Monday, April 29, 2024

గీతాసారం (ఆడియోతో….)

అధ్యాయం 7, శ్లోకం 21

యో యో యాం యాం తనుం భక్త:
శ్రద్ధయార్చితుమిచ్ఛతి |
తస్య తస్యాచలాం శ్రద్ధాం
తామేవ విదధామ్యహమ్‌ ||
తాత్పర్యము : నేను ప్రతివారి హృదయమునందు పరమాత్మరూపున నిలిచియుందును. ఎవరేని ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును.

భాష్యము : భగవంతుడు అందరికి స్వేచ్ఛను ప్రాసదించాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి భౌతిక ఆనందము కోసము కొందరు దేవతలను ఆశ్రయిస్తాడో, ఆ వ్యక్తి హృదయంలో పరమాత్మ రూపంలో నున్న భగవంతుడు ఆ కోరికలను గ్రహించి తగిన ఏర్పాట్లను చేస్తాడు. ఎవరైన ‘భగవంతుడు ఎందుకు అటువంటి ఏర్పాటు చేసి వారి పతనానికి అవకాశమిస్తున్నాడు?’ అని అడగవచ్చును. భగవంతుడు బలవంతము చేస్తే ఇక స్వేచ్ఛనివ్వటములో అర్థమే లేదు. అయితే తను వంతు తాను భగవద్గీత ద్వారా శరణాగతి పొందమని కూడా సూచిస్తూ ఉన్నాడు. ఇక తన స్వేచ్చను ఎలా వినియోగించుకోవాలి అనేది జీవుడి బాధ్యత. అయితే భగంతుని ఆజ్ఞ లేనిదే గడ్డి పూచైనా కదలదు అన్నట్లు, దేవతలు, జీవులు ఇద్దరూ ఆయనపైనే ఆధారపడి ఉన్నారు. శాస్త్రాలలో ఏ
దేవతను పూజిస్తే ఏ వరమిస్తారో పొందుపరచటం జరిగింది. ఇటు భక్తున్ని ప్రేరేపించటములోనూ, అటు దేవతలను వరమొసగమని ప్రేరేపించటము
లోనూ, పరమాత్మగా తన పాత్రను పోషిస్తూ ఉంటాడు. ఆయన ప్రమేయము లేరిదే ఇరువురి మధ్యా ఏ సంబంధము ఏర్పడలేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement