Thursday, May 2, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 11
11.
తేషామేవానుకంపార్థమ్‌
అహమజ్ఞానజం తమ: |
నాశయామ్యాత్మభావస్థో
జ్ఞానదీపేన భాస్వతా ||

తాత్పర్యము : నేను వారి యెడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయము నందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానజనితమగు అంధకారమును నశింపజేయుదును.

భాష్యము : అనేకమంది భక్తులకు జ్ఞానము లేదని మూఢ విశ్వాసముతో పూజలు పునస్కారాలు చేస్తుంటారని చులకన చేస్తూ ఉంటారు. ఇక్కడ కృష్ణుడు స్వయముగా దానికి సమాధానమిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు భక్తుడు శాస్త్రాలను అర్ధము చేసుకోవటములోనో లేక గురువు సూచనలలోని లోతుపాతులను గ్రహించుచుటలోనూ అవగాహన లోపించినప్పుడు హృదయములో నున్న శ్రీకృష్ణుడు అతనికి తగిన జ్ఞానాన్ని ప్రసాదించి భక్తిలో ముందుకెళ్ళేటట్లు చేస్తాడు. భక్తుడు చిత్తశుద్ధితో ”హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే” అను మంత్రాన్ని ఉచ్ఛరించినచో అజ్ఞానాన్ని భగవంతుడు తొలగిస్తాడు. శ్రీకృష్ణుడు అటువంటి భక్తుడి భాధ్యతను స్వీకరిస్తాడు కాబట్టి తాను ప్రత్యేకముగా భౌతిక ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు. ఇదే భగవద్గీతా భోధనల సారాంశ ం.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement