Thursday, May 2, 2024

నవంబరు నెల వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల..

తిరుమల : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అక్టోబరు 26వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో ఉచిత దర్శన టోకెన్లు బుక్‌ చేసుకోవాలని కోరడమైనది.

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. నిన్న సూర్యగ్రహణంగా కారణంగా ఆలయం ఉదయం నుంచి రాత్రి వరకు మూసివేశారు. రాత్రి 8.30 నిమిషాలకు సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరవగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నాలుగు కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండగా వీరికి నాలుగు గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement