Sunday, April 28, 2024

ధర్మం – మర్మం (ఆడియోతో)

గంగా ఆవిర్భావ వృత్తాంతంలో భాగంగా తారకాసుర సంహారం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

తారకాసుర సంహార వృత్తాంతం :
కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మహాబలశాలి అయిన తారకాసురుడను రాక్షసుడు బ్రహ్మచే వరం పొంది గర్వంతో దేవతల పరమైశ్వర్యమును
హరించెను. దేవతలందరూ సర్వ జగత్తులకు ప్రపితామహుడైన శ్రీమన్నారాయణుని శరణు వేడుతూ జగన్నాధుడవు, దేవతల కీర్తి పెంచువాడవు, సర్వేశ్వరుడవు, జగత్కారకుడవు, ఆపదలు వచ్చిన మానవాళికి నువ్వు తప్ప మరో రక్షకుడు లేడంటూ తమకు సంభవించిన రాక్షస భయాన్ని తొలగించి కాపాడమని కోరిరి. తారకాసరుడను రాక్షసుడి వలన తమకు ముప్పు వాటిల్లిందని ఆ రాక్షసుడిని యుద్ధముతో, తపస్సుతో, శాపములతో సంహరించలేమని కేవలం 10 రోజులలోపు వయస్సున్న శిశువుతో మాత్రమే అతను సంహరించబడును కావున తగిన నీతిని, తరుణోపాయమును సూచించమని దేవతలు శ్రీహరిని కోరిరి. దానికి శ్రీహరి తారకాసురుడు తన వల్లగానీ, తన సంతానం వల్ల గానీ, ఇతర దేవతలు, రాక్షసులు వల్ల గానీ వశించబడడు కానీ శంకరునికి పుట్టబోవు కుమారుడైన కుమారస్వామి వలనే తారకుడు సంహరించబడునని శ్రీహరి తెలిపెను. ప్రస్తుతం శంకరుడు హిమాలయాలపై తపస్సులో నిమగ్నమై ఉన్నాడు కావున ముందుగా శంకరుని వివాహానికి ప్రయత్నాలు జరపాలని పలుకగా దేవతలందరూ మేన, హిమవంతుని సన్నిధికి వెళ్ళిరి.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement