Friday, May 17, 2024

ధర్మం – మర్మం(ఆడియోతో..)

గంగా ఆవిర్భావ వృత్తాంతములో సగర చక్రవర్తి సంతానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

గంగా ఆవిర్భావ వృత్తాంతములో సగర చక్రవర్తి సంతానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

సంతానము కొరకు సతుల సమేతంగా ఔర్వ మహర్షిని పూజించగా ఒక భార్యకి వంశమును ఉద్దరించు ఒక కుమారుడు ఇంకొక భార్యకి అరవై వేలమంది పుత్రులు కలిగెదరని ఔర్వ మహర్షి సగరునికి వరమిచ్చెను. ఋషి వరమునకు అనుగుణంగా అతనికి పుత్రులు కలుగగా సగర చక్రవర్తి ఆ పుత్రులతో కలసి చాలా యజ్ఞములను ఆచరించెను. సగర చక్రవర్తి అశ్వమేధ యాగము చేయుచుండగా ఆ అశ్వమును రక్షించమని తన పుత్రులను నియమించెను. అదే సమయమున ఇంద్రుడు ఒక హయమును(ఆశ్వము) అపహరించెను. అరవై వేల మంది పుత్రులు నానా యుద్ధ విశారదులు అయిననూ వారు చూస్తుండగానే రాక్షసులు ఆ అశ్వమును రసాతలమునకు తీసుకునిపోయిరి. రాక్షసుల మాయను చూడలేకపోయిన సగర పుత్రులు అశ్వమును చూడజాలక అన్ని వైపులా వెతికినా దాని జాడ కనుగొనలేకపోయిరి. అశ్వము కోసం దేవలోకమున మరియు పర్వతములను, వనములను, సరస్సులలోను వెతికిననూ అశ్వము జాడ కానరాలేదు. అటు పిమ్మట భూమండలమంతా కూడా వెతి కిరి. తుదకు సగర పుత్రులు శ్రద్ధాళువులై పరిశుద్ధులై మూడు సార్లు ఆచమనం చేసి సర: ప్రాంతమున నిలబడి అశ్వము జాడ తెలుపమని భగవంతునిని ప్రార్థించెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement