Sunday, May 19, 2024

నవనవోన్మేష దీప్తినవరాత్రి

మహాకాలుని అర్ధాంగి, కాలస్వరూపిణి అయిన ఆ తల్లికి ”మహాకాళి” అనే పేరు అందుకే వచ్చింది. పగటి స్వరూపుడైన శివుడు ధవళాంగుడు (తెల్లనివాడు). రాత్రి స్వరూపి ణియైన పార్వతి శ్యామల (నల్లనిది)
ఎల్లప్పుడూ తన బిడ్డలకు ఆపదలు రాకుండా, ఒకవేళ ఆపదలు కలిగితే వా టిని తొలగిస్తూ కాచుకోవడం మా తధర్మం. అందుకే ఆధివ్యాధులు, కరవుకాటకాలూ ప్రబలే అవకాశమున్న ”యమదంష్ట్రికలు”గా పేరొందిన శర దృతు రోజులలో బిడ్డలను రక్షించుకొనే లక్ష్యంతో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకూ, అంటే తొమ్మిది రాత్రు లు, పది పగళ్ళు నవశక్తి రూపాలతో వెలిసి పూజ లందుకొంటుంది ఆ తల్లి.
ఆమె ఒడిలో లోకులు హాయిగా నిదురించే కాలమే రాత్రి. ఆయురారోగ్య సంపదలనిచ్చే రాత్రులే శరద్రాత్రులు. పిండి ఆరబోసినట్లుగా వెన్నెలలు విరిసే శారద రాత్రులు, సాధకుల హృదయం సులభం గా ధ్యానమగ్నమయ్యేందుకు అనుకూలమైన వేళలు. ‘నవ’ అంటే తొమ్మి ది. ఇది పూర్ణసంఖ్య. నవరాత్రుల దేవీపూజ పరిపూర్ణమైన జ్ఞానానందాన్ని, అమ్మవారి సంపూర్ణ కరుణా కటాక్షాన్నీ ప్రసాదిస్తుంది. ‘నవ’ అంటే క్రొత్త అనికూడా అర్థం ఉం ది. ఆశ్వయుజ మాసానికి ఆ పేరు రావడానికి కారణం ఆ నెలలో పున్నమి నాడు అశ్వనీ నక్షత్రం ఉండడమే. ‘అశ్వని’ నక్షత్రాలలో మొదటిది కనుక నక్షత్ర గణన ప్రకారం చూస్తే ఆశ్వయుజ మాసంతో క్రొత్త సంవత్సరం మొదలవుతున్నట్లే! ఈ క్రొత్త సంవత్సరాన్ని అమ్మ దీవెనలతో ప్రారంభించడం శుభకరం. ”నవో నవో భవతి జాయమాన:” నిత్యనూతనుడైన పరమేశ్వరుడు నవ స్వరూపుడు. రాత్రి దేవీరూ పం. నవరాత్రి అంటే శివశక్తులిద్దరి ఆరాధన. శారద అంటే సరస్వతీదేవి. శారద రాత్రులు బుద్ధి వికాసానికి తోడ్పడే వేళలు.
‘రాత్రి’ అంటే రోజులో సగభాగం అనే కాదు. అది తిథి వాచకం కూడా! ”రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్‌” అని ఒక నిర్వచనం. దీని ప్రకారం నవరాత్రులంటే తొమ్మి ది దినాలని అర్థం. ”యానిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ”. అందరికీ ఏది రాత్రో అది యోగికి పగలు. అందరికీ ఏది పగలో అది యోగికి రాత్రి. రాత్రింబవళ్ళనే భేదం లేకుండా నిత్యజాగరూకత కల్గి, అంతర్ముఖులై, ఆ దేవీ తత్త్వా న్ని ఆవిష్క రించుకోవడమే శరన్నవరాత్రుల ఆంతర్యం. (శక్తి పూజ ప్రధానమై నందు వలన) వీటినే దేవీ నవరాత్రులని కూడా అంటారు.
”దీవ్యతే క్రీడతి ఇతి దేవీ” ప్రపంచాన్ని సక్రమంగా నిర్వ#హంచడమన్న బృ#హ త్కార్యాన్ని లీలాజాలంగా ఒక ఆటలాగా సాగిస్తున్న శక్తిస్వరూపిణి ఆ తల్లి. అందుకే ఆమెను ‘దేవీ’ అన్నారు. ఆమె ప్రీతి కొరకు నవరాత్రులపాటు చేస్తున్న ఉత్సవాలే ‘దేవీ నవరాత్రులు’. దేవిని శరణుపొందిన వారికి ఏ విపత్తులూ రావు.
జగన్మాతకు విజయ, అపరాజిత అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆమెను శరణు పొందిన వారికి సర్వత్రా జయమే కలుగుతుంది. శ్రీరాము డు రావణ సంహారానికి ముందు దుర్గాదేవిని పూజించాడనీ, పాండవులు తేజస్త త్త్వమున్న శమీవృక్షంపైన ఆయుధాలుంచి శక్తిని పూజించారనీ, ఈ రెండు సంఘటనలూ శర న్నవ రాత్రులలోనే జరిగాయనీ, అందు వల్లే వారికి విజయం లభించిందనీ పురాణ వచనం.
పురుషుల వలన సంహరించ బడకుండా బ్రహ్మచే వరం పొంది న మ#హషాసురుడనే రాక్షసుని వధిం చి, లోక రక్షణ చేయడంకోసం ఆవిర్భవించిన దుర్గాదేవికి జయ, విజయ అనేవారు చెలికత్తెలు. తమో గుణం, జడత్వం, అహంకారాలకు మహషం (దున్నపోతు) ప్రతీక. అటు వంటి మహష శిరము, మానవ శరీరంతో ఉన్న మహషుడు దుర్గుణాలను, ఆసురీ గుణాలను తలకెక్కించుకొన్న మూఢమానవులకు సంకేతం. దైవీ గుణాలతో అసురీ గుణాలను నిర్జించి దైవత్వమందడమే మహషా సుర మర్ద నంలోని ఆంతర్యం.
కాళికాదేవి రెండు కుడిచేతులలో అభయ, వరద ముద్రలను, రెండు ఎడమ చేతులలో ఖండించబడిన మహషుని శిరస్సును, ఖడ్గాన్ని ధరించి కనిపించడం లోని ఆంతర్యాన్ని రామకృష్ణ పరమహంస చక్కగా వివరించారు. ”ఆమె కుడిభా గం రక్షణ, ఎడమభాగం శిక్షణలకు సంకేతాలనీ; శిష్టరక్షణ, దుష్టశిక్షణలు ఆమె ధర్మాలనీ; శాంతం, భయానక ములు రెండూ ఆమె రూపాలేననీ; ద్వంద్వాతీ తయై న ఆ శక్తిని ఉపాసించే వారికి ఎనలేని బ్రహ్మానందం స్వంతమవుతుందనీ వివరణ.
స్కాందపురాణం ఇలా అంటుంది-

”దుర్లభం సర్వ జంతూనాం దేవీపూజా ఫలాధికా
దుర్గా, లక్ష్మీ, మహాదేవ్యై: పూజనీయ: ప్రయత్నత:
ఆశ్వయుజా స్మీ సంప్రాప్త్యై ప్రతిపచ్ఛుభవాసరే
తదారభ్య ప్రయత్నేన నవరాత్రౌచ పూజయేత్‌.”

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిది రాత్రులు దుర్గ, లక్ష్మి, సరస్వ తులను పూజించాలి. ఆ పూజ సమస్త శుభ ఫలితాలను మిక్కిలిగా ఇస్తుంది. పుణ్యా త్ములకే కాక అందరికీ ఆ పూజ చేయను వీలుపడదు. తొమ్మిది రోజుల ఈ పూజకు అంకురార్పణ, కలశస్థాపన, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు జరుగుతుంది. తొమ్మి ది రోజులు తొమ్మిది రూపాలతో నవవిధ నైవేద్యాలతో- పూలు, గాజులు, పసుపు కుం కుమల వంటి సౌభాగ్య ద్రవ్యాలతో, అమ్మను శ్రద్ధాభక్తులతో ఆరాధించాలి. కుమారీ పూజ, సువాసినీ పూజలను చేస్తూ స్త్రీ శక్తులను ఆరాధించాలి. దురలవా ట్లకు, మద్యమాంసాలకూ దూరం ఉండాలి. ”సర్వ రోగోప శమనం, సర్వోపద్రవ నాశనం/ శాంతిదం సర్వకష్టానాం నవరాత్రవ్రతం శుభం” శారీరక మానసిక రోగా లన్నీ ఉపశమించి, ఉపద్రవాశ శాంతించి, ఆపదలూ తొలగిపోతాయని స్కాందపు రాణం చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement