Sunday, April 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 50
50
బుద్ధియుక్తో జహాతీహ
ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ
యోగ: కర్మసు కౌశలమ్‌ ||

తాత్పర్యము : భక్తియోగమునందు నియుక్తుడైన వాడు ఈ జన్మమునందే శుభాశుభఫలముల నుండి ముక్తుడగును. కనుక కర్మయందలి శ్రేష్ఠమైనటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము.

భాష్యము : అనాదిగా జీవుడు రకరకాల కర్మ ఫలములను కూడబెట్టుకుని ఉంటాడు. వాటిలో కొన్ని మంచివి అయితే మరికొన్ని చెడ్డవి. వాటిలో మునిగిపోయి తన నిజస్వరూపాన్ని మరచిపోతాడు. అటువంటి అజ్ఞానమును తొలగించుటకే భగవద్గీత ఉపదేశింపబడినది. భగవద్గీత యందు భగవంతునికి శరణు పొందుట ద్వారా జన్మ మృత్యు బంధనము నుండి ఎలా బయటపడవచ్చునే తెలియజేయబడినది. ఏ విధమైన కార్యముల ద్వారా ప్రతికార్యములు రాకుండా ఉంటాయో వివరించటమైనది. కాబట్టి కృష్ణుడు అర్జునున్ని కృష్ణ చైతన్యములో కార్యములు చేయమని సలహా ఇచ్చుచున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement