Saturday, April 27, 2024

మ‌హిమ‌ల రాశి శ్రీ దుర్గానాగేశ్వ‌ర స్వామి క్షేత్రం

దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కృష్ణా జిల్లా పెద్దకళ్లేపల్లి క్షేత్రం ఎంతో మహమా న్వితమైన పుణ్య క్షేత్రం. ఈ క్షేత్ర మహమ స్కాందపురాణంలో పేర్కొన బడింది. ఈ క్షేత్రమహాత్మ్యం గురించి అగస్త్య మహాముని శ్రీ రామచంద్రునికి చెప్పి నట్లు పద్మపురాణంలో పేర్కొనబడింది. అనేకమైన సమాన ధర్మాలు ఉత్తరదేశంలో ఉన్న కాశీ క్షేత్రానికి ఇటు దక్షిణాన కృష్ణానది తీరాన ఉన్న పెదకళ్ళేపల్లి క్షేత్రానికి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాశీ క్షేత్రానికి గంగానది ఉత్తర వాహనిగా ఉంటే, కదలిపురంగా కూ డా పిలిచే ఈ పవిత్ర తీరానికి కృష్ణా నది ఉత్తర వా#హనిగానే ప్రవహస్తుంది. కళ్ళేపల్లిలో నాగేశ్వరస్వామి వారు కొలువైన ఈ మహత్తర పుణ్య క్షేత్రంలో ఆనందవనం, కదళీ వనం, మణికర్ణికా ఘట్టం, పరికర్ణికా ఘట్టం (నాగకుండం) గంగానది తీరము, కృష్ణా నదీ తీరము. అందుకే ఇది దక్షిణ కాశీగా ప్రాశస్త్యం పొందింది.
ఈ ఆలయానికి ఈశాన్య భాగములో నాగకుండం అనే సరస్సు ఉంది. దీనినే నాగ ప్రదమని, నాగసరోవరమని పిలుస్తుంటారు. ఉత్తమ తీర్థాలన్నీ ఇందులో సంగమించి ఉండటం వలన పరికర్ణికా తీర్థమనే పేరు వచ్చింది. ఇక్కడ నాగ, రుద్ర, బ్ర#హ్మ, భైరవ, కుముద్వతి, అంబిక, శారదా మొదలైన పేర్లతో కుండాలున్నాయి. శంకుతీర్థము, చంద్రకుండము కూడా ప్రసిద్ధి చెందినవి.
ఈ క్షేత్రంలో ఉన్న లింగము కర్కోటకము అనే సర్పరూపమున స్పటిక లింగము గా ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంభువు. స్వామివారు గర్భాలయంలో పల్ల పు ప్రదేశంలో ఉండటాన్ని గమనించిన నాటి చల్లపల్లి సంస్థానాధీశులు అంకినీడు ప్రభువులు స్వామిని త్రిపీఠములపై పున:ప్రతిష్టచేయు సంకల్పముతో గర్భాలయం త్రవ్వించగా స్వామి గర్భాలయంలో ఒక శిలగా ఉండటాన్ని గమనించి ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అందువల్ల స్వామివారు నేటికినీ గర్భాలయంలో పల్లపు ప్రదే శంలో ఉండటాన్ని ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఈ స్వామివారిని వశిష్ట మహర్షి పూజించినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి.
ప్రకృతి రమణీయ దృశ్యాలతో, పచ్చని పంటచేల నడుమ అందమైన ఐదు అంత స్తుల రాజగోపురం అల్లంత దూరానికే కన్పిస్తుంటాయి. విశాలమైన ఆలయ ప్రాంగ ణంలో చారిత్రక సంపదతో ఆధ్మాత్మిక వాతావరణంలో అశేష భక్త జనావళిని విశేషం గా ఆకర్షిస్తున్న దివ్య క్షేత్రం పెదకళ్ళేపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి వారి ఆలయం. ఆలయ ప్రదక్షిణ మార్గంలో సత్యస్తంభం ఉంది. ఇది పాలరాతి స్తంభం. బౌద్ధ చిహ్న ములతో అస్పష్టంగా కనిపించే బ్రాహ్మ శాసన లిపితో ఉన్న ఈ స్థంభం దగ్గర సత్య ప్రమాణం చేస్తున్న సమయంలో విరిగి ఒక వర్తకునిపై పడటంతో ఆయన మృతి చెందా డు. నేటికి ఈ స్తంభం సగభాగం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆలయ గోడలపై ఆల యాన్ని ప్రధమంగా పునర్నిర్మించిన సోమశివాచార్యులవారి ప్రతిమ మనకు కన్పి స్తుంది. యాత్రీకులు ముందుగా ఈ సత్యస్తంభాన్ని సందర్శించిన తర్వాతనే స్వామి వారిని సేవించడం ఆచారంగా వస్తోంది. ప్రక్కనే పంచముఖ గణపతి విగ్రహం కూడా కనిపిస్తుంది. స్వామివారి గర్భాలయం గోడవెలుపల దక్షిణ భాగంలో ఉన్న ఈ పంచ ముఖ గణపతి సింహావాహన రూఢుడై ఉండటం విశేషం,
ఈ ఆలయ ప్రాంగణమునందు పార్వతి, దుర్గ, కాలభైరవ, భద్రకాళి సహత వీర భద్రస్వామి, సుబ్రహ్మణ్యశ్వరస్వామి, నవగ్రహాలు కలవు. వాయవ్యదిశలో సుబ్రహ్మ ణ్యశ్వరాలయం, ఉత్తర దిశగా దక్షిణాభిముఖంగా కాలభైరవ ఆలయం ఉంది. ఈశా న్య దిశలో 16 స్తంభముల కళ్యాణ మండపం ఉంది. యాగశాల (బలిపీఠం) కూడా కలదు. ప్రతి నిత్యం ఉదయం, రాత్రిపూట నిత్యం బలి#హరణ జరుగుతుంది. స్వామి వారికి దక్షిణ భాగం వైపు ఉపాలయంలో వీరభద్రుడు భద్రకాళీ ఉన్నారు. స్వామి వారికి ఉత్తర దిశగా దుర్గమ్మవారు వేంచేసి యున్నారు. గర్భాలయంలో పరమ కారుణ్యమూర్తి, సమస్త దోషనివారకుడు, సకలైశ్వర్య ప్రదాయకుడు శ్రీ నాగేశ్వర స్వామి ఉన్నారు. క్రీ.శ. 1292లో కాకతీయ రాజగురువు సోమశివాచార్యులు ఈ ఆల యాన్ని తొలిసారి ఉద్ధరించినట్లు తెలుస్తోంది. తరువాత దేవరకోట సంస్థానాన్ని పరి పాలించిన 13వ జమిందారు కోదండరామన్న 1782లో ఆల య కట్టడాలను నిర్మించి పునర్నిర్మించారు. 1795లో చల్లపల్లి సంస్థానానికి 15వ జమిందారైన నాగేశ్వరనా యుడు గోపుర నిర్మాణం గావించారు. ఇప్పటికీ ఈ దేవస్థానానికి చల్లపల్లి జమిందారి వంశానికి చెందినవారే ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు.
శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి వారి ఆలయంలో పూజా కైంకర్యాలు అత్యంత నిష్టా గరిష్టులైన అర్చకులచే నిర్వ#హంచబడుతున్నాయి. మాఘ మాసంలో దశమి రోజున అంకురార్పణ, ఏకాదశి రోజున ధ్వజారోహణం, త్రయోదశిన కళ్యాణస్నానం, చతుర్ధశి రోజైన మహాశివ రాత్రి సందర్భం గా జగజ్యోతి, స్వామి వారి కళ్యాణ ఉత్సవంతోపాటు అమావాస్య రోజున స్వామివారి రథోత్సవం భూలోక కైలాసంగా కన్నుల పండుగగా జరుగుతాయి.
ఈ శైవ క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాలస్వామి. రుక్మిణీ సత్య భామా సమేతుడై వేణుగోపాలస్వామి ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తున్నారు. శ్రీ వేణుగోపాలస్వామి వారిని బ్ర#హ్మర్షి విశ్వామిత్రుడు ప్రతిష్టించినట్లు పద్మ పురాణంలో పేర్కొనబడింది. శ్రీ దుర్గా నాగేశ్వరస్వామివారి ఆలయానికి- వేణుగోపాల స్వామి ఆలయానికి మధ్యభాగంలో విష్ణు తీర్థయతీంద్రుల వారు ఒక ఆలయాన్ని ఏర్పరచి అందు ఆంజనేయస్వామివారిని ప్రతి ష్ఠించారు. ఇంతటి మ#హమాన్వితమైన పుణ్యక్షేత్రంలో వెలసియున్న శ్రీ దుర్గా నాగేశ్వరస్వామివారి దర్శనము చేసుకున్న భక్తులకు పునర్జన్మ లేద న్న నమ్మకం ఉంది. స్వయంభువుగా వెలసిన శ్రీ స్వామివారిని మహా శివ రాత్రి సందర్భంగా అనేక ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ సందర్భంగా ఆర్‌టిసి ప్రత్యేక బస్‌లు నడుపుతుంది. వివిధ సేవా స్వచ్ఛంద ధార్మిక సంస్థలు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఆహారం, వసతి సౌకర్యలు అంతంతగా వున్న ఆ గ్రామంలో ఉచిత అన్నదానాలు, మంచి నీరు, మజ్జిగ పాకెట్లు, అంద జేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement