Friday, May 10, 2024

గీతాసారం(ఆడియతో….)

అధ్యాయం 7, శ్లోకం 8

రసోహమప్సు కౌంతేయ
ప్రభాస్మి శశిసూర్యయో: |
ప్రణవ: సర్వవేదేషు
శబ్ద: ఖే పౌరుషం నృషు ||

తాత్పర్యము : ఓ కుంతీ పుత్రా! నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్ధమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయి యున్నాను.

భాష్యము : ఈ శ్లోకములో భగవంతుడు తన భౌతిక ఆధ్యాత్మిక శక్తుల ద్వారా ఎలా వి స్తరించి ఉన్నాడో వివరించడం జరిగినది. సూర్యరశ్మి ద్వారా సూర్యభగవానుడి ఉనికిని గుర్తించినట్లు, భగవంతుని వివిధ శక్తుల ద్వారా భగవద్ధామములో నున్న దేవాదివేవుణ్ణి గుర్తించవచ్చును. ఉప్పునీరు సముద్రమంతా ఉన్నప్పటికీ దానిని త్రాగలేము. రుచిని బట్టి మనము నీటిని ఆస్వాధించగలము. అటువంటి స్వచ్ఛమైన నీటి యొక్క రుచి భగవంతుని యొక్క శక్తియై ఉన్నది. ఈ విధముగా మన దప్పిక తీర్చుటకు భగవంతుడు చక్కని ఏర్పాటు చేసినందుకు మనము ఆయనను కీర్తించవచ్చును. అలాగే భగవంతుని దేహకాంతియైన బ్ర హ్మజ్యోతి సూర్యచంద్రుల తేజస్సుకు మూలము. అలాగే ప్రతి వేదమంత్రము ముందూ ఉచ్చరించబడు ‘ఓం’ భగవంతుని శబ్ధ రూపము. ఈ విధముగా కృష్ణున్ని సదా స్మరించవచ్చును, ముక్తిని పొందవచ్చును. ఈ విషయము తెలియని వారు బంధములోనే ఉండి పోవుదురు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement