Saturday, April 27, 2024

పరమాత్మ స్వరూపులు గురుశిష్యులు!

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు అయిన శ్రీ సాయినాధులు తన చిత్ర విచిత్రమైన పద్ధతుల ద్వారా, తన భక్తులలోనే కాకుం డా, తన వద్దకు వచ్చే అందరి మనసులలో వున్న సంశయ స్వభావాలను, సందిగ్ధ ఆలోచనలను, అపనమ్మక ధోరణులను తొలగించి వారిలో తన పట్ల, దైవం పట్ల నమ్మకం దృఢమగునట్లు చేసే వారు. ఇందుకోసం కొన్నిసార్లు బోధల ద్వారా, మరికొన్నిసార్లు కేవలం కంటిచూపు ద్వారా, స్పర్శ ద్వారా కూడా వారి హృదయాలలో పరివర్తన తీసుకొచ్చేవారు. భక్తులు, సందర్శకులు, ఆఖ రుకు నాస్తికులు కూడా శిరిడీ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు పరిశుద్ధ హృదయులై, అన్ని సంశ యములను తొలగించుకొని పరిపూర్ణమైన ఆనం దం స్వంతం చేసుకొని తమతమ ఇళ్ళకు తిరిగి వెళ్ళేవారు. అటువంటి ఒక లీలను ఈ క్రిం ద ముచ్చటించుకుందాము. కాకా మహాజని స్నేహితుడు ఒకడు విగ్రహా రాధనకు విముఖుడు. బాబాలను, స్వాములను అస్సలు నమ్మడు. ఇతరుల ద్వారా బాబా గురించి విని శిరిడీలో జరిగే వింతలను చూద్దామని సంక ల్పించాడు. కాకా మహాజనితో నేను శిరిడీకి వచ్చి అక్కడి వింతలను, విశేషాలను చూస్తాను. కాని బాబాకు నమస్కరించడం, దక్షిణ ఇవ్వడం వంటి పనులను చేయను అని ఖచ్చితంగా చెప్పేసాడు. బాబాకు నమస్కరించమని అక్కడ ఎవ్వరూ బలవంతపెట్టరని, మనకు తగిన రీతిలో అక్కడ ప్రవర్తించవచ్చునని కాకా అతనికి జవాబిచ్చాడు. ఇద్దరు కలిసి బొంబాయి విడిచి ఆ మర్నాడు శిరిడి చేరారు. వారు మశీదు మెట్లు ఎక్కినంతనే కొద్ది దూరంలో నిల్చొని వున్న శ్రీ సాయి వారిని మంచి మాటలతో ఆహ్వానించారు. బాబా మాటలను విన్నంతనే కాకా మహాజని స్నేహితుడు ఆనం దంతో పరుగు పరుగున వెళ్ళి బాబా కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నాడు. ఆతని ప్రవర్తనకు కాకా ఒకింత ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అసలు సంగతి అడుగగా ”బాబా నా తండ్రి కంఠముతో నన్ను ఆహ్వానించారు. ఎప్పుడో గతించిన నా తండ్రి కంఠం ఇన్నేళ్ళ తర్వాత విన్న వెంటనే నా హృదయం మైమరిచి పోయింది. నా తండ్రిని గుర్తుకు తెచ్చిన బాబా వారి కరుణా వాత్సల్యం గురించి ఏమని చెప్పగ లను” అని గద్గద స్వరంతో చెప్పాడు కాకా స్నేహితుడు. తమను దర్శించిన కాకా మహాజనిని బాబా వరుసగా దక్షిణ అడుగసాగారు. తన భక్తులు మొక్కిన మొక్కులను తీర్చుటకు, వారి పాప పరిహార్ధం బాబా వారిని దక్షిణ అడుగుచుం డేవారు. బాబా కాకానే దక్షిణ అడిగారు గానీ అతని స్నేహితుడిని అడుగలేదు. ”నేనూ నీతో పాటు వున్నాను కదా, నన్నెందుకు బాబా దక్షిణ అడగడంలేదు?” అని అతని స్నేహితుడు కాకాని అడిగాడు. అతని మనసులోని మాటలను కనిపెట్టి నవాని వలే బాబా ”నీకు ఇవ్వడం ఇష్టంలేదని బొంబాయిలో నీ స్నేహితుడికి చెప్పావు కాబట్టి నిన్ను నేను దక్షిణ అడగడం లేదు. కానీ నీకు మన స్పూర్తిగా ఇవ్వాలనిపిస్తే ఇవ్వవచ్చును” అని అన్నారు. బాబా మాటలకు కాకా మహాజని స్నేహితు డు ఎంతో సంతోషించి అప్పటి వరకు కాకా ఇచ్చి నంత దక్షిణను సమర్పించుకున్నాడు. అప్పుడు బాబా వారికి ఒక చక్కని బోధను చేసారు” మామధ్య వున్న ఆ తెరను తీసివేయండి. నిజానికి గురుశిష్యుల మధ్య బేధమేమీ లేదు. ఇద్దరూ పరమాత్మ స్వరూపులే! కాని శిష్యుని అంతరం గం అజ్ఞానంతో మలినమైపోయి వుండడం వలన తన అసలు స్వరూపాన్ని దర్శించలేకపోతు న్నాడు. గురువుకు సంపూర్ణ శరణాగతి చేస్తే అప్పుడు గురువు తన అపూర్వమైన శక్తితో శిష్యుని అజ్ఞానాన్ని తొలగించివేస్తారు. అందుకని గురువు వేరు, శిష్యుడు వేరు అన్న బేధ భావమును మీ మనస్సుల నుండి తీసివేయండి బాబా చేసిన ఈ అపూర్వమైన బోధకు పరవశం చెందిన వారు ఇరువురూ ఎంతో ఆనం దంగా తమ ఇంటికి బయలుదేరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement