Friday, April 26, 2024

ఓంకారేశ్వర జ్యోతిర్లింగము..

శ్లో॥ కావేరికా నర్మదయోః పవిత్రే
సమాగమే సజ్జన తారణాయ |
సదైవ మాంధాతృ పురే వసం తం
ఓంకార మీశం శివమేక మీడే |

భావము:
“కావేరీ, నర్మదానదులు సంగమించు ప్రాంతంలో మాంధాత (షోడశ మహారాజులలో ఒకడు) నిర్మించిన పట్టణములో సజ్జనులను తరింపజేయడానికై నివసించియున్న ఓంకారేశ్వర నామధారుడైన శివుని పొగుడుతాను”. (ఓంకారేశ్వరుని భార్య ఓంకారేశ్వరి- అమరేశ్వరుని భార్య అన్నపూర్ణాంబ-నర్మదా నదికి రెండు వైపులా నున్న ఈ రెండు లింగాలూ దర్శనీయములు.)

పురాణగాథ: ఒకప్పుడు నారదుడు శివుని ఆరాధించడంకోసం గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తిరిగివస్తూ వింధ్య పర్వతం దగ్గరకు వచ్చాడు. వింధ్య పర్వతుడు నారద మహర్షికి అపుడు వింధ్యుడు స్వాగతం చెప్పి “నేను పర్వత రాజును, సర్వ సంపన్నుడను, ఏ విషయంలోను లోపం “లేదు” అని గర్వంగా పలికాడు. అపుడు నారదుడు అతని గర్వమునణపదలచి, “మేరువుతో పోలిస్తే నీవెంతటి వాడవు” అని ఈసడించాడు. బాధపడి “ఓంకార, క్షేత్రమునకు వెళ్ళి అక్కడ ఒక పార్థివ లింగాన్ని నిర్మించి “ఏకదీక్షతో శివునికై తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. ఈ తపస్సుతో అతని అహంకారము నశించింది. అపుడుతుడు ‘పరమేశ్వరా ! బుద్ధి యెల్లప్పుడు ప్రసన్నముగా నుండునట్లు వరమిచ్చి, నీవు యెల్లప్పుడు నా శిరస్సుపై నిలచి యుండుము’ అని కోరాడు. శివుడు తథాస్తు అన్నాడు. దేవతలు శివుని స్తుతిస్తూ జ్యోతిర్మయి రూపంతో స్థిరంగా వుండమని కోరారు. పార్ధివాకారంలో అమలేశ్వరుడు | అమరేశ్వరుడు అను రెండు పేర్లతో అక్కడ ఆవిర్భవించాడు. రెండు లింగాల రూపంతో నున్న శివుడు ఒకే జ్యోతిర్లింగముగా భావించాలి.

ఈ క్షేత్రంలో నర్మదానది ‘నర్మద, కావేరి’ అను రెండు పాయలుగా ప్రవహి స్తోంది. ఈ రెండు పాయల నడుమ ఉన్న ప్రదేశాన్ని ‘మంధాతృపురి, శివపురి అనే పేర్లతో పిలుస్తారు. కారణమేమిటనగా ఒకప్పుడు సూర్య వంశపు రాజైన ‘మాంధాత’ యను నతడు ఈ పర్వతముపై చాలా సంవత్సరాలు తపస్సు చేసి, శివుని ప్రసన్నుని చేసుకొని స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. అందుచే దీనికి మాంధాతృ పురి అనే పేరు వచ్చింది. మాంధాత కట్టించిన శివాలయము, ఇతర ఆల‌యాలను ఆకాశం నుండి చూస్తే ఓంకార రూపంలో కన్పిస్తాయి. అంచేత ఓంకారేశ్వరుడని, మలినములను తొలగిస్తుంది కనుక అమలేశ్వరుడని పేర్లు వచ్చాయి.

శ్లో॥ అమరాణాం శతైశ్చైవ సేవితోహ్యమలేశ్వరః |
తధైవ ఋషిసంఘైశ్చ తేన పుణ్యతమో మహాన్ ॥

- Advertisement -

(స్కాందపురాణం – రేవాఖండం – 28 అధ్యాయం)
భావము : ఈ క్షేత్రమున వెలసిన అమలేశ్వరుడు/అమరేశ్వరుడు ముక్కోటి దేవతల చేతను, ఋషి సంఘముల చేతను అనాదికాలము నుండి ఆరాధింపబడుచుండుట చేత పవిత్రతముడై అలరారుచున్నాడు.

చరిత్ర: ఎక్కువగా చరిత్రాంశాలేవీ ప్రాచుర్యంలో లేవు. సూర్య వంశ చక్రవర్తి మాంధాత ఇక్కడ తపస్సు చేసి ఆలయం నిర్మించడంచేత మాంధాతృపురి అనే పేరు వచ్చిందంటారు. ఈ క్షేత్రము మౌర్యులు, గుప్తులు, పరమార్ రాజుల పరిపాలనలో యెంతో దివ్యంగా వెలుగొందింది. మహమ్మద్ ఘజినీ విధ్వంసం చేసిన శివాలయా లలో ఇది రెండవది. (మొదటిది. సోమనాధ్) – పరమార్ రాజుల తర్వాత ఈ క్షేత్రం ముస్లిముల దండయాత్రల వలన శిధిలావస్థకు చేరుకొంది. తర్వాత మరాఠాల ఆధిపత్యంలో తిరిగి పునరుద్ధరింపబడింది.

దర్శనీయ స్థలములు: కోటి తీర్ధము, కోటేశ్వర, హాటకేశ్వర, త్ర్వంబకేశ్వర, గాయత్రీ శ్వర, గోవిందేశ్వర, సావిత్రీశ్వర, భూరీశ్వర, శ్రీకాళికా, పంచముఖ గణేశ్వర, ఓంకారేశ్వర, శుకదేవ, మాంధాత్రీశ్వర, మనోగణేశ్వర, శ్రీ ద్వారకాధీశ్వర, నర్మదేశ్వర, మహాకాళేశ్వర, వైద్యనాధేశ్వర, సిద్ధేశ్వర, రామేశ్వర, జాలేశ్వర, విశల్యేశ్వర, అంధ, కేశ్వర, ఝమకేశ్వర, నమగ్రహేశ్వర,
శ్రీమారుతిరాయ, సాక్షిగణేశ్వరులు, అన్నపూర్ణాంబా, తులసీదేవి మూర్తులు చూడదగినవి. తరువాత అవిముక్తేశ్వరము, దరియాయనాధ గద్దీ, వటుక భైరవుడు మంగళేశ్వరుడు, నాగచంద్రేశ్వరుడు, దత్తాత్రేయుడు, కాల- గౌరభైరవులు, శ్రీరామమందిరము, అక్కడకు దగ్గరలోగల గుహలో గల ధృష్టేశ్వరుడు, నర్మదాదేవి చూడదగినవి. శ్రీచక్రేశ్వరుడు, గోదంతేశ్వరుడు, మల్లికార్జునుడు, త్రిలోచ నేశ్వరుడు, గోపేశ్వరుడు, అమలార్జునేశ్వరుడు, ఋణముక్తేశ్వరుడు, గౌరీ సోమనాధ విశాల లింగమూర్తి (ఇతనిని మామాభాంజా అంటారు) నందీశ్వర, గహేశ్వర, హను మంతులు, అన్నపూర్ణ, మహిషాసురమర్దిని, సీతారసోయీ, ఆనంద భైరవుడు, దుర్గా భవాని, శ్రీదేవి, సిద్ధనాధ, కుంతీమాతృ దేవతలు, భీమార్జునులు, భీమశంకరుడు, కాలభైరవుడు, శ్రీమన్నారాయ ణుని 24 మూర్తులు, పశుపతి నాధుడు, గదాధరుడు, లాటభైరవగుహలో కాళేశ్వరం, 56 భైరవులు, కల్పాంత భైరవుడు, ఓం కారేశ్వరుడు దర్శించదగును. గోకర్ణేశ్వరుడు, మహాబలేశ్వరుడు, ఇంద్రేశ్వరుడు, వ్యాసేశ్వరుడు, అమరేశ్వరుడు, వృద్ధకాళేశ్వర, బాగేశ్వర, ముక్తేశ్వర, కర్దమేశ్వరములు తిలభాండేశ్వ రుడు ఆరాధనీ యులు. కార్తికేయుడు, అఘోరేశ్వర గణపతి, బ్రహ్మేశ్వర, లక్ష్మీనారా యణ, కాశీవిశ్వేశ్వర, శరణేశ్వర, కపిలేశ్వర, గంగేశ్వర, విష్ణు, వరుణేశ్వర, నీలకం ఠేశ్వర, కర్దమేశ్వర, మూర్తులు, శిలామార్కండే యీశ్వరుడు, గౌరీ సోమనాధుడు, సిద్ధేశ్వర మందిరములు చూడదగినవి. కుబేరభాండారీ, శంకరమందిరం, చ్యవన మహర్షి ఆశ్రమం, వారాహీ, చాముండా, బ్రహ్మాంశీ, వైష్ణవీ, ఇంద్రాణీ, కౌమారీ, మహేశ్వరీ అను సప్తమాతృకలు, సీతా వాటికలోని 64 యోగినీ గణములు, 84 భైరవమూర్తులు, సీతా కుండము, రామకుండము, లక్ష్మణ కుండము చూడదగినవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement