Wednesday, May 1, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 34
34
ఇంద్రియస్యేంద్రియస్యార్థే
రాగద్వేషా వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్ఛేత్‌
తౌ హ్యస్య పరిపంథినా ||

అర్థము : ఇంద్రియములు, ఇంద్రియ భోగవస్తువుల సంపర్కములోనికి వచ్చినప్పుడు కలుగు రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమములు కలవు. అట్టి రాగద్వేషములు ఆత్మజ్ఞాన పథములో ఆటంకముల వంటివి గనక వాటికి ఎవ్వరునూ వశము కాకూడదు.

భాష్యము : యధేచ్చగా ఇంద్రియ తృప్తి చేయటయే మన ఈ భౌతిక బంధనానికి కారణము. కావున ఇంద్రియ భోగము ద్వారా ఆనందించాలనుకునే వారికి నియమ నిబంధనలు తప్పవు. శాస్త్రములో అట్టి నియమ నిబంధనలు తెలయజేయబడ్డాయి. అయితే ఆ నియమ నిబంధనలు ముసుగులో ఇంద్రియ తృప్తికి అలవాటు పడరాదు. మనము ఎంతో కాలముగా ఇంద్రియ తృప్తికి బానిసలము అగుట వలన అట్టి అలవాటు మళ్లిd ప తనానికి కే కారణము కాగలదు. కాబట్టి కృష్ణుని పట్ల ప్రేమైక సేవ ద్వారా, కృష్ణ చైతన్యాన్ని పెంపొందిచుకోవటమే మిగిలిన ఆకర్షణల నన్నింటి నుండి మనలి ్న దూరంగా ఉంచగలుగుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement