Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 21
21.
అమీ హి త్వాం సురసంఘా విశంతి
కేచిద్భీతా: ప్రాంజలయో గృణంతి ||
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘా:
స్తువంతి త్వాం స్తుతిభి: పుష్కలాభి: ||

తాత్పర్యము : దేవతా సమూహాలన్నియును నిన్ను శరణువేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు మిగుల భయ విహ్వాలురై దోసిలి యొగ్గి ప్రార్థనలను గావించుచున్నారు. మహర్షులు, సిద్ధసమూహములు ”శాంతి, శాంతి” యని పలుకుచు వేదమంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు.

భాష్యము : ఉన్నత లోకాలలో ఉన్న దేవతలు సైతమూ విశ్వరూపము యొక్క అద్భుతాలను, ఘోర రూపాన్ని మరియు తేజస్సును చూసి భయపడిరి. వారందరూ రక్షించమని ప్రార్థనలు చేసెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement