Saturday, May 4, 2024

మహా శివరాత్రి కోలాహలం శ్రీశైలంలో రథోత్సవం

కర్నూలు, ప్రభ న్యూస్‌ బ్యూరో: శ్రీశై లం క్షేత్రంలో మహా శివ రాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగు తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మి దవ రోజైన బుధవారం శ్రీభ్రమ రాంబ మల్లి కార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూ జలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనం తరం సాయంత్రం గంగాధర మండపం వద్ద 11 రకాల ప్రత్యేక పుష్పాలతో అలం కరించి రథాంగపూజ, రథాంగ హోమం, రథాంగబలిలో గుమ్మడికాయలు, కొబ్బరి కాయలు, అన్నం రాశిగా పోసి కుంబం సాత్విక బలి సమర్పించిన అనంతరం రథంపై స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి రథోత్సవం జరిపించారు. ఆలయ ప్రధాన వీధిలో జరిగిన రథోత్సవంలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి తమ ఇష్టదైవాలైనా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. రథోత్సవం దర్శించుకోవడం వలన స ర్వపాపాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాల్లో చెప్ప బడింది. అంతకుముందు స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజా నిర్వహించగా, లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేయ బడ్డాయి. అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివ పంచాక్షరి ,నిత్యహ వనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్య క్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపించారు. ఇక సాయం కాలం ప్రదోషకాల పూ జలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు చేశారు. ఆ తర్వాత సాయ ంకాలం స్వామిఅమ్మ వార్ల రథోత్సవం నిర్వ హించడం గమనార్హం. తెప్పోత్సవం మ హాశివరాత్రి బ్రహ్మో త్సవాలను పురస్కరిం చుకుని రాత్రి 8 గంటలకు శ్రీస్వామి అమ్మ వార్లకు తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ పుష్కరిణి వద్ద ఈ తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించడం విశేషం. ఈ తెప్పోత్సవ కార్య క్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడ శోపచారపూజలు నిర్వహించారు. ఆ తరువాత ఉత్సవ మూర్తులను ఆలయరాజగోపురం నుండి పుష్పాలంకృత పల్లకీలో ఊరేగింపుగా తొడ్కోని వచ్చి పుష్కరిణిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపైకి చేర్చి విశేష పూజలు అందించారు. తరువాత మం గళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో ఎంతో శాస్త్రోక్తంగా ఈ తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించారు. విద్యుద్దీప కాంతుల నడు మ పుష్కరిణిలో తెప్పపై విహరించిన ఆది దంపతులను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మంగళ వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో ఆలయ రాజగోపురం నుండి పుష్కరిణికి చేరుకున్న స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార క్రతువులు నిర్వహించి పుష్కరిణిలో మూడుసార్లు ప్రదక్షిణలు చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement