Sunday, April 28, 2024

ఋతు సంబంధమైన పర్వం హోలీ

పండగల ప్రాదుర్భావానికి మూడు ముఖ్య కారణాలుగా కనిపి స్తాయి. ఒకటి మహాపురుషుల జన్మదినాలు. రెండవది గొప్ప సంఘ టనలకు స్మృతి చిహ్నాలుగా జరుపుకునేవి. మూడవది ఋతువుల ను బట్టి నిర్వర్తించుకునేవి. హోలి ఋతు సంబంధ పర్వం. ప్రత్యేకిం చి వసంత రుతువుకు సంబంధించిన పండగ. మాఘమాసపు కృష్ణపక్ష పంచమి అంటే వసంత పంచమి దినాలకే, వసంత ఋతు వు లక్షణాలు పొడసూపుతాయి. కాగా ఫాల్గుణ పూర్ణిమ నాటికి అవి మరింత ప్రస్ఫుటమవుతాయి. రాగి రంగుతో చిగుళ్ళు, ఆకు పచ్చ రంగుతో పత్రాలు పలు రంగులతో పూలు దర్శనమిచ్చే సమయం. తొలకరి పంటలన్నీ ఇంటికి చేరి, పునాస పంట లన్నీ పంట ముఖాల పసిమితో ఉండే కాలమిది. ఇలా వర్ణో న్మీలనం ఈనాటి రంగులీలకు ప్రాతిపదికగా మారింది. హోలి పండగను #హందూ దేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా జరుపుకోవడం కద్దు. హోలీ పండుగను భా రతదేశంలోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను ‘వసంతోత్సవం’ పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యం త వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి.
బృందావనంలో శ్రీకృష్ణుడు గొల్లపడుచులతో వినోదిం చిన పూజకు, ఈ పండగకు కొన్ని చోట్ల సంబంధం ఉంది. బాలకృ ష్ణుని ఊయలలో పరుండచేసి, బుక్కా, గులాల్‌, ఎర్రపొడి చల్లి పూవులు వేసి, పూజ చేస్తారు. దీనిని డోల జాతరగా పిలుస్తారు. ‘డోల’ అంటే ‘ఊయల’, ఫాల్గుణ పూర్ణిమ వసంత సంబంధం. కొందరు ఔత్తరా #హకులకు ఫాల్గుణ పౌర్ణమి కడచిన మరుసటి దినం సంవ త్సరాది. దక్షిణాపథ వాసులైన కర్నాటక, మహారాష్ట్ర తెలుగు జాతీ యులకు మరోపక్షంలో చైత్ర మాసాది ఉగాది. సూర్యుడు మేషరాశిలో ప్రవే శించే దినం తమిళుల వత్సరాది. ఇవన్నీ వసంత ఋతు ప్రారంభం లోనే కావడం గమనార్హం. ఫాల్గుణ పౌర్ణమి దినమంతా ఉత్సవ దినమే. రంగులు కలిపిన నీళ్ళు ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఇలా నీళ్ళు చల్లుకునే క్రీడనే వసంతోత్సవం అంటారు.
వసంత కాలంలో వాతా వ రణం మెలమెల్లగా మారు తూ, వైరల్‌ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలడం కారణంగా, వాటి నివారణ,. ఉపశమ నానికి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారుచేసిన స#హజమైన రం గులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గు తుందని పెద్దలు చెప్పేవారు.
పూర్వకాలంలో మోదుగు పువ్వులు తెచ్చి రోట్లో పోసి దంచి, నీళ్ళతో కలిపి చల్లుకునే వారని జానపద పాటల ద్వారా గ్ర#హంప వీలగుతున్నది. మోదుగు పువ్వును దంచి శీతల కషాయం చేసి, చల్లు కోవడం వైద్య ప్రక్రియలో భాగమై, ఆరోగ్య వర్ధకమవుతుంది. మోదుగను సంస్కృతంలో ‘పలాశ’ అంటారు. బ్రహ్మచర్య వ్రత దీక్షితుడైన ఉపవీతుడైన వటునకు దండధారణ, పలాశ వృక్ష ఛాయలో ఉపనయన కార్యకలాపం, పలాశ పత్రాలతో కుట్టిన విస ్తట్లో భోజనం ఆచరణగా ఉంది. వసంత కాలంలో ఎటువంటి వారి కైనా కామోద్దీపనం కలగ డం సహజం. కామాన్ని అదుపులో ఉం చుకొనుటకు మోదుగ ఆమోఘ సాధనం. ఉద్రేకాన్ని అణిచే ఉచిత వైద్య ప్రకియ ఇది. ఇది వసంతోత్సవం, గ్రామీణ క్రీడలు, ప్రేమ కలాపాలకు సంబంధించింది. యూరోపియన్ల అల్లరి చిల్లరి చేష్టల కు, హందువుల బుక్కా, గులాల్‌, రంగు నీళ్ళు చల్లుకోవడం, చిమ్ము కోవడం, వేళాకోళాలు చేసుకోవడాలకు దగ్గరి పోలికలు ఉన్నాయి. యువత ఇంటింటికీ తిరిగి పండగ ఖర్చులకు మామూళ్ళు దండు కునే కార్యక్రమం ఎక్కడా చూసినా దర్శనమిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement