి పరిశీలించాలి. పరిశీలన చేయాలి.
మానవులుగా పుట్టాం. ‘నీవు’గా చెలామణి అవుతున్నాం. చెలామణి అవుతున్న ‘నీవు’లో, మూడు ‘నీవు’ లు ఉన్నారు. మొదటిది నీ గురించి నువ్వు అనుకునే ‘నీవు’. నీ గురించి యిత రులు అనుకునే ‘నీవు’ రెండోది. అసలు సిసలైన నిఖార్సయిన ‘నీవు’ మూడో ‘నీవు’.

నువ్వు నీ భార్యకు భర్తవి. నీ కొడుకుకు తండ్రివి. నీ మన వడికి తాతవు. అంటే నిజానికి నువ్వు భర్తవీ కావు. తండ్రివీ కా వు. తాతవూ కాదు. ఒక్కొక్కరితో నీకు ఉన్న బంధాలవి. సంబం ధాలవి. బాంధవ్యాలవి.
పదేళ్ల క్రింద నువ్వు అధ్యాపకుడివి. ఇప్పుడు నువ్వు పేరు న్న పెద్ద ప్రొఫెసర్‌వి. అంటే అధ్యాపకుడిగా ఉన్న నువ్వు, కాలా నుగుణంగా పదేళ్ళలో ప్రొఫెసర్‌ నీవుగా మారిపోయేవు. ఎం తో గాఢత ఉండే ఆధ్యాత్మిక తత్త్వానికి భౌతికంగా చెప్పుకునే లౌకిక పరమైన ఉదాహరణ పూర్వక వివరణ యిది.
తరచుగా మనం నా శరీరం అంటుంటాం. అంటే ‘నీవు’ వేరు. నీ శరీరం వేరు. రెండూ వేర్వేరు. ఇలా విచారణ చేస్తే నువ్వు నీ శరీరం కూడా కాదు. ఇవన్నీ నీవు కానప్పుడు, ‘నీవు’కి యివ న్నీ పెట్టిన పేర్లు. పుట్టిన పేర్లు కావని తెలుస్తుంది. తేలిపోతుంది.
అయితే ‘నువ్వు’ ఎవరివి? అంత: స్వరూపంగా, జ్యోతి స్వరూపంగా ఉన్న శ్వాస అనే చైతన్యం నీలో ఉన్నంత కాలం నువ్వు ‘శివం’. ఆ చైతన్యం (శ్వాస) నీలోంచి వెళ్లిపోయిన మరు క్షణం నువ్వు ‘శవం’ అంటారో మహనీయుడు.
అంటే నువ్వు చైతన్యానివి. అంత: స్వరూపంగా వెలుగు తున్న జ్యోతి స్వరూపానివి. ఆత్మ చైతన్యానివి. దివ్యాత్మలం మ నం. దివ్య చైతన్యాలం మనం. మన స్వస్థానం ఆత్మే. అక్కడ నుంచే మనం వచ్చేం. ఎన్నో బంధనాలలో, బంధాలలో చిక్కు కుంటున్నాం. బందీలై పోతున్నాం. చావు పుట్టుకల మధ్య గిర గిర కొట్టుకుంటున్నాం.
ఏదేమైనా మానవులుగా పుట్టేం. మళ్ళీమళ్ళీ పుట్టవలసిన అగత్యం తెచ్చుకోకుండా జన్మ రాహత్యం పొందాలి. ఆ యో గంలోకి మనం వెళ్లగలగాలి. అందుకోసం మనం మన జీవిత కాలమంతా, శుద్ధచైతన్యంలో కలిసిపోడానికి ప్రయత్నించాలి. శుద్ధ చైతన్యంలా మిగిలిపోవాలి. నిలిచిపోవాలి. ఆ శుద్ధ చైతన్యంలోనే లయమై పోవాలి. ఆ అమరత్వ సిద్ధి పొందటమే మన జీవన తత్త్వం. జీవిత లక్ష్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement