Monday, May 6, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 7, శ్లోకం 28

యేషాం త్వంతగతం పాపం
జనానాం పుణ్యకర్మణామ్‌ |
తే ద్వంద్వమోహనిర్ముక్తా
భజంతే మాం ధృడవ్రతా: ||

తాత్పర్యము : పూర్వజన్మలందు, ప్రస్తుత జన్మము నందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగా నశింపచేసికొనిన మనుజులు ద్వంద్వమోహముల నుండి విడివడినవారై నా సేవ యందు దృఢవత్రముతో నెలకొనెదరు.

భాష్యము : ఈ శ్లోకములో దివ్యస్థితిని పొందుటకు ఎవరు అర్హులగుదురో వివరించబడినది. నాస్తికులుగా, మూఢులుగా, కపటులుగా, పాపులుగా కొనసాగే వారికి ఇచ్చా ద్వేషాలను అధిగమించటం సాధ్యము కాదు. కేవలము ఎవరైతే పుణ్యాత్ములో, నియమిత ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుదురో వారు భగవద్భక్తిని స్వీకరించి క్రమేణా భగవత్‌ తత్త్వాన్ని అర్థము చేససుకొనగలుగుదురు. ఇటువంటి పురోగతి శుద్ధ భక్తుల సాంగత్యములో సులభముగా పొందవచ్చును. ఎందువలనంటే అట్టి సాంగత్యములో ఎవరైనా ఇచ్చాద్వేషాల నుండి బయటపడే అవకాశము ఉంటుంది. కాబట్టి భక్తులు ఈ భూమిపై పర్యటిస్తూ ఇటువంటి అవకాశాన్ని అందరికీ అందిస్తూ ఉంటారు. అయితే భగవంతుని కి విధేయులు కానివారు భగవంతుని చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉంటారు కనుక వారు భగవంతుణ్ణి అర్థము చేసుకొనలేరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement