Monday, April 29, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 64
64.
సర్వగుహ్యతమం భూయ:
శుణు మే పరమం వచ: |
ఇష్టోసి మే దృఢమితి
తతో వక్ష్యామి తే హితమ్‌ ||

తాత్పర్యము : నీవు నాకు ప్రియమిత్రుడవైనందున జ్ఞానములలో కెల్ల గుహ్యతమైనట్టి నా దివ్యోపదేశమును నీకు ఇచ్చుచున్నాను. ఇది నీ హితము కొరకై యున్నందున దీనిని ఆలకింపుము.

భాష్యము : శ్రీ కృష్ణుడు అర్జునునితో గుహ్యమైన బ్రహ్మ జ్ఞానమును, దాని కంటే ఉన్నతమైన పరమాత్మ జ్ఞానమును ఇప్పుడు ఉత్తమమైన జ్ఞానము అనగా ‘భగవంతునికి శరణు పొందుటను’ వివరించనున్నాడు. తొమ్మిదవ అధ్యాయము చివరలో ‘మన్‌ మనా:’ అనగా ‘సదా నన్నే స్మరింపుము’ అని చెప్పుటే కాక ఇప్పుడు కూడా దానిని గుర్తు చేసి భగవద్గీత యొక్క బోధనల సారాంశాన్ని నొక్కి వక్కానించుచున్నాడు. కేవలము భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రుడైన శుద్ధభక్తుడు మాత్రమే ఈ సారాన్ని గ్రహించగలడు. కాని సామాన్యుడు గ్రహించలేడు. వేద వాఙ్మయము యొక్క అతి ముఖ్యమైన సూచన ఇది. జ్ఞానము యొక్క అతి ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ చెప్పబోవుచున్నాడు. ఇది కేవలము అర్జునునికే గాక అన్ని జీవరాశులకూ వర్తిస్తుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement