Saturday, December 9, 2023

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 74
74.
ఇత్యహం వాసుదేవస్య
ప్రార్థస్య చ మహాత్మన: |
సంవాదమిమమశ్రౌషమ్‌
అద్భుతం రోమహర్షణమ్‌ ||

తాత్పర్యము : సంజయుడు పలికెను : ఈ విధముగా మహాత్ములైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుని నడుమ జరిగిన సంవాదమును నేను శ్రవణము చేసితిని. అద్భుతమైన ఆ సంవాదముచే నాకు రోమాంచమగుచున్నది.

- Advertisement -
   

భాష్యము : సంజయుడు, తన గురువైన వ్యాసదేవుని కృప వలన కురుక్షేత్ర రణ రంగమును హస్తినాపురములో ఉండి దర్శించగలిగెను. అందువలన ధృతరాష్ట్రుడు, సంజయుడిని ”కురుక్షేత్ర రణ రంగమున ఏమి జరుగుచున్నది?” అని ప్రశ్నించెను. ఇద్దరు మహాత్ములైన కృష్ణార్జునుల మధ్య జరుగుచున్న అటువంటి ఆ సంవాదము ఎన్నడునూ జరి గి యుండలేదు మరియూ ఎన్నడునూ జరుగబోదు. శ్రీకృష్ణుడే స్వయముగా తన గురించి, తన శక్తుల గురించి తన భక్తుడైన అర్జునునికి బోధించెను. మనము కూడా అర్జునుని అడుగుజాడలలో నడచినట్లైతే మన జీవితము కూడా ఉల్లాసభరితమై, మన జన్మ సార్థకమవుతుంది. ఈ వి షయమును అర్థము చేసికున్న సంజయుడు ధృతరాష్ట్రునికి వారి సంవాదము విరించి కృష్నార్జునులున్న చోట విజయము ఉంటుందని తెలిపి తన సమాధానమును ముగించెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement