Thursday, May 2, 2024

హనుమకు తనను సమర్పించుకున్న రాముడు

హనుమంతుడు సీతా విషయం లంకలో జరిగినది చెప్ప గా శ్రీరాముడు విని, సంతోషించి, సుగ్రీవుడితో స‌స‌మన హనుమంతుడికి సమానమైనవాడని చెప్పగలవాడు ఈ లోకంలో ఎవరైనా వున్నారా? లేడుకాక లేడు. హనుమంతుడు కాకుండా, మరెవ్వరికైనా ఆ సముద్రాన్ని దాటడం సాధ్యమయ్యే దా? రావణుడు పాలించే లంకను ఎంతటివాడైనా తన బల సంపదతో ప్రవేశించడం సాధ్యమా? ఒకవేళ ప్రవేశించినా మళ్లి ప్రాణాలతో తిరిగిరావడం సాధ్యమా? అలా చేయగలగడం మన హనుమంతుడికి ఒక్కడికే చెల్లింది. సుగ్రీవుడి యోగ్యతకు తగ్గట్లు రాక్షసులను వధించి లంకాదహనం చేశాడు. యజమాని చెప్పని అవసరమైన కార్యక్రమం కూడా నెరవేర్చే దూతను పురుషోత్త ము డు అంటారు. ఇది ఉత్తమ దూత లక్షణం. హనుమంతుడు పురుషోత్తముడైనందున రాక్షసులకు చిక్కినా, తన గౌరవానికి హాని కలుగకుండా నియమిత కార్యాన్ని సాధించాడు. ఇది ఆయన తన స్వామికి చేసిన ఉపకారం. జానకిని చూసి వచ్చి మా ఉత్తమ రఘు వంశానికి ప్రాణాలిచ్చి రక్షించాడు. నేనే రాజుగా వుంటే సర్వరాజ్యం ఇచ్చేవాడిని హనుమా! అది కూడా లేదాయె. కాబట్టి నువ్వు చేసిన దానికి బదులుగా నా కౌగిలిని తీసుకో ఆంజనేయా! ఇది బదులుగా అంటున్నాను కాని సమానంగా అనడం లేదు. ఇది నువ్వు చేసిన దానికి సమానంకాదు. అయినా, ఈ అల్ప దక్షిణను శాస్త్రోక్త దక్షిణ గా తీసుకోమని నాకున్న అల్పమైన ఈ దేహాన్ని నీకు సమర్పిస్తున్నాను. నా ప్రార్థనని కృపతో పరిగ్రహించు. నువ్వు నిరాకరిస్తే నాకంత కంటే వేరే మరణంలేదు. ఎందుకు నా కౌగిలి సమానం కాదంటు న్నా నా? అక్కడ చావడానికి సిద్ధంగా వున్న సీత ప్రాణాలు నిలిపావు. ఆ వార్త తెచ్చి ఇక్కడ నా ప్రాణాలు నిలిపావు. ఇలా ఇద్దరి దేహాలు నువ్వు ఇస్తే, నేను ఒక్క దేహాన్ని ఇవ్వడం ఎలా సమానమవుతుంది? కాదు. నేనేం ఏమీ చేయలేకపోయానని బాధపడుతున్నాను. నా ఈ దు:ఖాన్ని నేనిచ్చిన దానిని స్వీకరించి అణచివేయి. నువ్వు చేసిన ఉప కారాలకు ఇది సమానం కాదు. కాబట్టి హచ్చు, తక్కువలు ఆలోచిం చకుండా నేనిచ్చిన అల్పాన్ని స్వీకరించు” అన్నాడు రాముడు. రాముడు కౌగిలి ఇవ్వడం అంటే తనను తాను సమర్పించు కొనడమే. ఆత్మాత్మీయనిక్షేపం అన్నట్లుగా తనను సమర్పించుకోవ డం, అంటే, తనకున్న సర్వస్వాన్ని, అంటే, నిత్యవిభూతి, లీలా విభూతి రెండూ అర్పించినట్లే. వీటితో ఆయనకేం ప్రయోజనమం టే, ఆయనకు ప్రియమైనది ఇస్తేనే కదా, ప్రయోజనం అనవచ్చు. హనుమంతుడికి ప్రియమైంది శ్రీరామచంద్రమూర్తి దివ్యమంగళ విగ్రహమే. ఎవరికేది ప్రియమో దానినే భగవంతుడు ఇస్తాడు. కాబ ట్టి ఆ దివ్యమంగళ విగ్రహం మీద హనుమంతుడికి ప్రీతి అని తెలిసి రాముడు ఇచ్చాడు. దాంతో హనుమంతుడు తృప్తి చెందాడు.
శరీరం పులకరిస్తుంటే రామచంద్రమూర్తి ఆంజనేయుడిని నిండు మనస్సుతో కౌగలించుకుని సుగ్రీవుడిని చూసి ”జానకీదేవిని వెతికే పని చక్కబడింది. సముద్రాన్ని దాటి, వానరులందరూ దక్షి ణ దిక్కు తీరానికి చేరే ఉపాయం చెప్పు. వానరులారా! ఆ సము ద్రాన్ని ఎలా దాటాలో ఉపాయం చెప్పండి” అని వానరులకు చెప్పి, రాముడు ఆంజనేయుడితో కలిసి ఆలోచన చేశాడు.
సుగ్రీవుడు రాముడితో ”ఏ ఉపాయం చేస్తే పాపాత్ముడైన రావ ణుడిని యుద్ధంలో చంపి సీతాదేవిని తీసుకురావచ్చో ఆ మార్గాన్ని ధీరుడివై చేపట్టు. నువ్వు చేయాల్సినదంతా సముద్రాన్ని దాటి లంక చేరడానికి ఏం చేయాలన్న ఆలోచనే. లంక కనబడితే ఇక రావణుడు చచ్చినట్లే. రామచంద్రా! ఒకటి మాత్రం నిశ్చయం. సేతువు కట్టకుం డా సముద్రాన్నిదాటడం దేవతలకైనా సాధ్యంకాదు. సేతువే ఏర్పా టైతే వానరులు సముద్రాన్ని దాటడం శత్రుసంహారం చేయడం తధ్యం. ఎందుకంటే ఈ వానరులు కామరూపులు. యుద్ధంలో శూరులు. కలహానికి భయపడరు.” అన్నాడు.
సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న రాముడు హనుమంతుడితో, ”హనుమంతా! నువ్వు లంకానగరాన్ని కళ్లారా చూశావు కదా! దానిలో కోటలెన్ని వున్నాయి? సైన్యం ఎంత? లంకకు ద్వారా లెన్ని? కోటలెన్ని? వాటిని ఏవిధంగా కట్టించారు? రాక్షసుల ఇండ్లు ఎన్ని? వాటిని రక్షించడానికి ఎలాంటి ఉపాయం చేశారు? ఇవన్నీ వివరంగా చెప్పు” అన్నాడు.
జవాబుగా హనుమంతుడు, ”దేవా! లంకకు నలుదిక్కులా నాలుగు ద్వారాలున్నాయి. వాటిని అడ్డగడియచెట్లతో బంధించా రు. ఆ ద్వారాలలోని రాతి యంత్రాలతో ఆ మార్గాన వచ్చిన విరోధి సైన్యం అక్కడే చచ్చిపోతుంది. రాక్షసులు నిర్మించిన శతఘ్నులు వేటుకు వందమందిని చంపగలవు. అవి ద్వార- ద్వారాన వున్నా యి. కోటగోడలను పగులగొట్టి లోపలికి పోవడం సాధ్యపడదు. ఆ పట్టణం చుట్టూ మిక్కిలి భయంకరమైన మొసళ్లతో నిండి చాలా లోతులో నీరున్న కందకాలున్నాయి. ఆ కందకాల మీద ప్రజల రాక పోకలకు అనుకూలంగా వుండేవిధంగా వెడల్పాటి వంతెనలున్నా యి. శత్రువులు వచ్చినప్పుడు యంత్రాలను తిప్పితే, ఆ వంతెనలు లేచి కోట ద్వారాలకు తలుపుల్లాగా అడ్డుపడతాయి. అక్కడ ఇండ్ల వరసలున్నాయి. అవి కూడా ఆ పలకల వంతెనల్లాగే శత్రువులు వచ్చినప్పుడు లంకాపురాన్ని రక్షిస్తాయి.”
”లంకలో నాలుగు రకాల భయంకర దుర్గాలున్నాయి. ఇవి ఇతరులకు సాధ్యపడవు. లంక నిరాధారంగా సముద్రతీరంలో వున్నది. దానిలోకి ప్రవేశించడం దేవతకు కూడా సాధ్యంకాదు. నావలు కూడా దాని సమీపంలోకి పోవడానికి దారిలేదు. పర్వత శిఖరం అమరావతిలాగా వుంది. బయటి వార్త లోపలికి పోవడం కానీ, లోపలివార్త బయటికి రావడానికి కానీ వీలుకాదు. జయించ డానికి ఏదీ సాధ్యపడదు. తూర్పునుండి సైన్యం రావడానికి వీలు పడదు. ఆ ద్వారంలో పదివేలమంది రాక్షసులు సైన్యానికి ముందు నిలిచి యుద్ధం చేయడానికి సిద్ధంగా వుంటారు. పడమటి వాకిట్లో పదిలక్షలమంది రాక్షసులు కాపలాగా వుంటారు. ఉత్తర ద్వారం దగ్గర పది అర్బుదాల రాక్షసులుంటారు.”
#హనుమంతుడి మాటలను విన్న రాముడు ”లంకను పాడు చేయడం పెద్ద పనికాదని భావిస్తున్నాను. రావణాసురుడి పురాన్ని ధ్వంసం చేస్తాను. ప్రయాణానికిదే మంచి ముహూర్తం. ఈ ముహూర్తానికి విజయం అని పేరు. ఇప్పుడు మనం బయల్దేరి వెళితే పగవాడు చస్తాడు. ఈ ముహూర్తానికి ”అభిజిత్‌” అని పేరు. ఈ రోజు ఉత్తర ఫల్గుణీ నక్షత్రం. నా జన్మ నక్షత్ర్రానికి ఆరవది కాబట్టి శుభం కలుగుతుంది. రేపు చంద్రుడు హస్తతో కూడి ఏడవతారై ధనతార అవుతుంది. అది అశుభం. రేపు ప్రయాణం చేయకూడదు. కాబట్టి ఈ రోజే సైన్యంతో సహా ప్రయాణం చేయాలి. మంచి శుభశకునాలు కనపడుతున్నాయి. కాబట్టి రావణుడిని చంపి సీతను తేవడం సత్యం. జయం పొందుతావని చెప్పేవిధంగా కంటి పైభాగం అదు రుతున్నది. ప్రయాణం చేయడానికి ఇదే సరైన సమయం.”
రాముడు చెప్పగా, సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు భూమ్యాకాశాలు దద్దరిల్లేట్లు భయంకరంగా బయల్దేరారు వానరులు. రాముడు లక్ష్మణ సుగ్రీవులతో కలిసి అతివేగంగా, దక్షిణ దిక్కుగా ప్రయాణం చేశాడు. శ్రీరాముడి వెంట వానర సైన్యం నడిచింది. ఎవరికివారు తామే రావణుడిని చంపుతామని అన్నారు. సుగ్రీవుడు ముందు వెళుతున్నాడు. త్వరగా నడవమని వానరులను ప్రోత్స#హంచారు. ఒక రాత్రి, ఒక పగలు విడవకుండా ప్రయాణించి సముద్రాన్ని చేరా రు. రాముడు ”ఏదైనా ఒక ఉపాయం చేసి దీన్ని దాటాలి వ్యర్థంగా కాలం గడపకూడదు” అన్నాడు. సముద్రతీరాన సేనలన్నీ ఏఏ సేన ఏఏ చోట దిగాల్నో ఆ విధంగానే దిగిన తరువాత రాముడు సము ద్రానికి ఆవలి ఒడ్డున సీతాదేవిని తలచుకుని బాధపడ్డాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. రామచంద్రుడు సంధ్య వార్చాడు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement