Sunday, December 8, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 13, శ్లోకం 12
12
అధ్యాత్మజ్ఞాననిత్యత్వం
తత్త్వజ్ఞానార్థదర్శనమ్‌ |
ఏతద్‌జ్ఞానమితి ప్రోక్తమ్‌
అజ్ఞానం యదతోన్యథా ||

తాత్పర్యము : ఆధ్యాత్మజ్ఞానపు ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్త్వము యొక్క తాత్త్వికాన్వేషణము అనునవన్నియును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే.

భాష్యము :19. ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వము :- పరిశోధనలనేవి ఆత్మను అర్థము చేసుకొనుటకే తప్ప శారీరక సుఖానికో లేక ఇతర అంశాలను తెలుసుకొనుటకో ఉపయోగించరాదు.
20.తత్త్వ జ్ఞానార్ధ దర్శనము :- ఆత్మకు, పరమాత్మకు శాశ్వతమైన సేవా సంబంధమున్నదని అర్ధము చేసుకుని భక్తి యోగములో పాల్గొనుటయే తత్త్వాన్వేషణ యొక్క చరమ లక్ష్యము.

ఈ విధముగా అనేక వ్యక్తులు తమ జ్ఞాన సముపార్జనలో పైన తెలిపిన వేర్వేరు స్థాయిలను చేరుకుని ఉండవచ్చు. అయితే భగవంతుని దాసుణ్ని అని తెలుసుకోనంతవరకూ అత్యుత్తమ స్థితని చేరుకోనట్లే లెక్క. మనము భగవంతుని అధికారాన్ని స్వీకరించనట్లయితే మాయాదేవి అధికారాన్ని పాటించవలసి వస్తుంది. ఈ సత్యాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకుని ఉండవలెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement