Saturday, May 4, 2024

అత్యంత పుణ్యప్రదం కార్తిక సోమవార వ్రతం..

సూర్యుడు తులా రాశిలో ప్రవేశించే కార్తికంలో సూర్యానుగ్రహంతో సర్వ కార్యాలు నెరవేరుతాయని పురాణోక్తి. వశిష్ట మహర్షి ఒకసారి జనక మహారాజుకు కార్తిక మాసం పవిత్రత వివరిస్తూ, ఈ మాసంలో ఏది దానం చేసిన దానికి రెట్టింపు ఫలితం వస్తుందని ప్రస్తుతించారు. కార్తిక మాసంలో చేసే నదీ స్నానాలు అమోఘమైన ఫలితాలనిస్తాయి. ఈ నదీ స్నానం చేసే ముందు-

”సర్వ పాప హర: పుణ్య వ్రతం కార్తిక సంభవం
నిర్విఘ్నం కురమే దేవా దామోదర నమోస్తుతే”

అంటూ దామోదరుడిని స్తుతించాలి.
వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ విష్ణువు వ్యాపించి ఉంటాడు. కనుక ప్రాత:కాలంలో ఎక్కడ స్నానం చేసినా శుద్ధాత్ములై శివున కు ప్రీతిపాత్రులవుతారు. దేవతలకు, పితురులకు ఈ మాసంలో వదిలే తర్పణాలు అధిక ఫలా న్నిస్తాయి. ఈ క్రమంలో యక్ష తర్పణం చేసి దుస్తులను ధరించి సంధ్యావం దన గాయత్రి జపాలను ఆచరించాలి. ఔ పోసనం చేసి బ్రహ్మ యజ్ఞం ఆచ రించి మంచి పుష్పాలతో శంఖ చక్రధారి అయిన విష్ణువును సభక్తికంగా పూజించాలి. కార్తీక పురాణం పఠనం చేయాలి. సాయంకాలం శివాలయంలో గాని విష్ణాలయాల్లోగాని యధాశక్తి దీపాలను పెట్టి శివ కేశవులను అభే దంగా పూజించాలి.
ఇలా నెలంతా చేయలేనివారు కేవలం సోమవారాలు మాత్రం శివుని పూజించినా విశేష ఫలాలను పొందుతారు. అందుకే ఈ మాసంలో సోమవారం వ్రతం అత్యంత ఫలదాయకమని చెబుతారు. కార్తిక సోమవా రం వ్రతం చేసిన వారికి భగవంతుడు అశ్వమేధ యాగ ఫలాన్నిస్తాడని పురా ణాలు చెబుతున్నాయి.
కార్తిక మాసంలో ఉపవాసాలు కూడా ఫలప్రదమైనవే. ఈ మాసంలో పగలంతా ఉపవాసం చేయాలి. సాయంత్రం స్నానపానాదులు తర్వాత శివ విష్ణాలయాలను భేదం పాటించకుండా వీలును బట్టి కోవెలలో దీపారాధన చేయాలి. శివ పూజచేసి నక్షత్ర దర్శనం చేసుకోవాలి. అనంతరం ఉపవాస దీక్షను విరమించి శివ ప్రసాదాన్ని భక్తియుక్తంగా సేవించాలి. ఇలా చేసిన వారికి ఈ లోకంలో సిరిసంపదలకు కొదువ ఉండదు. అంతేకాకుండా శివ సాయుజ్యం తప్పకుండా దొరుకుతుందని శివ పురాణం ద్వారా అవగ తమవుతుంది.
ఒంటి పూట భోజనం నక్తం, సోమవారం వ్రతాల ఆచరణకన్నా శివ భక్తి ముఖ్యమన్నదే శివారాధన చేసిన భక్తుల కథల ద్వారా తెలుస్తుంది. మ నసున భక్తిప్రపత్తులు నెలకొంటే, పరులను హింసించకుంటే చాలు శరీరం మాలిన్యంతో నిండినా భోళాశంకరుడు తన భక్తులను ఎంతో ఆర్తిగా అక్కు న చేర్చుకుంటాడు. నోరు తెరచి శివా అని పిలిస్తే చాలు శివుడు ఆఘ మేఘా లపై పరిగెత్తుకొచ్చి తన భక్తులను ఆదుకుంటాడు. తన వారికి ఆనంద ఐశ్వ ర్యాలను ప్రసాదిస్తాడు. అందుకే శివుడిని మంత్రం యుక్తంగానో, గొప్ప నైవే ద్యాలతో గాని ఆనందింపచేయనవసరం లేదు. అభిషేక ప్రియుడైన శివుడిని ఓ చెంబుడు నీళ్లను తలపై పోస్తూ ‘ఓం నమ: శివాయ’ అని మన సున తలిస్తే చాలు తన ఆపన్న హస్తంతో హరిహరుడు ఆదుకుంటాడు.

సోమవార వ్రత కథ
పూర్వం నిష్టాగరిష్టులైన దంపతులకు నిర్ఘరి అనే కుమార్తె ఉండేది. ఆమె చాలా అందమైనది. దానికి తగ్గట్టు పొగరు పట్టిన నడత కలది. పైగా కాముకురాలు. వివాహం అయిన తర్వాత తమ కూతురి ప్రవర్తన బాగుం టుందని తలచిన ఆమె తల్లిదండ్రులు మిత్రశర్మ అనే వ్యక్తికిచ్చి వివాహం చేశారు. సద్గుణవంతుడు, సదాచార సంపన్నుడు అయిన మిత్రశర్మ నిర్ఘరిని మార్చలేకపోయాడు. అలాగే ఆమె గుణాల వల్ల అందరూ ఆమెను కర్కశ అని పిలవడం మొదలెట్టారు. ఈ కర్కశ ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. నిర్ఘరి భర్త అమాయకత్వం చూసి పరపురుషుల సాంగత్యంలో కా లం గడిపేది. ఇతర పుణ్యవంతులను కూడా పాపానికి పురికొల్పేది. భగవం తునిపై భక్తిని పెంచుకోమని చెప్పే భర్తను తన కార్యకలాపాలకు అడ్డుగా ఉన్నాడనుకుంది. వెంటనే అతనిని అంతమొందించింది. తర్వాత తన ఇష్ట ప్రకారం తన కార్యాలను సాగించేది. ఇలా కాలం గడుపుతున్న కర్కశకు వృద్ధాప్యం వచ్చింది. దానికి తోడు కుష్టువ్యాధి పీడితురాలయ్యింది. నానా బాధలు పడింది. చివరకు కాలం తీరింది. కర్కశ యమదూతలకు చిక్కిం ది. ఆమె చేసిన పాపాలకు వారు శిక్షలు వేశారు. ఆ శిక్షలను అనుభవించి ఎన్నో జన్మలను ఎత్తింది. కర్కశ 15వ జన్మగా ఓ శునకంగా ఓ బ్రాహ్మణుడి ఇంట జన్మించింది. దాంతో దొరికిన దానితో కాలం గడుపుతూ ఉండేది. ఆ ఇంట ఉన్న బ్రాహ్మణుడు ఓ కార్తిక మాసంలో సోమవారం నాడు పగలల్లా ఉపవాసం చేసాడు. సాయంత్రం శివ పూజ చేసి నక్షత్ర దర్శనానంతరం బలి దానం చేసాడు. దానితో ఆ ఇంట ఉన్న కర్కశ కూడా అభోజనంగా ఉండిపో యింది. సాయంత్రం వేళ బలికి పెట్టిన అన్నాన్ని ఆబగా తినింది. ఆ సోమ వారం ఉపవాస ఫలితంగా ఆమెకు పూర్వ జన్మ జ్ఞానం వచ్చింది. సర్వాన్ని గ్రహించింది. బ్రాహ్మణునికి తన విషయమంతా వివరించింది. తనకు ఒక్క రోజు సోమవారం వ్రత ఫలాన్ని ఇవ్వమని వేడుకుంది. సహృదయుడు, శివ భక్తుడు అయిన ఆ బ్రాహ్మణుడు తాను ఆచరించి సంపాదించిన సోమవా రం వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. దాని ఫలంగా కుక్కగా ఉన్న కర్కశ దేహ త్యాగం చేసి శివ సాయుజ్యం పొందింది. ఈ వ్రతం ఆచరించిన వారికి, ఈ కథ విన్న వారికి కూడా పాప నాశం జరుగుతుందని ఈ సోమ వారం వ్రత ఫలితం చెబుతోంది. ఇలాంటి సోమవార వ్రతాన్ని అందరూ ఆచరించి ముక్తిని పొందుదాం.

  • దాసరి దుర్గాప్రసాద్‌
    77940 96169సర్వే జనా సుఖినో భవంతు

Advertisement

తాజా వార్తలు

Advertisement