Friday, May 17, 2024

నిరంతర ద్వేషి శిశుపాలుడు

శ్రీకృష్ణుని మేనత్త కొడుకు శిశుపాలుడు. చేది దేశపు రాజు. దగ్గరి చుట్టరికం ఉన్నప్పటికీ కృష్ణుడి మీద ప్రేమాభిమానాలనేవి లేవు. పైగా నిరంతరం కృష్ణుని ద్వేషిస్తూ ఉం టాడు. అవకాశం దొరికితే చాలు అవమానిస్తూ ఉంటాడు.
శిశుపాలుని ఆగడాలు చూసీచూసీ విసిగిపోసిన కృష్ణుడు ఒక సందర్భంలో దండించబోయా డు. అప్పుడు శిశుపాలుని తల్లి ”ఆగు కృష్ణా.. నా ముఖం చూసి శిశుపాలుని క్షమించు” అంది.
కృష్ణుడు కోపాన్ని తమాయించుకుని, ”అత్తా, నువ్వు చెప్పావు కనుక ఆగుతున్నాను. నీ మీది గౌరవంతో నీ కొడుకు తప్పులను నూరుసార్లు సహిస్తాను. ఆపైన మాత్రం సహించేది లేదు.. ఇక అతడు శిక్ష అనుభవించక తప్పదు” అన్నాడు. అయినా శిశుపాలుని వైఖరిలో మార్పులేదు. తప్పులు చేస్తూనే ఉన్నాడు. సమయం సందర్భం లేకుండా శ్రీకృష్ణుని అవమాని స్తూనే ఉన్నాడు. ధర్మరాజు తలపెట్టిన యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. యాగం ముగి సింది కనుక తృప్తిగా దానధర్మాలు చేయాలనుకున్నారు.
అంతకంటేముందు భీష్మపితామహుడు తొలి తాంబూలం శ్రీకృష్ణునికి ఇవ్వమని యుధి ష్ఠిరునికి చెబుతాడు. ధర్మరాజు మనసులో ఉన్నది కూడా అదే ఆలోచన కనుక చిరునవ్వుతో తల పంకించి శ్రీకృష్ణునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, అగ్రతాంబూలం సమర్పించాడు.
అందుకు దేవతలు హర్షించారు. విరుల జల్లు కురిపించారు. అయితే శ్రీకృష్ణునికి ధర్మ జుడు అగ్రతాంబూలం ఇవ్వడం శిశుపాలునికి ఎంతమాత్రం రుచించలేదు. అసూయాద్వేషాలు మానసును దహింపచేయగా ”ఎందరో పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, వృద్ధులు, త్యాగశీలురు, ధైర్యపరాక్రమాలకు మారుపేరైన క్షత్రియులు, మరెందరో ఉత్తములు ఉండగా ప్రథమ తాంబూలం ఇవ్వడానికి శ్రీకృష్ణుడే కనిపించాడా? కృష్ణుడు ఒక యాదవుడు, పశువుల కాపరి అని మర్చిపోయారా? ఇంతకంటే తెలివితక్కువ పని ఇంకొకటి ఉంటుందా? అగ్రతాంబూలం ఇవ్వడానికి ఇంత అయోగ్యుడిని ఎంచుకుంటారా? ఇది తక్కినవారికి ఎంత అవమానం కలిగిస్తుందో అర్ధం చేసుకునేపాటి విచక్షణ కూడా లేదా?” అంటూ ఆగ్రహావేశంతో చిందులు తొక్కాడు. ఆయన ఔచిత్యం లేని పనికిమాలిన సలహా ఇస్తే.. దాన్ని నువ్వు అనాలోచి తంగా పాటిస్తావా?ధర్మరాజా నువ్వేదో ప్రశాంతంగా ఉంటావు. తెలివిగా ఆలోచిస్తావు అనుకు న్నాను.. కానీ, నువ్వు కూడా మతిలేకుండా ప్రవర్తిస్తావని స్పష్టమైంది. కనీసం అందుకునేవాడి కైనా బుద్ధి ఉండాలా? ఇందరు మహామహులు ఉండగా నేను అగ్రతాం బూలం అందుకోవడం ఏమిటి? తగుదునమ్మా అంటూ పుచ్చుకుంటాడా!” అంటూ నోటికొచ్చినట్లు తూలనాడాడు.
ఈ సంఘటనతో శిశుపాలుని నూరు తప్పులు పూర్తయ్యాయి. ఇది నూట ఒకటో తప్పు. ఇక కృష్ణుడు దయచూపలేదు. ముందే చెప్పినట్లుగా శిశుపాలుని శిక్షించేందుకు సమాయత్త మయ్యాడు. సుదర్శన చక్రంతో శిశుపాలుని తల ఖండించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement