Monday, May 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 32

32
ఏవం బహువిధా యజ్ఞా:
వితతా బ్రహ్మణో ముఖే |
కర్మజాన్‌ విద్ధితాన్‌ సర్వాన్‌
ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ||

తాత్పర్యము : ఈ వివిధ యజ్ఞములన్నియును వేదములచే ఆమోదింపబడినవి మరియు అవియన్నియును వివిధ కర్మల నుండి ఉద్భవించినవి. వానిని యథార్ధరూపములో తెలుసుకొనుట ద్వారా నీవు ముక్తిని పొందగలవు.

భాష్యము : ఇంతవరకు చర్చింపబడినటువంటి వివిధ యజ్ఞములు వివిధ కర్తలకు అనుగుణముగా వేదములందు తెలుపబడియున్నవి. మానవులు దేహాత్మభావనలో సంపూర్ణముగా మగ్నులై యుందురు. కావున మనుజుడు దేహముతో గాని, మనస్సుతో గాని, బుద్ధితో గాని కర్మనొనరించు రీతిగా ఈ యజ్ఞములు నిర్ణయింపబడినవి. కాని అంత్యమున దేహము నుండి ముక్తిని పొందుట కొరకే అవి అన్నియును నిర్దేశింపబడి యున్నవి. ఈ విషయము శ్రీ కృష్ణ భగవానుని చేతనే స్వయముగా ఇచ్చట నిర్ధారితమైనది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement