Friday, April 26, 2024

నేటి రాశి ప్ర‌భ (28-11-21)

మేషం : వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

వృషభం… పనుల్లో ఏకాగ్రత అవసరం. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం : పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు పరిష్కరించుకుంటారు. వాహనయోగం. సన్నిహితుల నుంచి ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం : శ్రమ తప్పదు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధు మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం : కొత్త వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.

- Advertisement -

కన్య : రుణబాధలు తొలగుతాయి. ఆప్తులతో సఖ్యత. విందు వినోదాలు. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

తుల : పనుల్లో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారవచ్చు.

వృశ్చికం : ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది.

ధనుస్సు : పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. మిత్రుల చేయూత లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

మకరం : సన్నిహితులతో విభేదాలు తీరతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

కుంభం : పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

మీనం : మానసిక అశాంతి. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. సోదరులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement