Thursday, May 16, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 12, శ్లోకం 8

8.
మయ్యేవ మన ఆధత్స్వ
మయి బుద్ధిం నివేశయ |
నివసిష్యసి మయ్యేవ
అత ఊర్ధ్వం న సంశయ: ||

తాత్పర్యము : దేవదేవుడనైన నీ యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతయు నా యందే నియుక్తము గావింపుము. ఈ విధముగా సదా నా యందే నీవు నిస్సంశయముగా నివసింతువు.

భాష్యము : భక్తుడు, భగవత్సేవలో కృష్ణునితో ప్రత్యక్ష సంబంధమును కలిగి ఉండుటచే అతడు నిస్సందేహముగా మొదటి నుండి దివ్యస్థితిలోనే ఉండును. అతడు కృష్ణునితో ఉండుటవలన భౌతిక స్థిరములో నివసించడు. భగవంతునికి అతని నామానికి భేదము లేదు. కనుక భక్తడు హరేకృష్ణ జపించినంతనే కృష్ణుడు అతని నాలుకపై నాట్యము చేయును. భగవంతునికి నైవేద్యము అర్పించినంతనే, కృష్ణుడు వాటిని స్వీకరించును కనుక, భక్తుడు అట్టి ప్రసాదమును స్వీకరించి కృష్ణచైతన్యవంతుడగును. అయితే శాస్త్రాలలో, అందునా భగవద్గీత యందు ఇవన్నీ చెప్పబడినా ఎవరైతే ఇటువంటి సేవలో నియుక్తులు కారో, వారు ఇది ఎలా పనిచేస్తుందో అర్ధము చేసుకోలేరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement