Saturday, May 4, 2024

సకల పాపహరణం… జ్వాలాతోరణ దర్శనం

”కార్తిక వేళ భీమశంకరుని నగరమందు
దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు
వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ
ఘోర భీకర యమద్వార తోరణంబు”


అంటాడు శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహో త్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ.. ఈ రోజు కార్తిక పౌర్ణమి. ఈ పౌర్ణమి శివరాత్రితో సమానమైంది. అత్యంత పవిత్రమైనద రోజు. దీన్ని త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు. హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన ఈ రోజున దీపారాధనకు విశేష ప్రాధాన్యత వుంది. శివ, విష్ణు దేవాలయాలు రెండిం టిలోనూ దీపాలు వెలిగించాలి. విష్ణు ఆలయంలో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయ ల మీద దీపాలు వెలిగించాలి. అలాగే బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు పెట్టి దీప దానం చేస్తే సకల పాపాలు తొలగి, మోక్షం, సమస్త జ్ఞానం కలుగుతుం దని పెద్దలు చెబుతారు. ‘జ్వాలాతోరణం’ పదం పురాణ ప్రసిద్ధమైనది. దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికి నప్పడు మొదటగా హాలాహలం ఉద్భవించినది. ఇది లోకాలను సర్వనాశనము చేసే ప్రమాదం ఉన్నం దున, బ్రహ్మాదులు ఈ ఉత్పాతం నుంచి రక్షించవలసి నదని మహాశివుని ప్రార్ధించగా, మహాశివుడు ఆ హాలాహలాన్ని మ్రింగటానికి సిద్ధపడ్డాడు. ఆ హాలా హలం బయట ఉంటే పై లోకాలను, కడుపు లోనికి వెడితే అధో లోకాలను దహించి వేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠంలో నిక్షేపించాడు. ఈ దృశ్యాన్ని చూసి, పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి, శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్నిజ్వాల క్రింది నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుందిట. అందువల్ల మహాశివునికి ప్రమాదము జరుగలేదు.
అందుకే ప్రతి సంవత్సరము కార్తిక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివా లయములలో, ఎండుగడ్డితో చేసిన తోరణమును, రెండు కర్ర స్తంభముల మధ్య కట్టి, దానికి అగ్నిని ముట్టించి, ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే, ఆ జ్వాల క్రింది నుంచి శివ, పార్వతుల పల్లకీని మూడుసార్లు మోసుకొని వెడతారు. అంతేకాదు ఇహమునందు మనము చేసిన పాపముల చేత భైరవు (కుక్క)ని యొక్క దర్శనం అవుతుంది అంటారు. శరీరం విడిచి పెట్ట గానే, (భైరవ- భై అని; రవ- అరిచేది) అది నోరు తెరుచుకొని తరుముతుంది అని. చేసిన పాపాలకి శరీరం విడిచి పెట్టినప్పుడు, మంటలతో కూడిన తోర ణం క్రింది నుంచి యమపురిలోకి ప్రవేశిస్తాడు. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే, భక్తితో శివనామం చేస్తూ జ్వాలాతోరణం వెలిగించి పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఎవరు పరుగెడ తారో, వారు ఆ అగ్నితోరణం క్రింద పరుగెత్తవలసిన అవసరం ఉండదని చెప్తారు. కార్తిక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశు పక్ష్యాదులకు, క్రిమికీటకా లకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఈ ఉత్సవాన్ని తిలకించి, భస్మాన్ని నుదుటిన ధరించడంతో సకల గ్రహపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకు వచ్చి, ఇంటి చూరులోనో, గడ్డివాము లోనో ధాన్యాగారంలోనో పెడతారు. ఆ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని, సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

భక్తేశ్వర వ్రతం
కార్తిక పౌర్ణమి నుంచి ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. భక్తు రాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం అని దీనికి పేరు. పూర్వం పాండ్యు డు, కుముద్వతి దంపతులు సంతానానికి శివుని ఆరాధించగా, పరమేశ్వ రుడు ”అల్పాయుష్కుడు, మేధావి అయిన కొడుకు కావాలా, పూర్ణాయు ష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా?” అని అడిగగా, కుమారుణ్ణి కోరుకున్నారా దంపతులు. కొడుకు పుట్టాడు. ఆ కుమారుడు పెరుగుతున్న కొలదీ ఆ తల్లిదండ్రుల్లో భయం పెరుగుతోంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమారి, పిలిస్తే శివుడు పలికేటంత భక్తి, శక్తి కలదని విని, ఆ పిల్లను కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయు ష్కుడిగా మార్చుకుంటుందని ఆలోచించి వారికి వివాహం చేసారు ఆ దం పతులు. వివాహమైన కొన్నాళ్లకే విషయం తెలుసుకుని శివుడ్ని ప్రార్ధించి భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణ కథనం.
ఈరోజున స్త్రీలు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలి మిడిని చంద్రుడికి నివేదించి ఫలహారంగా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల కడుపు చలువ. అంటే బిడ్డలకు రక్ష కలుగుతుందని పెద్దలంటారు. సిక్కులకూ అత్యంత పవిత్రమైన రోజిది. మన తెలుగువాళ్లతో పాటు దేశంలో చాంద్రమానం పాటించే వాళ్లందరికీ దీపావళి అమావాస్య మరు సటి రోజు నుంచి కార్తికం మొదలవుతుంది. సౌరమానం పాటించే తమిళు లకు సూర్యుడు వృశ్చికరాశిలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రారంభమవు తుంది. బెంగాలీలకు, ఒరియా వాళ్లకు ఆశ్వీయుజ పున్నమి మర్నాటి నుం చే కార్తికం మొదలవుతుంది.
కార్తిక పున్నమి హిందువులకు మాత్రమేకాదు, సిక్కులకు, జైనులకు కూడా ఇది అత్యంత పవిత్రమైన రోజు. రాజస్తాన్‌లోని బ్రహ్మదేవుడి ఆల యం ఉన్న పుష్కర క్షేత్రంలో బ్ర#హ్మదేవుడి ప్రీత్యర్థం జరిగే పుష్కర మేళా ఏటా కార్తిక శుద్ధ ఏకాదశి నుంచి కార్తిక పున్నమి వరకు వైభవంగా జరుగు తుంది. ఈ ఐదు రోజులూ దాదాపు రెండు లక్షలకు పైగా భక్త జనవా#హనితో పాటు, పాతిక వేలకు పైగా ఒంటెలతో పుష్కర మేళాలో జరిగే ఊరేగింపు చూసి తీరాల్సిందే. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఒంటెల ఊరేగింపుగా గుర్తింపు పొందింది.

  • భువనేశ్వరి మారేపల్లి, 9550241921
Advertisement

తాజా వార్తలు

Advertisement